Arshdeep Singh: నేను బంతికి భయపడతా అంటారు.. కానీ ఎలా ఆడనో చూశారు కదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Funny Comments About His Batting: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్య ఛేదనలో కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆర్ష్‌దీప్ కీలక 14 పరుగులు చేయడంతో పాటు బంతితో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
నాకు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం:
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆర్ష్‌దీప్ సింగ్ తన బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బంతిని చూసి భయపడతానని సహచర ఆటగాళ్లు ఆటపట్టించినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా బంతిని గట్టిగా కొట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ‘నాకు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఆస్వాదిస్తాను. క్రీజులో నాకు నేను స్థలం సృష్టించుకుని బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నిస్తుంటాను. అయితే మా జట్టులో కొందరు నేను బంతికి భయపడతానని అంటుంటారు. కానీ నేను మాత్రం బంతిని బాగా ఎదుర్కొంటా. నాకు కావాల్సిన స్థలం సృష్టించుకుని ఆడతాను. ఈరోజు బాగా ఆడాను. మీరు కూడా చూశారు కదా’ అని ఆర్ష్‌దీప్ సరదాగా చెప్పాడు.
Also Read
- Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
- ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
- Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
- Mitchell Santner: భారత్‌ను కట్టడి చేశాం.. కానీ అవే మా కొంపముంచాయి.. కివీస్ కెప్టెన్ ఆవేదన..
ఆ పరుగులు చాలా కీలకం:
చివరి వికెట్‌కు మహమ్మద్ సిరాజ్ (14)తో కలిసి తాను చేసిన 14 పరుగులు జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ‘బ్యాటింగ్ ముగిసిన తర్వాత కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం. ఈ పరుగులు చాలా కీలకమని సిరాజ్ నాతో చెప్పాడు. ఎలాగైనా 200 పరుగుల మార్కును దాటాలని మేము భావించాం. ఆ చిన్న మైలురాయిని చేరుకోవడంతో బౌలింగ్ చేయడానికి మా చేతిలో కొంత స్కోరు ఉందనే నమ్మకం కలిగింది’ అని వివరించాడు. బౌలింగ్‌లో క్రమశిక్షణతో సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే తమ విజయానికి కారణమని ఆర్ష్‌దీప్ పేర్కొన్నాడు. ‘వెంటవెంటనే వికెట్లు రాకపోయినా.. ఆశించిన ఫలితాలు కనిపించకపోయినా.. మేం మా ప్రణాళికను వదులుకోలేదు. క్రమశిక్షణతో ఒకే ప్రాంతాల్లో బౌలింగ్ చేస్తూ వచ్చాం. చివరకు దాని ఫలితం దక్కింది. మ్యాచ్‌లో గెలిచాం. చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.
నాకు మంచి భాగస్వామి దొరికింది:
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనకు మంచి భాగస్వామి దొరకడం దేవుడిచ్చిన వరమని, ఆమె ఎప్పుడూ తనకు అండగా ఉంటూ సరైన మానసిక స్థితిలో ఉండేందుకు సహాయపడుతుందని తెలిపాడు. మైదానంలో తన ప్రదర్శనపై మైదానం బయట తన జీవనశైలి, ఆలోచనా విధానం ప్రభావం చూపుతాయని.. అందులో తన భాగస్వామికి కూడా ఎంతో క్రెడిట్ ఉంటుందని పేర్కొన్నాడు. కొత్త ఫ్రాంచైజీకి మారడం, నిశ్చితార్థం వంటి పరిణామాలతో తన జీవితం ఎంతో ఉత్సాహంగా సాగుతోందని చెప్పాడు. మౌంట్ మాంగనూయ్ బీచ్‌లో తన భాగస్వామి సామ్రీన్ కౌర్‌కి ప్రపోజల్ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘అంతకంటే మంచి దృశ్యాన్ని కోరుకోలేం. ఆ సమయంలో నాకు కొంత టెన్షన్‌గా అనిపించింది. కానీ అక్కడి అందమైన దృశ్యం ఆ ఉత్కంఠను తగ్గించింది. ఆ అనుభూతి చాలా బాగుంది’ అని ఆర్ష్‌దీప్ వెల్లడించాడు.
తాజావార్తలు
-
Arshdeep Singh: నేను బంతికి భయపడతా అంటారు.. కానీ ఎలా ఆడనో చూశారు కదా!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
CE-25A Electric Aircraft: 22,000 పౌండ్ల ఎలక్ట్రిక్ విమానం.. చైనా CE-25A తొలి పైలట్ ఫ్లైట్ సక్సెస్
-
AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
PM Modi Manila Visit 2026: PM మోడీ మనీలా పర్యటన.. ఆసియాన్ సదస్సులో భారత్ ప్రధాన లక్ష్యాలివే
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!