Top 5 Indian Bowlers: టాప్-5 భారత బౌలర్లు.. జస్ప్రీత్ బుమ్రాకు చోటే లేదు.. నంబర్-1 ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Top 5 Indian Bowlers: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన టాప్-5 భారత బౌలర్ల జాబితాను ఎంచుకున్నాడు. అయితే ఈ జాబితాలో ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాకు చోటు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రముఖ యూట్యూబర్ కృష్ణాంక్ అత్రే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అర్ష్‌దీప్.. టీమిండియా టాప్-5 బౌలర్లను ఎంచుకున్నాడు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు తెలిపాడు. ఈ జాబితాలో వెటరన్ పేసర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌కు అర్ష్‌దీప్ అగ్రస్థానం కట్టబెట్టాడు.
భువనేశ్వర్ కుమార్‌కు నంబర్-1 స్థానం ఎందుకు ఇచ్చాడో కూడా అర్ష్‌దీప్ సింగ్ వివరించాడు. ‘భువీ భాయ్ నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైన బౌలర్. అందుకే కొంచెం పక్షపాతం ఉండొచ్చు. కొత్త బంతితో భువనేశ్వర్ చూపించే నియంత్రణ అద్భుతంగా ఉంటుంది. అతని స్వింగ్ బౌలింగ్‌ను నేను చాలా ఇష్టపడతాను. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అద్భుత ఆరంభాలు ఇస్తాడు. వికెట్స్ పడగొడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతాడు’ అని చెప్పాడు. రెండో స్థానంలో మహ్మద్ షమీని ఎంపిక చేశాడు. ‘ఏ పిచ్‌పై అయినా సీమ్ మూవ్‌మెంట్‌ను రాబట్టే అరుదైన నైపుణ్యం షమీకి ఉంది. అతని సీమ్ పొజిషన్, బౌలింగ్ టెక్నిక్ అసాధారణం. షమీ భాయ్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు’ అంటూ ప్రశంసించాడు.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
అర్ష్‌దీప్ సింగ్ జాబితాలో మూడో స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ‘కుల్దీప్కు చాలా అరుదైన స్కిల్‌సెట్ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తారు’ అని పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో యుజ్వేంద్ర చహల్‌కు చోటు కల్పించాడు. పంజాబ్ జట్టులో కలిసి ఆడుతున్న కారణంతో పాటు చహల్ వికెట్ల రికార్డు అద్భుతంగా ఉండటమే తన ఎంపికకు కారణమని చెప్పాడు. ఐదో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను అర్ష్‌దీప్ ఎంపిక చేశాడు. ‘అశ్విన్ భాయ్‌ను చివరి స్థానంలో ఉంచాలని నాకు లేదు. కానీ మిగతా స్థానాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అందుకే ఐదో స్థానంలో పెట్టాల్సి వచ్చింది. ఆయన గొప్ప బౌలర్. ఐపీఎల్లో పంజాబ్ తరఫున నాకు తొలి కెప్టెన్ కూడా ఆయనే. ఈ విషయానికి వ్యక్తిగతంగా ఆయనకు క్షమాపణ చెబుతున్నా’ అని నవ్వులు పూయించాడు.
అయితే అర్ష్‌దీప్ సింగ్ తన జాబితాలో జస్ప్రీత్ బుమ్రాకు చోటు లేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా గుర్తింపు పొందాడు. అయినప్పటికీ అర్ష్‌దీప్ జాబితాలో అతడికి స్థానం దక్కకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 52 టెస్టులు, 91 వన్డేలు, 95 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 500లకు పైగా వికెట్స్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!