ArshDeep Singh: దేశద్రోహి అంటూ పిలిచిన అభిమాని.. అర్ష్‌దీప్ ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ArshDeep Singh: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో ఓడిపోయింది. కీలక సమయంలో టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కొందరు అతడిని ఖలిస్థాన్ దేశస్థుడిగా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అర్ష్‌దీప్ సింగ్ పట్టించుకోకుండా శ్రీలంకతో మ్యాచ్ ఆడాడు. తనపై వచ్చిన కామెంట్స్‌ను చూసి నవ్వుకున్నానని అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా చెప్పాడు. అయితే శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత బస్ ఎక్కుతుంటే ఓ అభిమాని ఆగ్రహాన్ని అర్ష్‌దీప్ కళ్లారా చూశాడు.
Read Also: World Largest Pen: ప్రపంచంలోనే అతి పెద్ద పెన్ను.. దీని ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్చపోతారు
Also Read
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
మంగళవారం నాడు శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా బస్సు ఎక్కేందుకు వచ్చాడు. అతడు బస్సు ఎక్కుతుండగా అక్కడే ఉన్న ఓ అభిమాని అర్ష్‌దీప్‌ను చూసి ‘దేశద్రోహి వచ్చాడు’ అంటూ పంజాబీలో కామెంట్ చేశాడు. ఈ మాట అర్ష్‌దీప్ చెవిన పడటంతో బస్సు ఎక్కి అద్దంలో నుంచి ఆ అభిమాని వైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ బస్సు లోపలకు వెళ్లిపోయాడు. అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ మాత్రం సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఏం చేస్తున్నావు అంటూ నిలదీశాడు. అతడు ఇండియా ప్లేయర్ అని.. కించపరుస్తూ మాట్లాడటం సరికాదని సెక్యూరిటీ సిబ్బందికి అతడిపై జర్నలిస్ట్ ఫిర్యాదు చేశాడు. కాగా తనది కూడా ఇండియానే అని సదరు అభిమాని చెప్పడం గమనార్హం.
https://twitter.com/mallucomrade/status/1567371649888157698
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!