ArshDeep Singh: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో ఓడిపోయింది. కీలక సమయంలో టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కొందరు అతడిని ఖలిస్థాన్ దేశస్థుడిగా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అర్ష్‌దీప్ సింగ్ పట్టించుకోకుండా శ్రీలంకతో మ్యాచ్ ఆడాడు. తనపై వచ్చిన కామెంట్స్‌ను చూసి నవ్వుకున్నానని అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా చెప్పాడు. అయితే శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత బస్ ఎక్కుతుంటే ఓ అభిమాని ఆగ్రహాన్ని అర్ష్‌దీప్ కళ్లారా చూశాడు.
Read Also: World Largest Pen: ప్రపంచంలోనే అతి పెద్ద పెన్ను.. దీని ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్చపోతారు
మంగళవారం నాడు శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా బస్సు ఎక్కేందుకు వచ్చాడు. అతడు బస్సు ఎక్కుతుండగా అక్కడే ఉన్న ఓ అభిమాని అర్ష్‌దీప్‌ను చూసి ‘దేశద్రోహి వచ్చాడు’ అంటూ పంజాబీలో కామెంట్ చేశాడు. ఈ మాట అర్ష్‌దీప్ చెవిన పడటంతో బస్సు ఎక్కి అద్దంలో నుంచి ఆ అభిమాని వైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ బస్సు లోపలకు వెళ్లిపోయాడు. అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ మాత్రం సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఏం చేస్తున్నావు అంటూ నిలదీశాడు. అతడు ఇండియా ప్లేయర్ అని.. కించపరుస్తూ మాట్లాడటం సరికాదని సెక్యూరిటీ సిబ్బందికి అతడిపై జర్నలిస్ట్ ఫిర్యాదు చేశాడు. కాగా తనది కూడా ఇండియానే అని సదరు అభిమాని చెప్పడం గమనార్హం.
https://twitter.com/mallucomrade/status/1567371649888157698
