Site icon NTV Telugu

Team India: పంత్ మళ్లీ విఫలం.. ఆటాడుకుంటున్న సంజు ఫ్యాన్స్

Rishab Pant

Rishab Pant

Team India: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ పంత్ విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులకే అవుటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్ ఆచితూచి ఆడతాడని అభిమానులు భావించారు. కానీ 16 బంతుల్లో రెండు ఫోర్లు సహాయంతో 10 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో సంజు శాంసన్ అభిమానులు పంత్‌ను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ హోదాలో అవకాశాలు సాధిస్తూ పంత్ జట్టుకు భారంగా తయారయ్యాడని విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా పంత్‌ను పక్కనపెట్టాలని.. ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also: Andhra Pradesh: ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ.. మొత్తం ఊడ్చేశారు

మరోవైపు సంజు శాంసన్‌కు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా అండగా నిలిచాడు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడిలానే అవకాశాలు ఇవ్వకుండా సంజూ శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారని మండిపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సంజూ శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వకుండా బీసీసీఐ, సెలెక్టర్ల వివక్ష చూపుతున్నారని కనేరియా ఆరోపించాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి వన్డే ఆడిన పర్వాలేదనిపించిన సంజూ శాంసన్‌ను రెండో వన్డేకు ఎక్స్‌‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం పక్కనపెట్టడాన్ని తప్పుబట్టాడు. గతంలో కూడా ఎక్స్‌ట్రా బౌలర్ ఆప్షన్ కోసం రాయుడిని పక్కనపెట్టి విజయ్ శంకర్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చి తప్పుచేశారని.. ఇప్పుడు మరోసారి తప్పుచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశాడు.

https://twitter.com/cricket_zn/status/1597792676338110465

Exit mobile version