Rohit-Kohli: అభిమానుల కోసమే ఆడుతున్నారు.. రో-కోలను తక్కువగా చూడటం సరికాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం ఐదు పరుగులకే పెవిలియన్ చేరాడు. అంతకుముందు నాలుగో వన్డేలోనూ డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. చివరి మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఐదో వన్డేలో ఏడు పరుగులకే ఔటయ్యాడు. గత మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన రోహిత్.. ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల వన్డే జట్టులో కొనసాగింపుపై చర్చ మొదలైంది. అయితే కోహ్లీ, రోహిత్ ప్రదర్శనను ఒకటి రెండు మ్యాచ్‌ల ఆధారంగా అంచనా వేయకూడదని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. గత 12-14 ఏళ్లుగా భారత క్రికెట్‌కు ఈ ఇద్దరూ ఎంతో సేవ చేశారని.. 1-2 మ్యాచ్‌లో పరుగులు చేయనంత మాత్రాన వారి స్థాయిని తక్కువగా చూడటం సరికాదని స్పష్టం చేశాడు.
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన అజయ్ జడేజా.. ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లను అభిమానులు లేదా మరెవరైనా ఒక్క రోజు, ఒక సిరీస్ ఆధారంగా అంచనా వేయకూడదు. గత 12-14 ఏళ్లుగా ప్రతి పర్యటనలోనూ వారు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పర్యటనలో వారిద్దరి ఆటలో స్వేచ్ఛ కనిపించింది. కెరీర్లో ఈ దశలో అభిమానులను అలరించడమే లక్ష్యంగా ఆడుతున్నారు. ఒక మ్యాచ్‌లో పరుగులు చేయకపోవడం క్రికెట్లో సహజం. త్వరగా ఔటవడం కూడా ఆటలో భాగమే. ప్రతి ఆటగాడు పర్యటనను మంచి ప్రదర్శనతో ముగించాలని కోరుకుంటాడు. అయితే న్యూజిలాండ్‌లో చివరి రోజు విఫలమైనంత మాత్రాన కోహ్లీ, రోహిత్ సాధించిన విజయాలు మరుగున పడవు. ఇన్నేళ్లుగా నిలకడగా సాధించిన విజయాలే వారి అసలైన గుర్తింపు’ అని పేర్కొన్నాడు.
Also Read
- Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చెప్పింది నిజమే.. టీమిండియా బ్యాటింగ్‌పై ఆందోళన!
- Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
- Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన జడేజా.. ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ మైదానంలో అతడి అసలైన వ్యక్తిత్వం కనిపించిందని ప్రశంసించాడు. కోహ్లీ ఆటను చూడటానికే అభిమానులు స్టేడియాలకు వస్తారని.. అతడు త్వరగా ఔటైనా మైదానంలో ఉత్సాహంగా ఉండటం, జట్టును ప్రోత్సహించడం అభిమానులకు ఆనందాన్నిస్తుందని చెప్పాడు. ఒక క్యాచ్ జారవిడిచిన సందర్భంలో కోహ్లీ తనదైన శైలిలో అసహనం, ఆవేశం ప్రదర్శించాడని జడేజా గుర్తుచేశాడు. అభిమానులు చూడాలనుకునే కోహ్లీ అంటే మైదానంలో ఎప్పుడూ ఎనర్జీతో ఉండే ఆటగాడని, ఐదో వన్డేలో కూడా అదే కోహ్లీని చూశామని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్‌లో ఐదు పరుగులకే వెనుదిరిగినా.. మైదానంలో అతడి ఉత్సాహం మాత్రం తగ్గలేదని కొనియాడాడు.
తాజావార్తలు
-
Rohit-Kohli: అభిమానుల కోసమే ఆడుతున్నారు.. రో-కోలను తక్కువగా చూడటం సరికాదు!
-
OM Movie Title Changed: షాకిచ్చిన సెన్సార్.. ‘ఓం’ టైటిల్లో మార్పు..!
-
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చెప్పింది నిజమే.. టీమిండియా బ్యాటింగ్‌పై ఆందోళన!
-
Gold and Silver Price: కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
-
Amitabh Bachchan: ‘మెగాస్టార్’ ఇంటిపై కాల్పులకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!