Site icon NTV Telugu

Aiden Markram : కేకేఆర్‌ గురించి నాకు ముందే తెలుసు

Markram

Markram

ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్ లో వరుసగా ఎస్ ఆర్ హెచ్ వరుసగా రెండో విజయం అందుకుంది. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా ( 75 ), రింకూ సింగ్ ( 58 ) అద్భతమై బ్యాటింగ్ తో రాణించినప్పటకీ కేకేఆర్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఎస్ ఆర్ హెచ్ బౌలర్లలో జానెసన్, మార్కండే రెండు వికెట్లు, భువనేశ్వర్, నటరాజన్ తలా వికెట్ తీసుకున్నారు.

Read Also : Brett Lee: బ్రెట్ లీ కారును వెంబడించిన ఇద్దరు యువకులు

ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్ర్కమ్ స్పందించాడు. మా హోమ్ గ్రౌండ్ లో కాకుండా స్టేడియంలో తొలి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ లో మార్ర్కమ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ చాలా క్లోజ్ గా వెళ్తుందని నాకు ముందే తెలుసు.. కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం.. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు.. అదే విధంగా మాకు బ్యాటింగ్ లో అద్భుతమైన ఆరంభం లభించిందని మార్ర్కమ్ అన్నారు.

Read Also : Jess Jonassen: బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్

అదే జోరును ఇన్సింగ్స ఆఖరి వరకు కొనసాగించాం.. మాకు చాలా బ్యాటింగ్ లైనఫ్ ఉంది కాబట్టి బ్యాటర్లకు పూర్తి స్వే్చ్ఛను ఇచ్చాం. హ్యారీ బ్రూక్ ఎటువంటి ఆటగాడో మనందరికీ తెలుసు.. మరోసారి అతడు తాను ఎంటో నిరూపించుకున్నాడు.. అటువంటి ఆటగాడు కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే హ్యారీ విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు ఇచ్చాం.. ఆఖరిగా ప్రతీ మ్యాచ్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకుంటాం అని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్ర్కమ్ వెల్లడించారు.

Exit mobile version