AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AFG vs IND 1st T20 playing XI: అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ పిచ్ పరిస్థితులు, ఇక్కడ గతంలో ఆడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా బౌలింగ్ చేయాలనుంటున్నాం అని చెప్పాడు. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్య దేశంగా ఉండగా.. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీనే ఆతిథ్యం ఇవ్వనుంది.
తొలి టీ20 తుది జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో లేడు. వీరిద్దరికీ తుది జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై టాస్ అనంతరం శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబినేషన్ ఎంపిక చాలా కష్టమైన విషయమని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్, సుందర్ సహా మరో ఇద్దరు ఆటగాళ్ల విషయంలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నాడు. వైభవ్ స్థానంలో సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేపై ఆడిన బుడ్డోడు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సంజు ఆడించకపోవడంతో విమర్శలు రావడంతో.. సూర్యవంశీని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
- Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
- Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
భారత్ టీ20 కెప్టెన్‌గా తన తొలి పది మ్యాచ్‌ల అనుభవం గురించి కూడా శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఇప్పటివరకు తన ప్రయాణం రోలర్‌కోస్టర్ రైడ్‌లా సాగిందని చెప్పాడు. అయితే జింబాబ్వేతో జరిగిన గత సిరీస్‌లో ఎన్నో సానుకూల అంశాలు కనిపించాయని, ఆటగాళ్లు మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపాడు. అదే దూకుడు, సానుకూల దృక్పథాన్ని అఫ్గానిస్థాన్ సిరీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో అందుబాటులో ఉండటం టీమిండియాకు పెద్ద బలమని అన్నాడు. బుమ్రాకు అపారమైన అనుభవం ఉందని, మ్యాచ్‌లను గెలిపించగల సత్తా అతడికి ఉందని ప్రశంసించాడు.
ప్లేయింగ్ ఎలెవన్:
భారత్: సంజు శాంసన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
అఫ్గానిస్థాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), సెదిఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమన్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!