Site icon NTV Telugu

Abdul Qadir: పనిమనిషిపై అత్యాచారం చేసిన స్టార్ క్రికెటర్ కుమారుడు..

Abdul Qadir

Abdul Qadir

Abdul Qadir: పాకిస్తాన్ లెజండరీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ ఖాదిన్ తన ఫామ్‌హౌజ్‌లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనకు పాల్పడిన సులేమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పనిమనిషి ఫిర్యాదుతో పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read Also: Sound Pollution : బైక్ సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల ఉక్కుపాదం..

అబ్దుల్ ఖాదిర్ నలుగురు కుమారుల్లో సులేమాన్ ఒకరు. తాను సులేమాన్ ఇంటిలో పనిచేస్తున్నానని, తనను బలవంతంగా ఫామ్‌హౌజ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. మహిళ ఫిర్యాదు తర్వాత ఆమెను వైద్య పరీక్షలకు పంపామని, ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి జరిగిందో లేదో నిర్ధారణకు వస్తామని పోలీస్ అధికారి తెలిపారు.

41 ఏళ్ల సులమాన్ 2005 మరియు 2013 మధ్య 26 ఫస్ట్ క్లాస్ మరియు 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. ఇతడి తండ్రి అబ్దుల్ ఖాదిర్ పాక్ తరపున ఆడిన స్టార్ క్రికెటర్. పాక్ తరుపున 67 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 1980లలో లెగ్ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. సెప్టెంబర్ 2019లో మరణించాడు.

Exit mobile version