NTV Telugu Site icon

Aaron Finch: వార్మప్ మ్యాచ్‌లతో వరల్డ్‌కప్ గెలవలేం కదా!

Aaron Finch On Warmup

Aaron Finch On Warmup

Aaron Finch Comments On Warmup Match After Losing Against India: క్రికెట్‌లో ఓడడం, గెలవడం అనేది సహజం. గెలిచినంత మాత్రాన అహంకారం చూపించకూడదు, ఓడిపోతే విషం కక్కకూడదు. ఎందుకంటే, రోజులు అందరికీ ఒకేలా ఉండవు. ఈరోజు ఓడినవాడు రేపు గెలవచ్చు, గెలిచినవాడు ఓడిపోవచ్చు. ఏదేమైనా.. ప్రతీదీ యాక్సెప్ట్ చేయాలి. కానీ.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాత్రం ఓటమిని అంగీకరించలేక, భగభగ మండిపోతున్నట్టు కనిపిస్తోంది. అందుకే.. భారత్ విజయాన్ని చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు.

భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఇవాళ వార్మప్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. అయితే.. ఆరోన్ ఫించ్ మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేక విషం చిమ్మాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అతగాడు.. తొలుత తన ఇన్నింగ్స్‌ సంతృప్తినిచ్చిందని గట్టిగా డబ్బా కొట్టేసుకున్నాడు. 76 పరుగులు చేశాడు కదా! ఆ తర్వాత ఈ మ్యాచ్ తాము గెలిచి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే.. వార్మప్ మ్యాచ్‌లు ఆడి, వరల్డ్‌కప్ గెలవలేము కదా అంటూ పరోక్షంగా టీమిండియా విజయాన్ని చులకన చేశాడు. వార్మప్ మ్యాచ్‌లతో వరల్డ్‌కప్ గెలవలేమని చెప్పిన ఫించ్.. తాము గెలివాల్సిందని ఎందుకు అన్నాడు? ఇదే పాయింట్ పట్టుకొని నెట్టింట్లో అతడ్ని ట్రోల్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి186 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (57), సూర్యకుమార్‌ యాదవ్‌ (50) అర్థశతకాలతో చెలరేగడంతో, భారత్ అంత భారీ స్కోర్ చేయగలిగింది. 187 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఆసీస్.. మొదట్నుంచే విజృంభించింది. దాదాపు గెలుపుని తనవైపుకు తిప్పుకుంది. కానీ.. వారి ఆశలపై మహమ్మద్ షమీ నీళ్లు చల్లేశాడు. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. షమీ కేవలం నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. మరొకటి రనౌట్ చేశాడు. దీంతో.. ఆరు పరుగల తేడాతో ఆస్ట్రేలియా ఓడింది. కెప్టెన్‌ ఫించ్‌ (76) ఒక్కడే అర్థశతకంతో మెరిశాడు.

Show comments