NTV Telugu Site icon

T 20 Blast: తుఫాన్ వేగంతో శతక్కొట్టిన డొమెస్టిక్ వికెట్ కీపర్

Cook

Cook

టీ 20 అంటేనే పరుగుల మోత.. బాల్ బాల్ కు బౌండరీ గానీ, సిక్సర్ గానీ కొట్టాల్సిందే. అలా అని బౌలర్ ఏమీ ఈజీగా బౌలింగ్ చేయడు. అతను కూడా బ్యాటర్ ను కట్టడి చేసేందుకు తన బౌలింగ్ మాయజాలాన్ని చూపిస్తాడు. మొన్నటిదాకా ఐపీఎల్ లో పరుగుల వరద చూశాం. శుభ్ మన్ గిల్, కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో ఆకట్టుకోగా.. మిగతా కొందరు ప్లేయర్లు తమ ప్రతిభను చూపించారు. అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ దుమ్ముదులిపేశారు. ఇప్పుడు అలాంటి పరుగుల సునామీ ఇంగ్లండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో నమోదైంది.

Also Read : MP Margani Bharath: వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ వెలవెలబోతోంది

ఇంగ్లాండ్‌కి చెందిన 37 ఏళ్ల వికెట్ కీపర్- బ్యాటర్ క్రిస్ కుక్ గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మిడిల్‌సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యా్ట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 275 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. 7 సిక్సర్లు, 12 బౌండరీలతో అద్భుత సెంచరీ (113) పరుగులు చేశాడు. అతనే కాదు, తన టీమ్ మేట్ కొలిన్ ఇంగ్రామ్ కూడా 66 బంతుల్లో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. గ్లామోర్గాన్ జట్టు తరఫున క్రిస్ కుక్(113), కొలిన్ ఇంగ్రామ్(92 నాటౌట్) రాణించడంతో ఆ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.

Also Read : Maruti Suzuki : మేలో 1.78 లక్షల యూనిట్ల మారుతి వాహనాల అమ్మకం.. అత్యధికంగా అమ్ముడైనవి ఇవే

239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ కూడా బాగా ప్రయత్నించారు. మిడిల్‌సెక్స్ తరఫున జో క్రాక్‌నెల్ 42 బంతుల్లో 77 పరుగులు చేయగా, స్టీఫెన్ 51 బంతుల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ తమ ఇన్నింగ్స్ ముగిసేసరికి మిడిల్‌సెక్స్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గ్లామోర్గాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా పొట్టి ఫార్మెట్ లో పరుగుల సునామీ కురిపిస్తుంటే.. మ్యాచ్ వీక్షించడానికి అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా అత్యధిక స్పీడ్ తో పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డ్ కెక్కుతాడు.

Show comments