Roger Binny: అఫీషియల్.. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా 1983 ప్రపంచకప్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ శకం ముగిసింది. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ముంబైలో మంగళవారం బీసీసీఐ ఏజీఎం జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ ఏకాభిప్రాయంతో రోజర్ బిన్నీని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఈ పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో బిన్నీ ఎన్నిక సులువుగా మారింది. మరోవైపు బీసీసీఐ సెక్రటరీగా మరోసారి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఇప్పటి వరకు ట్రెజరర్‌గా పనిచేసిన అరుణ్ ధుమాల్ నూతన ఐపీఎల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Read Also: T20 World Cup: టీమిండియా పట్ల వివక్ష.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శల వర్షం
Also Read
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్‌కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
కాగా 67 ఏళ్ల రోజర్ బిన్నీ స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. ఆయన టీమిండియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ తండ్రి. రోజర్ బిన్నీ 1983లో భారత్‌కు ప్రపంచ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. తన బౌలింగ్ నైపుణ్యాలతో 18 వికెట్లు తీసి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తన కెరీర్లో భారత్ తరఫున 27 టెస్ట్ మ్యాచులు, 72 వన్డే మ్యాచులు ఆడాడు. అంతేకాకుండా నేషనల్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. అటు కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగానూ బిన్నీ పని చేశారు. 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బిన్నీ కోచ్‌గా వ్యవహరించారు. బెంగాల్ క్రికెట్ టీం కోచ్‌గా కూడా పని చేశారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!