NTV Telugu Site icon

Special Story on Snapdeal Founders: హ్యాట్సాఫ్‌.. కునాల్‌ బహల్‌, రోహిత్‌ బన్సల్‌

Special Story On Snap Deal Founders

Special Story On Snap Deal Founders

Special Story on Snapdeal Founders: మన దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేసుల్లో ఒకటైన స్నాప్‌డీల్‌ సక్సెస్‌ స్టోరీ వెనక ఇద్దరు మిత్రులున్నారు. వాళ్లే.. కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌. స్నాప్‌డీల్‌ విజయవంతం కావటంతో వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా యూనికార్న్‌లు మరియు సూనికార్న్‌ల్లో వ్యక్తిగతంగా భారీఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అవి అనూహ్యంగా లాభాలను ఆర్జిస్తుండటంతో ఇద్దరి సంపద దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో.. ఏంజెల్‌-ఇన్వెస్ట్‌మెంట్లను మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌ను ఈ వారం మన డిఫైనింగ్‌ పర్సనాలిటీస్‌గా ఎంచుకున్నాం. వాళ్ల పెట్టుబడులపై ప్రత్యేక కథనం..

ఏంజెల్ ఇన్వెస్టర్లంటే సంపన్న ప్రైవేట్‌ పెట్టుబడిదారులని అర్థం. వీళ్లు చిన్న బిజినెస్‌ వెంచర్లకు ఫైనాన్స్‌ చేయటంపై ఫోకస్‌ పెడుతుంటారు. తమ ఇన్వెస్ట్‌మెంట్లకి బదులుగా ఈక్విటీలను తీసుకుంటారు. వెంచర్‌ క్యాపిటలిస్టుల మాదిరిగా వీళ్లు ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను వినియోగించరు. సొంత డబ్బునే పెట్టుబడిగా పెడతారు. ఇలాంటి ఏంజెల్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌.. కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌ అని చెప్పొచ్చు. వీళ్లిద్దర్ని భారత దేశంలోని అత్యంత విజయవంతమైన ఎర్లీ ఇన్వెస్టర్లుగా పేర్కొనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.

read more: Google Parent Company Alphabet: ఆల్ఫాబేట్.. 10 వేల మంది ఉద్యోగులు ఫట్..

కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌.. వీళ్లి్ద్దరి యాజమాన్యంలో గత పదేళ్లలో దినదిన ప్రవర్ధమానమైన సీడ్‌ ఫండ్‌ సంస్థ పేరు టైటాన్‌ క్యాపిటల్‌. ఈ కంపెనీ పరిధిలో అర డజను యూనికార్న్‌లున్నాయి. ఇంకో అర డజను సంస్థలు ఈ స్టేటస్‌ పొందేందుకు మరో అంగుళం దూరం ప్రయాణించటమే తరువాయి. 100 మిలియన్‌ డాలర్ల నుంచి 600 మిలియన్‌ డాలర్ల వరకు విలువ చేసే రెండు డజన్ల సంస్థలు సైతం టైటాన్‌ క్యాపిటల్‌ నుంచి ఫండ్స్‌ పొందాయి. ఈ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 280 స్టార్టప్‌లు ఉండటం విశేషం. కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌.. తమ మొదటి ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ని 2011లో ప్రారంభించారు.

స్నాప్‌డీల్‌ ఆవిర్భావ సమయంలోనే దీనికి కూడా శ్రీకారం చుట్టారు. సుమారు 50 మిలియన్‌ డాలర్లతో వెంచర్‌ క్యాపిటల్‌ని ఓపెన్‌ చేశారు. దీంతో.. ఆ రోజుల్లో ఫండింగ్‌ కోసం ఎదురుచూస్తున్న స్టార్టప్‌ల ఫౌండర్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీనికి చక్కని ఉదాహరణగా ఓలా క్యాబ్స్‌ గురించి చెప్పుకోవచ్చు. వీళ్లిద్దరూ తమ ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ ఇచ్చిన ప్రముఖుల్లో భవీష్‌ అగర్వాల్‌ ఒకరు. భవీష్‌ అగర్వాల్‌ రూపొందించిన ఇంటర్‌సిటీ ట్యాక్సీ సర్వీస్‌.. ఓలా క్యాబ్స్‌.. సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో.. ఇందులో కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌ పెట్టిన పెట్టుబడి ఆ తర్వాత కాలంలో వంద రెట్లకు పైగా వృద్ధి సాధించటం అత్యంత గొప్ప విషయం. ఈ క్రమంలో వీళ్లిద్దరి ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కమర్షియల్‌గా బాగా సక్సెస్‌ అయ్యాయి. శాలరీ, స్టాక్‌ ఆప్షన్స్‌, స్టేక్‌ సేల్‌ తదితర లీడింగ్‌ స్టార్టప్ ఫౌండర్స్‌ నిధుల కోసం టైటాన్‌ క్యాపిటల్‌ను సెలెక్ట్‌ చేసుకునేవి. స్నాప్‌డీల్‌ విజయవంతం కావటంతో వీళ్లిద్దరు మరింత ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇన్వెస్ట్‌మెంట్‌ యాక్టివిటీని సీరియస్‌గా తీసుకున్నారు. పెట్టుబడులను మేనేజ్‌ చేసేందుకు ఏకంగా ఒక టీమ్‌నే ఏర్పాటుచేసుకున్నారు.

గతంలో తాము ఇన్వెస్ట్‌ చేసిన సంస్థల్లోనే సీడ్‌-స్టేజ్‌ స్టార్టప్ వ్యాల్యుయేషన్లను కూడా ప్రారంభించారు. ఓలా, అర్బన్‌ కంపెనీలతోపాటు రేజర్‌పే వంటి సంస్థలు.. కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌ టీమ్‌కి క్లయింట్లుగా మారారు. ఆ తర్వాత దశలో వీళ్లిద్దరు.. ఫౌండర్‌ స్పాటింగ్‌ని స్టార్ట్‌ చేశారు. తద్వారా.. రిటైల్‌ రంగంతోపాటు కన్జ్యూమర్‌ టెక్నాలజీ సెక్టార్‌లో ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ని గుర్తించటం మొదలుపెట్టారు. ఈవిధంగా కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌.. అర్బన్‌ కంపెనీలో 91 వేల డాలర్లు పెట్టుబడి పెట్టి 3 శాతం వాటాను దక్కించుకున్నారు. ఆ స్టేక్‌.. ఏడేళ్లలో 0.8 శాతానికి తగ్గినప్పటికీ ప్రస్తుతం దాని విలువ 22 మిలియన్‌ డాలర్లకు పెరిగింది.

ఇన్వెస్టర్లుగా వీళ్లిద్దరూ ఇప్పటివరకు పొందిన అత్యధిక లాభం ఇదే కావటం చెప్పుకోదగ్గ విషయం. అర్బన్‌ కంపెనీ తర్వాత మ్యాట్రిక్స్‌ పార్ట్నర్స్‌ మరియు ఆఫ్‌బిజినెస్‌ వంటి స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టారు. ఆఫ్‌బిజినెస్‌ అనే సంస్థలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ 150 రెట్లు గ్రోత్‌ సాధించి 5 మిలియన్‌ డాలర్లకు చేరింది. కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌.. మామార్త్‌ అనే దోమల మందు విక్రయ సంస్థలో పెట్టుబడి పెట్టడంతో అప్పటివరకూ నెలకు 10 లక్షల బిజినెస్‌ మాత్రమే చేసిన ఆ కంపెనీ.. ఆ తర్వాత.. మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగింది.

ట్రాక్ఎక్స్ఎన్ అనే స్టార్టప్‌-డేటా కంపెనీలో టైటాన్‌ క్యాపిటల్‌ పెట్టిన 2 లక్షల 18 వేల డాలర్ల పెట్టుబడి ఐదేళ్లలో కొండ లాగా పెరిగి 19 మిలియన్‌ డాలర్లయింది. కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌కి.. టైటాన్‌ క్యాపిటల్‌లో సమాన సంఖ్యలో షేర్లున్నాయి. ఇద్దరూ కలిపి ఒక ఫండ్‌లాగా పెట్టుబడి పెట్టడం కన్నా విడిగా ఇన్వెస్ట్‌ చేయటమే సింపుల్‌ అని వీళ్లిద్దరు అంటుంటారు. టైటాన్‌ క్యాపిటల్‌ వార్షిక బడ్జెట్‌ తొలినాళ్లలో వేల డాలర్ల స్థాయిలోనే ఉండేది. అది కాస్తా.. ఆ తర్వాత.. యావరేజ్‌గా.. లక్ష డాలర్ల రేంజ్‌కి చేరింది. ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరిగి 3 లక్షల డాలర్లకు ఎదిగింది.

కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌ ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్‌ చేసినప్పుడు తమ అసలు పెట్టుబడిని జీరోగానే భావిస్తారంట. అంటే.. ఒక రకంగా.. తాము ఆ కంపెనీలో పెట్టుబడే పెట్టలేదు అనే భావనతో ఉంటారంట. ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేసేటప్పుడు ఇలాంటి మైండ్‌సెట్‌ చాలా ముఖ్యమని చెబుతుంటారు. అయితే.. కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌ పెట్టిన పెట్టుబడులన్నీ సక్సెస్‌ కాలేదు. అభిషేక్‌ కేజ్రివాల్‌ ప్రారంభించిన సాస్‌ వెంచర్‌ అనే సెలూన్‌ బిజినెస్‌కి టైటాన్‌ క్యాపిటల్‌ ఫైనాన్షియల్‌గా సపోర్ట్‌ చేసినప్పటికీ అది వర్కౌట్‌ అవలేదు. అదే వ్యక్తి కొన్నాళ్ల తర్వాత కుటుంబ్‌ అనే కమ్యూనిటీ యాప్‌ను స్టార్ట్‌ చేశాడు.

అప్పుడు కూడా అతనికి వీళ్లిద్దరే ఆర్థికంగా మద్దతిచ్చారు. మొత్తం 29 మిలియన్‌ డాలర్లు రైజ్‌ చేసిన ఈ సంస్థ మార్కెట్‌ విలువ గతేడాది 175 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు.. అనే ఒక సినిమా డైలాగ్‌ మాదిరిగా కునాల్‌ బహల్‌ మరియు రోహిత్‌ బన్సల్‌ కూడా ఎప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయాలో ఎప్పుడు బయటికి రావాలో బాగా తెలిసినవారు. ఈ జంట ఇప్పుడు గ్లోబల్‌ లెవల్లో ఏంజెల్‌ ఇన్వెస్టర్లుగా ఎంట్రీ ఇచ్చారు. అమెరికాలో 30, సౌత్‌ ఈస్ట్‌ ఏసియాలో డజను పెట్టుబడులు పెట్టారు. ఇండియాకి గొప్ప పేరు తెస్తున్నారు. హ్యాట్సాఫ్‌.. కునాల్‌ బహల్‌.. రోహిత్‌ బన్సల్‌.