NTV Telugu Site icon

Smart Phones: డిమాండ్‌ తగ్గిన ‘లో-వ్యాల్యూ’ స్మార్ట్‌ మొబైల్స్‌

Smart Phones

Smart Phones

Smart Phones: ఇండియన్స్‌ సహజంగా రెండేళ్లకోసారి స్మార్ట్‌ఫోన్‌ మారుస్తుంటారు. కిందపడి పగిలిపోవటం వల్ల గానీ.. పాతబడి సరిగా పనిచేయకపోవటం వల్ల గానీ.. వాడుతున్న ఫోన్‌ను పక్కన పెట్టి కొత్తది కొంటుంటారు. కానీ.. ఇప్పుడు.. అలా.. ఈజీగా కొత్త ఫోన్‌ కొందామంటే ప్రజల దగ్గర పైసల్లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. ద్రవ్యోల్బణం వల్ల ఇండియాలో తక్కువ రేటు స్మార్ట్‌ఫోన్లకి డిమాండ్‌ పడిపోయింది.

ఉపాధి స్థాయిలు బలహీనంగా మారుతుండటం, ఆదాయాలు తగ్గుతుండటం వల్ల గతంలో మాదిరిగా ఇష్టంవచ్చినట్లు ఖర్చుపెట్టడానికి జనం చేతిలో డబ్బులేకుండాపోతోంది. ఇన్‌ఫ్లేషన్‌ ఇన్‌క్రీజ్‌ అవుతుండటం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలో ఆటంకాలు రావటం, ఎలక్ట్రానిక్‌ విడి భాగాల కొరత ఏర్పడటం, చైనాలో జీరో కొవిడ్‌ పాలసీ తదితర కారణాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఫోన్ల గిరాకీపై ప్రతికూల ప్రభావం చూపాయి.

read more: Adani FPO: ఇప్పుడున్న పరిస్థితుల్లో అదానీ ‘ఆఫర్‌’ సక్సెస్ అవుతుందా?

ఈ విషయాన్ని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అనే మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ గత నెలలో ప్రచురించిన నివేదికలో వెల్లడించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో విక్రయాల పెరుగుదల కొనసాగుతుండగా ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో డిమాండ్‌ తగ్గటం సేల్స్‌ని దెబ్బతీసిందని పేర్కొంది. సెప్టెంబర్‌ చివరి వారంలో పండగ సీజన్‌ నేపథ్యంలో కస్టమర్ల నుంచి భారీగా గిరాకీ నెలకొందని, దీంతో స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌ పీక్‌ లెవల్‌కి చేరుకున్నట్లు ఇంతకుముందు తెలిపిన ఇదే సంస్థ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా చెబుతుండటం గమనార్హం.

ప్రస్తుతం ఎంట్రీ టయర్‌ మరియు బడ్జెట్‌ సెగ్మెంట్లలో దాదాపు అన్ని బ్రాండ్లదీ ఇదే పరిస్థితి అని కౌంటర్‌పాయింట్ రిపోర్ట్‌ వివరించింది. 2021లో కొవిడ్‌-19 మహమ్మారి విజృంభించటంతో ప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని బీబీసీ రిపోర్ట్‌ పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగిరాకపోవటం మరియు యువతలో ఉద్యోగ భద్రత కొరవడటం స్మార్ట్‌ఫోన్‌ బిజినెస్‌ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

మొబైల్‌ ఫోన్లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసుకునే విషయంలో యువత ముందుంటారు. కానీ.. వాళ్లకు ఆర్థిక పరిస్థితులు కలిసిరాకపోవటం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు.. ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల రేట్లు సైతం భారీగా పెరిగాయి. రెండేళ్ల కిందట 10 వేల రూపాయలు పలికిన ఫోన్‌ ఖరీరు 2022లో ఏకంగా 16 వేల రూపాయలకు పైగా చేరుకుంది.

ఇండియాలో.. ఎంట్రీ లెవల్‌ హ్యాండ్‌ సెట్లను ఎక్కువ శాతం దిగువ మధ్యతరగతి ప్రజలే వాడుతుంటారు. వాటి తయారీ కూడా మన దేశంలోనే జరుగుతుంటుంది. భారతదేశంలో సుమారు 450 మిలియన్‌ల మంది ఈ ఫీచర్‌ ఫోన్లను వినియోగిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ బేసిక్‌ హ్యాండ్‌సెట్‌ల ధరలు 15 వందల రూపాయల లోపే ఉంటాయి.

దిగువ మధ్యతరగతివాళ్లు ఈ తక్కువ రేటు స్మార్ట్‌ఫోన్లను కొందామన్నా వాళ్ల చేతిలో సొమ్ములు ఉండట్లేదు. ఎకానమీ ఓవరాల్‌గా నెమ్మదించటం మరియు అధిక నిరుద్యోగం ఎన్నో కుటుంబాల ఆదాయానికి గండిపెట్టాయి.ప్రైవసీ కారణంగా ఫీచర్‌ ఫోన్ల వాడకం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు.. స్మార్ట్‌ఫోన్లను నిఘా పరికరాలుగా కూడా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.

మొబైల్‌ ఫోన్లను సర్వైలెన్స్‌ డివైజ్‌లుగా మార్చటం వల్ల వాటి పనితీరు మీద ప్రభావం పడదని స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు వ్యాపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. కొత్తవి దొరికేసరికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. కావున.. ఇండియాలో ‘‘లో-లెవల్‌’’ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ మరింత డౌన్‌ కావొచ్చని అంటున్నారు.