ఆ స్పెషల్ రికార్డులు సాయి పల్లవికి మాత్రమే సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 9న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు. తన అందం, తనదైన అభినయంతో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది ఈ క్రేజీ బ్యూటీ. అంతేకాదు సౌత్ లో ఏ హీరోయిన్ క్రియేట్ చేయలేని రికార్డులను సైతం తన పేరున క్రియేట్ చేసుకుంది ఈ మలయాళ భామ. తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రం వెండితెర అరంగ్రేటం చేసిన సాయిపల్లవి…తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. భానుమతిగా తన నటనతో అందరినీ ‘ఫిదా’ చేసేసింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం.సి.ఏ చిత్రంలో నటించింది. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన ‘మారి-2’ చిత్రంతో నటించి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. కానీ ఆమెకు కోలీవుడ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. మారి-2, దియా అనే తమిళ హార్రర్ మూవీ, ఆ తరువాత సూర్యతో కలిసి సాయి పల్లవి నటించిన ‘ఎన్జికే’ చిత్రాలు భారీ ఫ్లాప్ లుగా నిలిచాయి. టాలీవుడ్ లో మాత్రం ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఒక్క ‘పడి పడి లేచే మనసు’ తప్ప. ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ సంఖ్యలో అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది.
గతంలో కూడా సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించిన ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ 1.14 బిలియన్ల వ్యూస్ దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్ లో ఒక హీరోయిన్ సాంగ్స్ కు ఇంతటి ఆదరణ రావడం విశేషం. ఇక ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న రొమాంటిక్ యూత్ ఫుల్ మూవీ ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల గురించి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘లవ్ స్టోరీ’ విడుదలకు బ్రేక్ పడింది. మరోవైపు సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న మూవీ ‘విరాటపర్వం’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానుల కోసం తాజాగా సాయి పల్లవి బర్త్ డే సీడీపీ రిలీజ్ అయ్యింది. ఇందులో సాయి పల్లవి రెడ్ కలర్ సారీలో తన స్మైల్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. మరోవైపు ఇటీవల సెన్సేషనల్ గా మారిన ‘సారంగదరియా’ అనే ఫోక్ సాంగ్ కు స్టెప్పులేస్తున్న సాయి పల్లవి లుక్, మరోవైపు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలోని సాయిపల్లవి లుక్ తో సీడీపీని రెడీ చేశారు. ఇక మన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా భవిష్యత్ లో మరిన్ని హిట్స్ తో, మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.
Also Read
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!