jewellery: మన దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం కేవలం ఆర్థిక పెట్టుబడి మాత్రమే కాదు. ఇది శతాబ్దాల నాటి సంప్రదాయంగా వస్తుంది. పండుగలు, వివాహాలు, శుభ సందర్భాలలో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల శ్రేయస్సు, భద్రత, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. కానీ మీరు బంగారం లేదా వెండి కొనడానికి నగల దుకాణానికి వెళ్ళినప్పుడు, దాదాపు అన్ని షాపుల వాళ్లు ఆభరణాలను ప్రత్యేక గులాబీ రంగు కాగితంలో చుట్టడం ఎప్పుడైనా గమనించారా? నిజానికి చాలా కొద్ది మాత్రమే దాని గురించి ఆలోచిస్తారు. ఈ స్టోరీలో అసలు ఆ గులాబీ రంగు కాగితంలో ఆభరణాలను ఎందుకు పెడతారో చూద్దాం.
READ ALSO: School Bus Catches Fire: విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. క్షణాల్లో బస్సు దగ్ధం..
నిజానికి స్వర్ణకారులు తరతరాలుగా గులాబీ రంగు కాగితంలో బంగారం, వెండిని చుట్టి ఇచ్చే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ ఆచారం చిన్న గ్రామీణ దుకాణాల నుంచి పెద్ద, ప్రతిష్టాత్మకమైన నగల దుకాణాల వరకు ప్రతిచోటా కనిపిస్తుంది. చాలా మంది వినియోగదారులు దీనిని సాధారణంగా భావించవచ్చు, కానీ ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక శాస్త్రీయ, మానసిక కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గులాబీ రంగు మృదువైనది, ఆకర్షణీయమైనది. అందులో ఇందులో బంగారం ఆభరణాలను చుట్టి ఇస్తే పసిడి సహజ పసుపు మెరుపు మరింత మెరుగుపడుతుంది. దీని వలన ఆభరణాలు మరింత విలువైనవిగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే గులాబీ రంగు అనేది వినియోగదారుల మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, షాపింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని తెలిపారు. అలాగే గులాబీ రంగు కాగితం సాధారణంగా మృదువుగా ఉంటుంది. బంగారం, వెండి ఆభరణాలపై గీతలు పడకుండా రక్షించడంతో పాటు, ఇది ఆభరణాలను మసకబారకుండా కాపాడుతుంది. దీంతో ఆ ఆభరణాలు ఎక్కువ కాలం కొత్తవిగా మెరుస్తూ ఉంటాయని వివరించారు.
READ ALSO: Silver Prices: తెల్లబంగారమా? వెండి గండమా? మూడు రోజుల్లో రూ.48 వేలు పెరిగిన వెండి..