సాదారణంగా పుట్టినరోజులను ఏడాదికి ఒక్కసారి జరుపుకుంటారు.. అదే ఫిబ్రవరి 29 న పుడితే ప్రతి నాలుగేళ్లకు ఒక్కసారి పుట్టినరోజు చేసుకోవాలి.. అంటే లీప్ ఇయర్ అన్నమాట.. ఈరోజు ఫిబ్రవరి 29.. మరి ఈరోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న సెలెబ్రేటీలు ఎవరో ఒక్కసారి తెలుసుకుందాం..
జాన్వీ చేదా..
ఇండియన్ నటి జాన్వీ చేదా కూడా ఫిబ్రవరి 29నే జన్మించింది. టెలివిజన్ రంగంలో స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఛూనా హై ఆస్మాన్’, ‘బాలికా వధు’, ‘సీఐడీ’ సీరియల్స్తో బాగా గుర్తింపు తెచ్చుకుంది..
ఖలేద్..
అల్జీరియాలోని ఓరాన్లో ఫిబ్రవరి 29, 1960న ఖలీద్ జన్మించారు. చిన్నతనం నుంచే గిటార్, బాస్, అకార్డియన్ హార్మోనియం వాయించేవాడు. మొరాకో మ్యూజిక్ లో ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు..
జా రూల్..
ఇతను ఒక రాపర్..ప్రముఖ అమెరికన్ రాపర్. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత అతడి పేరు జా రూల్ గా మార్చుకున్నారు. ఫిబ్రవరి 29, 1976లో న్యూయార్క్ లో పుట్టి పెరిగిన ఆయన, 2000 సంవత్సరం తర్వాత ర్యాప్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యాడు..
అలాగే ఇండియన్ హాకీ ప్లేయర్ ఆడమ్ ఆంటోనీ సింక్లైర్ సైతం ఫిబ్రవరి 29నే జన్మించాడు. తమిళనాడుకు చెందిన ఇతడు ఇండియా జట్టులో ఆడాడు. ఏథెన్స్ లో జరిగిన 2004 ఒలింపిక్స్ తోపాటు దోహాలో జరిగిన 2006 ఆసియా క్రీడలలో పాల్గొన్నాడు. అలాగే ఒలింపిక్ స్విమ్మర్ కల్లెన్ ఆండ్రూ జోన్స్, మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ కూడా ఫిబ్రవరి 29నే జన్మించారు.. వీరంతా ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు..