Land Rates in Hyderabad: హైదరాబాద్‌లో భూముల రేట్లు.. యావరేజ్‌గా గజం స్థలం ఎంతుందంటే?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Rates in Hyderabad: విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్య నగరం.. అన్ని రంగాల్లో.. అన్ని వైపులా.. శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భూముల రేట్లు భారీగా పలుకుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు హైదరాబాద్‌లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొందనే టాక్ వినిపిస్తోంది.
Birla returns: మళ్లీ వచ్చిన బిర్లా. నష్టాల నుంచి వీఐ గట్టెక్కెనా?
Also Read
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
- World's First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
ఎందుకంటే.. జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో యావరేజ్‌గా గజం స్థలం రేటు ఏకంగా 2 లక్షల 74 వేల 950 రూపాయలు చెబుతున్నారు. ఇది.. ప్రభుత్వం నిర్ణయించిన రేటు అనే విషయం మర్చిపోవద్దు. అంటే.. మార్కెట్ వ్యాల్యూ ఇంకెంత
ఉంటుందో ఊహించుకోవచ్చు.
హైదరాబాద్‌లో ప్రస్తుతానికి ఇదే హయ్యస్ట్ రేట్ కావటం విశేషం. దీని ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ శివారు సదాశివపేట ప్రాంతంలో యావరేజ్‌గా గజం స్థలం ధర 14 వేల 850 రూపాయలుగా నమోదైంది. సిటీలోని 16 ప్రముఖ ప్రాంతాలతో పోల్చితే.. సదాశివపేటలోనే అతి తక్కువ రేటు.. అది కూడా దాదాపు 15 వేల రూపాయలు కావటం గమనించాల్సిన అంశం.
జూబ్లీహిల్స్, సదాశివపేట కాకుండా మిగతా 14 ప్రాంతాల్లో యావరేజ్‌గా గజం ధర ఎలా ఉందో చూద్దాం. కోహెడలో 14 వేల 850. సంగారెడ్డిలో 15 వేల 750. కీసర మరియు అల్వాల్‌లో 19 వేల 350 చొప్పున పలుకుతోంది. తుర్కయంజాల్ మరియు బోడుప్పల్‌లో యావరేజ్‌గా గజం స్థలం ధర 32 వేల 850 రూపాయల చొప్పున చెబుతున్నారు.
గాజుల రామారంలో 57 వేల 600, బండ్లగూడ జాగీర్‌లో 63 వేల రూపాయలు చెల్లించాలి. గండి మైసమ్మ మరియు నార్సింగిలో 73 వేల 350 రూపాయల చొప్పున డిమాండ్ నెలకొంది. కొండాపూర్‌లో 94 వేల 950 రూపాయలు పెడితే తప్ప గజం స్థలం రావట్లేదు.
లింగంపల్లి, బడంగ్‌పేట్ ఏరియాల్లో యావరేజ్‌గా గజం స్థలం కావాలంటే.. 95 వేల 850 రూపాయల చొప్పున సమర్పించుకోవాలి. నల్లగండ్ల అనే ఏరియాలో 99 వేల 900 రూపాయలు ఇవ్వాలి. అంటే.. లక్ష రూపాయలకు 100 రూపాయలు మాత్రమే తక్కువన్న మాట.
ఒక్క గజం స్థలం రేటే ఇంత ఉందంటే.. చిన్న ఇల్లయినా కట్టడానికి ఎంత ప్లేస్ కావాలో, దానికి ఎన్ని డబ్బులవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మిడిల్ క్లాస్ పీపుల్.. హైదరాబాద్‌కి నలభై యాభై కిలోమీటర్ల దూరం వెళ్లి కొనుక్కుంటున్నారని రియల్ ఎస్టేట్ కంపెనీలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!