International Women’s Day: అమ్మ నుంచి అర్ధాంగి వరకు.. సృష్టికి మూలం స్త్రీ.. ఉమెన్స్ డే కేవలం వేడుక కాదు.. సామాజిక బాధ్యత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Women’s Day: అమ్మ.. అక్క.. చెల్లి.. భార్య ఇలా అనేక పాత్రలను పోషిస్తూ కుటుంబ బాగోగుల కోసం నిరంతరం శ్రమించే అతీత శక్తి మహిళ. భర్తే దైవంగా, పిల్లలే లోకంగా భావిస్తూ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. పుట్టుక నుంచి చావు వరకు స్త్రీలు లేనిదే మన జీవనం లేదు. మగాడు బయట పని చేసి డబ్బులు కూడబెట్టినా వాటిని పొదుపు చేసే సామర్థ్యం వారికే ఉంది. అలాంటి వీర వనితలను స్మరించుకుంటూ ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం.. సమాజంలో మహిళల ప్రాముఖ్యత, వారు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటాం. వనితలకు సమాన హక్కులు, స్వేచ్ఛ లభించాలని పిలుపునిస్తాం. మహిళలపై జరుగుతున్న హింస, వివక్ష, అసమానతలు తగ్గించేలా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ఇంతకీ మహిళా దినోత్సవం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? దీని వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా?
READ MORE: Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్ కల్యాణ్ పోస్ట్..
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
మహిళల దినోత్సవం ఆరంభం వెనుక చాలా పెద్ద కథే ఉంది. గత శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాల నుంచి ఇది వచ్చింది. యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో పనిచేసే మహిళలు తమ హక్కుల కోసం పోరాడిన సమయంలో ఈ ఆలోచన రూపుదిద్దుకుంది. మొదటిసారిగా మహిళల దినోత్సవాన్ని 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో నిర్వహించారు. న్యూయార్క్ నగరంలో జరిగిన ఆ కార్యక్రమం మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. తర్వాత జర్మనీకి చెందిన మహిళా ఉద్యమకారిణి క్లారా జెట్కిన్ అంతర్జాతీయ స్థాయిలో మహిళల దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనకు ప్రపంచ మహిళా సమావేశంలో మద్దతు లభించింది. ఆ తరువాత 1911లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల్లో లక్షలాది మంది మహిళలు ర్యాలీలు నిర్వహిస్తూ తమ హక్కుల గళాన్ని వినిపించారు. కొన్నేళ్ల తర్వాత మార్చి ఎనిమిదో తేదీనే మహిళల దినోత్సవంగా అనేక దేశాలు పాటించడం ప్రారంభించాయి.
READ MORE: Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..
1922లో సోవియట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ మార్చి ఎనిమిదో తేదీని మహిళల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. తరువాత ఈ దినానికి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. 1975లో ఐక్యరాజ్యసమితి మహిళల దినోత్సవాన్ని అధికారికంగా జరపడం ప్రారంభించింది. ఇక మహిళల దినోత్సవం అనేది కేవలం వేడుకలకే పరిమితమయ్యే రోజు కాదు.. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా సాధించిన విజయాలను గుర్తించే సందర్భం ఇది. అదే సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేసే రోజు కూడా ఇదే. పని ప్రదేశాల్లో వివక్ష, మహిళలపై హింస, విద్యలో అసమాన అవకాశాలు, ఆరోగ్య సేవలకు అందుబాటు వంటి అనేక సమస్యలపై ఈ రోజు ప్రత్యేకంగా చర్చలు జరుగుతాయి. ప్రభుత్వాలు, సంస్థలు, సమాజంలోని వివిధ వర్గాలు కలిసి మహిళల అభివృద్ధికి అవసరమైన చర్యలపై దృష్టి పెడతాయి.
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!