Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money as Prasad: సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తే తీర్థప్రసాదాలుగా లడ్డూలు, పులిహోర లేదా పండ్లు ఇస్తారు. కానీ మన దేశంలోనే కొన్ని ఆలయాల్లో మాత్రం ప్రసాదానికి బదులుగా డబ్బులు ఇస్తారు. ఇది నిజమే.. ఇక్కడికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లు, బంగారు నగలను ప్రసాదంగా అందిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తమిళనాడులోని వరుసైన ‘కరుప్పసామి’ ఆలయం, మధ్యప్రదేశ్లోని ‘మహాలక్ష్మి’ ఆలయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా.. ఈ ఆలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం ఇవ్వడమే కారణం. ఈ ఆలయాల విశిష్టత ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళనాడు: కోరిన కోర్కెలు తీర్చి.. డబ్బులు ఇచ్చే కరుప్పసామి
తమిళనాడులోని తేని జిల్లా, కడమలైకుండు సమీపంలోని కొండ ప్రాంతంలో ఉంది కరుప్పసామి ఆలయం. ఇక్కడి ప్రధాన దైవం ‘పద్దెనిమిదో మెట్టు’ రక్షకుడైన కరుప్పసామి. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే న్యాయం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో ఈ ఆలయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడానికి ప్రధాన కారణం ‘నగదు ప్రసాదం’ పంపిణీ. అవును.. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా మిఠాయిలకు బదులుగా కరెన్సీ నోట్లను ఇస్తారు. భక్తుల కష్టాలను తీర్చి, వారికి తిరిగి ఆర్థిక అండగా నిలవడమే దేవుని సంకల్పమని ఇక్కడి పూజారులు చెబుతుంటారు.
Also Read
- Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
- Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
- Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
- Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
రత్లాం (మధ్యప్రదేశ్): రూ.100 కోట్ల అలంకరణలో మహాలక్ష్మి
మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలోని మానక్ చౌక్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయం సిరిసంపదలకు నిలయం. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం, దీపావళి సమయంలో మాత్రం ఒక అద్భుత లోకంలా మారుతుంది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకల్లో భాగంగా, ఈ ఆలయ గర్భాలయాన్ని భక్తులు సమర్పించిన నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాలతో అలంకరిస్తారు. ఈ అలంకరణ విలువ అక్షరాలా రూ.100 కోట్లు దాటుతుందని అంచనా. పూర్వం రత్లాం మహారాజు రతన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళి సమయంలో భక్తులు తమ నగదును, నగలను ఇక్కడ అమ్మవారి చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారి సంపద రెట్టింపు అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ వేడుకలు ముగిసిన తర్వాత, భక్తులు సమర్పించిన వాటిని తిరిగి వారికే అప్పగిస్తారు. దీంతో పాటు భక్తులకు కరెన్సీ నోట్లు, నాణేలను ప్రసాదంగా పంచుతారు. మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ రెండు ఆలయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?