Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి విజయానికి కేవలం తెలివితేటలు మాత్రమే సరిపోవని, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన కూడా అవసరమని చెప్పారు. మనిషి విజయం కేవలం అతని సామర్థ్యంపైనే కాదు, అతని నడవడికపై కూడా ఆధారపడి ఉంటుందని చాణక్యుడు స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి పైకి వచ్చినా, ఆయన చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చెడు అలవాట్లు ఆయన ఎంతో కష్టపడి నిర్మించుకున్న అఖండ సామ్రాజ్యాన్ని క్షణాల్లో బూడిద చేయగలవని అన్నారు. ముఖ్యంగా పురుషుల కెరీర్‌ను, కీర్తిని నాశనం చేసే ఆరు ప్రధాన అలవాట్ల గురించి చాణక్యుడు క్రింది విధంగా హెచ్చరించారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
1. బద్ధకం: విజయానికి అతిపెద్ద శత్రువు..
చాణక్యుని ప్రకారం.. బద్ధకం ఉన్న వ్యక్తికి వర్తమానం ఉండదు, భవిష్యత్తు అసలే ఉండదు. “నేటి పనిని రేపటికి వాయిదా వేసేవాడు” వృత్తిపరమైన పోటీలో ఎప్పటికీ వెనుకబడే ఉంటాడని చాణక్యుడు హెచ్చరించాడు. సమయం ఎవరి కోసమూ ఆగదని, అందుకే కాలంతో పాటు నడవలేని వాడు పతనం కాక తప్పదని స్పష్టంగా చెప్పారు.
2. అహంకారం: వినాశనానికి నాంది
అధికారం, హోదా లేదా సంపద వచ్చిందని గర్వపడే వ్యక్తి ఇతరులను తక్కువగా చూడటం ప్రారంభిస్తాడు. అహంకారం పెరిగిన చోట నేర్చుకోవాలనే జిజ్ఞాస చచ్చిపోతుంది. ఎప్పుడైతే కొత్త విషయాలు నేర్చుకోవడం ఆగిపోతుందో, అప్పుడే ఆ వ్యక్తి పతనం మొదలైనట్లు లెక్క అని తన నీతి శాస్త్రంలో చాణక్యుడు పేర్కొన్నారు.
3. మనసు నొచ్చుకునే మాటలు: సంబంధాలకు మరణశాసనం
ఒక వ్యక్తికి ఉన్న నోటి దురుసు లేదా మనుషుల మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడే అలవాటు ఆయన చేసిన మంచి పనులన్నింటినీ మర్చిపోయేలా చేస్తాయని చాణక్యుడు పేర్కొన్నారు. కటువుగా మాట్లాడే పురుషులు తమ ఆఫీస్‌లో సహోద్యోగుల గౌరవాన్ని పొందలేరని, అలాగే ఇంట్లోనూ పీస్పుల్నెస్ను కోల్పోతారని వెల్లడించారు. మాట జారితే వెనక్కి తీసుకోలేమని, అది సంబంధాలను శాశ్వతంగా తెంచేస్తుందని చాణక్యుడు హెచ్చరించారు.
4. చెడు స్నేహం: వ్యక్తిత్వానికి మచ్చ
ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అతను తిరిగే స్నేహితులను బట్టి అంచనా వేయవచ్చని చెప్పారు. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేస్తే, ఆ ప్రభావం మీ కష్టంపై, కీర్తిపై పడుతుందని వెల్లడించారు. విజయం సాధించాలనుకునే వారు ఎప్పుడూ తనకంటే సమర్థులైన, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులతోనే సావాసం చేయాలని సూచించారు.
5. దుబారా ఖర్చు: పేదరికానికి ఆహ్వానం
ఆదాయానికి మించి ఖర్చు చేయడం, కేవలం ఆడంబరం కోసమే బ్రతకడం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. కోట్లు సంపాదించిన అందులో వందలు కూడా పొదుపు చేయని వాడు, ఆపద కాలంలో నిస్సహాయుడిగా మిగిలిపోతాడని వెల్లడించారు. లక్ష్మీదేవి చంచలమైనదని, ఆమెను గౌరవించని వారి వద్ద ఆమె ఎక్కువ కాలం నిలవదని స్పష్టంగా పేర్కొన్నారు.
6. వ్యసనం: మేధస్సుకు సంకెళ్లు
ఏ రకమైన వ్యసనమైనా మనిషిని మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తుందని వెల్లడించారు. వ్యసనాలకు బానిసైన వ్యక్తి తన బాధ్యతలను మర్చిపోతాడని చెప్పారు. ఆ వ్యక్తి వ్యాపారం లేదా ఉద్యోగంపై దృష్టి పెట్టలేక తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడతాడని హెచ్చరించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఈ ఆరు అలవాట్లను వెంటనే వదిలేయాలని చాణక్య నీతి చెబుతోంది. పశ్చాత్తాపపడక ముందే మనల్ని మనం సరిదిద్దుకోవడమే నిజమైన విజేత లక్షణం.
READ ALSO: Nitish Kumar: రాజ్యసభ సభ్యుడిగా రేపే నితీష్ ప్రమాణ స్వీకారం.. బీహార్ కొత్త సీఎం ఎవరంటే!
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!