Chanakya Niti : మీ తలరాతను మార్చే చాణక్యుడి మాటలు.. దరిద్రం దాటి దర్జాగా బతకండి ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti : భారతదేశపు గొప్ప ఆర్థికవేత్త, వ్యూహకర్త ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలు నేటి కాలానికి కూడా అక్షర సత్యాలుగా పని చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం రాజ్యతంత్రాన్నే కాకుండా, ఒక వ్యక్తి ఆర్థికంగా ఎలా స్థిరపడాలో కూడా ఆయన ఆనాడే తన ‘చాణక్య నీతి’లో వివరించారు. ముఖ్యంగా చిన్న వయసులోనే ధనవంతులు కావాలనుకునే వారు పాటించాల్సిన మూడు ముఖ్యమైన విషయాలను ఆయన ఈ గ్రంథంలో నొక్కి చెప్పారు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
1. లక్ష్యం పట్ల స్పష్టత.. క్రమశిక్షణతో కూడిన కృషి
చాణక్యుడి ప్రకారం.. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందుగా ఆ పనిపై పూర్తి అవగాహన ఉండాలి. గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తే ఎలాగైతే దారి తప్పుతామో, స్పష్టమైన ఆర్థిక లక్ష్యం లేకపోతే సంపదను సృష్టించలేమన్నారు. యువత తమ శక్తిని సరైన దిశలో మళ్లించి, క్రమశిక్షణతో కష్టపడితే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుందని ఆయన చెప్పారు.
2. సమయం విలువ తెలియని వారికి సంపద దక్కదు
“కాలం ఎవరి కోసం ఆగదు” అన్నది చాణక్యుడి ప్రధాన సూత్రం. సమయాన్ని వృథా చేసే వ్యక్తి ఎంతటి మేధావి అయినా పేదరికంలోనే ఉండిపోతాడు. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రేపు చేద్దాంలే అనే ‘వాయిదా పద్ధతి’ దరిద్రానికి మొదటి మెట్టు అని చాణక్యుడు హెచ్చరిస్తారు.
3. సంపాదన కంటే పొదుపు మిన్న
డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, దానిని జాగ్రత్తగా దాచుకోవడం మరో ఎత్తు. అనవసరమైన ఖర్చులు చేసే వ్యక్తి వద్ద సంపద ఎప్పుడూ నిలవదు. ఆపద కాలంలో ఆదుకునేది మనం దాచుకున్న ధనం మాత్రమే. కాబట్టి, సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పొదుపు చేయాలని, పెట్టుబడిగా మళ్లించాలని చాణక్య నీతి చెబుతోంది.
ఎవరైతే ఈ మూడు సూత్రాలను తు.చ తప్పకుండా పాటిస్తారో, వారికి చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని చాణక్యుడు గట్టిగా నమ్మారు. ఈ సూత్రాలను పాటిస్తే సంపన్నులు కావడమే కాకుండా, సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చని ఆచార్య చాణక్యుడు సూచించారు.
READ ALSO: Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!
తాజావార్తలు
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!