Madha Gaja Raja Review: ‘మద గజ రాజా’ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Vishal, Anjali, Varlaxmi Sarathkumar, Santhanam
- DIRECTOR: Sundar C
- MUSIC: Vijay Antony
- PRODUCER: Gemini Film Circuit, Benzz Media (P) Ltd
తారాగణం: విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్, S మనోహర్, కె. జయలక్ష్మి, అజయ్ రత్నం, సుబ్బరాజు, ముత్తుకలై, అళగు మాస్టర్.
సాంకేతిక సిబ్బంది:
నిర్మాణం: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సి
తెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్
సంగీతం: విజయ్ ఆంటోని
Also Read
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
12 ఏళ్ల క్రితం చేసిన ఒక సినిమా తాజాగా రిలీజ్ అయ్యి ఊహించని విజయాన్ని సాధించింది. విశాల్ హీరోగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా సుందర్ సి దర్శకత్వంలో మద గజ రాజా అనే సినిమా తెరకెక్కింది. సుమారు 12 ఏళ్ల క్రితం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాని కాస్త లేటుగా జనవరి 31వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
రాజు అలియాస్ మద గజ రాజా(విశాల్) అరకులో ఒక కేబుల్ ఆపరేటర్. తన తండ్రి ఎస్సై కావడంతో ఓ ముద్దాయి కుమార్తె మాధవి (అంజలి)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు కానీ మనస్పర్ధలు కారణంగా వీడిపోతారు. మరోపక్క చిన్ననాటి స్కూల్ మాస్టర్(శరత్ సక్సేనా) నుంచి ఫోన్ రావడంతో ఆయన కుమార్తె పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బాల్య స్నేహితులు మరో ముగ్గురు కలుస్తారు. వారిలో ఒకరి మరదలు మాయ(వరలక్ష్మి శరత్ కుమార్)కూడా పరిచయం అవుతుంది. వివాహం అయ్యాక ఇంటికి వెళ్లాల్సిన సమయంలో వారిలో ఇద్దరికి జీవన్మరణ సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఇద్దరికీ మీడియా ఛానల్స్ అధినేత కాకర్ల విశ్వనాథ్( సోనుసూద్) తోనే సమస్య ఏర్పడింది అనే విషయం తెలియడంతో ఇద్దరి సమస్య క్లియర్ చేసేందుకు హైదరాబాద్ వెళ్తాడు రాజు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? కాకర్ల విశ్వనాథ్ తో మాట్లాడి రాజు సమస్య క్లియర్ చేయగలిగాడా? ఇందులో మంత్రి సత్తిపండు (మనోబాల ) పాత్ర ఏమిటి లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ సినిమా 12 ఏళ్ల క్రితం చేసి, అప్పుడు రిలీజ్ చేయాల్సిన సినిమా. అప్పటి ట్రెండుకు తగ్గట్టుగానే సినిమా సిద్ధం చేసుకున్నారు. పూర్తిగా కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమాని రెడీ చేశాడు దర్శకుడు. లాజిక్ జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో కామెడీనే ప్రధానంగా చేసుకొని ఫస్ట్ నుంచి ఎండు కార్డు వరకు కథ నడిపించాడు. ఓ సాధారణ కేబుల్ ఆపరేటర్, సీఎంను ఇంటికి పిలిపించుకోగలిగే సత్తా ఉన్న ఒక వ్యాపారవేత్తను ఢీ కొట్టి చివరికి అతన్ని ఎలా రోడ్డుకి ఈడ్చాడు అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ క్రమంలో సినిమాటిక్ లిబర్టీని ఒక రేంజ్ లో తీసుకున్నాడు దర్శకుడు. ఎక్కడా లాజిక్స్ జోలికి వెళ్లకుండా కేవలం తన స్ట్రెంత్ అయిన కామెడీతోనే బండి నడిపించే ప్రయత్నం చేశాడు. లాజిక్స్ ఆలోచించకుండా సినిమా చూసినవారు ఆద్యంతం నవ్వుకుంటూ ఉంటారు. ఒక కమర్షియల్ సినిమాలో ఏమేం కావాలో అవన్నీ సమపాళ్లలో కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఒక పక్క కామెడీతో పాటు హీరోయిన్ల గ్లామర్ ఒలకబోత అలాగే మాస్ ఆడియన్స్ వచ్చే సాంగ్స్ ఫైట్స్ వంటి వాటితో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.
నటీనటుల విషయానికి వస్తే:
ఒకరకంగా ఈ సినిమాలో వింటేజ్ విశాల్ కనిపించాడు. 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా కావడంతో ఇప్పటి విశాల్ కి అప్పటి విశాల్ కి చాలా తేడా కనిపించింది. కామెడీ, యాక్షన్ సీన్స్ అలాగే డాన్స్ లలో తనదైన మార్క్ తో విశాల్ అలరించాడు. హీరోయిన్లు అంజలితో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ కేవలం గ్లామర్ డాల్స్ గా మాత్రమే నిలబడిపోయారు. ఇప్పుడు ఇలాంటి పాత్రలు చెబితే వారు కచ్చితంగా చేయరేమో అనేలా వారి గ్లామర్ ఉంది. సంతానం అలాగే మనోబాల ఇద్దరూ తమదైన కామెడీతో అలరించారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో వీరు సక్సెస్ అయ్యారు. ఇక శరత్ సక్సేన సహా మిగిలిన సీనియర్ తమిళ నటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే విజయ్ ఆంటోని అందించిన సంగీతం బావుంది. అయితే కొన్నిచోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ మ్యూజిక్ కానీ ఎక్కడో విన్నామే అన్న ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా ఎలాగో రాదు కదా అనుకున్నాడో ఏమో తర్వాత వచ్చిన సినిమాల్లో వాటిని వాడేసినట్టున్నాడు. అయినా సరే ఎక్కడ బోర్ కొట్టకుండా తనదైన శైలిలో నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. లొకేషన్స్ కూడా చూడచక్కగా అనిపించాయి. వెన్నెలకంటి రాసిన డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా ఉన్నాయి. అయితే సంతానం చేత పలికించిన కొన్ని డైలాగ్స్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడేలా ఉన్నాయి..
ఫైనల్లీ:
మదగజ రాజా.. లాజిక్స్ వెతక్కుండా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు నవ్వీ నవ్వీ కడుపు నొప్పితో బయటకు వస్తాడు.
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!