NTV Telugu Site icon

Sridevi Shoban Babu Movie Review: శ్రీదేవి శోభన్ బాబు రివ్యూ

Sridevi Shoban Babu

Sridevi Shoban Babu

రివ్యూ: శ్రీదేవి శోభన్ బాబు
రిలీజ్: ఫిబ్రవరి 18, 2023
నటీనటులు: సంతోష్ శోభ‌న్‌, గౌరి కిష‌న్‌, నాగ‌బాబు, రోహిణి
నిర్మాణం: గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్
సంగీతం: కమ్రాన్
ఎడిటింగ్: శశిధర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
నిర్మాతలు: విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల‌
దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల

ఈ ఏడాది సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’ అంటూ వచ్చిన హీరో సంతోష్ శోభన్ మహాశివరాత్రి పర్వదినాన ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో గౌరీ కిషన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించటం విశేషం. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో చూద్దాం.

నాగబాబు, రోహిణి అన్నచెల్లెళ్ళు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. చెల్లెలికి పెళ్ళయి వెళ్ళిపోతే తట్టుకోలేనని ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకుంటాడు. శోభన్ బాబు (సంతోష్ శోభ‌న్‌) రోహిణి కొడుకు. ఇక శ్రీదేవి (గౌరి జి కిష‌న్‌) నాగబాబు కుమార్తె. ఈ బావామరదళ్ళ చిన్నతనంలో కుటుంబాల్లో జరిగిన సంఘటనలతో విడిపోతారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇల్లును మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటేనే దక్కుతుందని లేకుంటే అనాధాశ్రమానికి చెందుతుందని వారి తాత వీలునామా రాస్తాడు. తండ్రి మాట నమ్మి అత్త కుటుంబంపై కక్ష సాధించాలనుకున్న శ్రీదేవి శోభన్ ప్రేమలో ఎలా పడింది? మామపై శోభన్ బాబుకు ఎందుకంత కోపం? ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బావామరదళ్ళు ఒక్కటై ఇల్లు దక్కించుకుంటారా? మనసులో ప్రేమ అభిమానం ఉన్న అన్నాచెల్లెళ్ళు నాగబాబు, రోహిణి ఒక్కటవుతారా? అన్నదే ఈ చిత్ర కథాంశం.

నటీనటుల విషయానికి వస్తే హీరో సంతోష్ శోభ‌న్‌ ఎప్పటిలానే తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేశాడు. హీరోయిన్ గా నటించిన గౌరి కిష‌న్‌ జస్ట్ ఓకె. ఇక హీరోకి తల్లిగా రోహిణి, హీరోయిన్ ఫాదర్ గా నాగబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్ బాగానే ఉన్నా ప్రథమార్ధం యమ బోర్ గా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. నిజానికి తొలి భాగం ముగిసిన తర్వాత ద్వితీయభాగాన్ని భరించే ఓపిక లేని వారు థియేటర్లలోంచి జంప్ కావటం ఖాయం. సాగతీత ధోరణిలో సాగే సన్నివేవాలు, లాజిక్ లేకుండా తెగ బోర్ కొట్టిస్తాయి. ప్రశాంత్ కుమార్ దిమ్మల‌ చెప్పిన కథలో నిర్మాతలకు ఏం నచ్చిందన్నది భూతద్ధం పెట్టి వెతికినా కనపడదు. మరీ ప్యాష్ బ్యాక్ లో సాగే సన్నివేశాల్లో నాటకీయత భరించటం చాలా కష్టం.
కథ, కథనాలు ఆకట్టుకునేలా లేకపోవడంతో సాంకేతికనిపుణలు పనితనం కూడా బోసిపోయి కనిపిస్తుంది. కమ్రాన్ సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరో సంతోష్ శోభన్ ఇలాంటి కథలు చేసుకుంటూ పోతే త్వరలోనే కనుమరుగవటం ఖాయం. శోభన్ బాబు, శ్రీదేవి పేర్లు ప్రచారానికి పనికి వస్తాయని పెట్టినట్లు ఉంది తప్ప వేరే ఎలాంటి ప్రత్యకత లేదు. టైటిల్స్ లో వారి ఫోటోలను ఎందుకు వాడుకున్నారో బుర్రలేని దర్శకుడికే తెలియాలి. నిజానికి ఓటీటీకి కూడా పనికిరాని కథను తీసుకుని నిర్మాతలు సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్రసాద్‌ బాగానే ఖర్చుపెట్టి తీశారు. అయితే అది బూడిదలో పోసిన పన్నీరే.

ప్లస్ పాయింట్స్
నిర్మాణ విలువలు
అక్కడక్కడా నటీనటుల నటన

మైనస్ పాయింట్స్
కథ, కథనం, దర్శకత్వం
సాగతీతలా సాగే సన్నివేశాలు
ప్రభావం చూపని సాంకేతికనిపుల ప్రతిభ

రేటింగ్: 2/5

ట్యాగ్ లైన్: సహనానికి పరీక్ష