Razor Movie Review : రేజర్ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2 / 5
- MAIN CAST: Ravibabu, Tanish, Inaya Sulthana and others
- DIRECTOR: Ravibabu
- MUSIC: -
- PRODUCER: Ravibabu
నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రవిబాబు, తర్వాత దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేశారు. అందులో చాలా వరకు సూపర్ హిట్లు కూడా అయ్యాయి. అయితే కొంతకాలంగా ఎలాంటి సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్న ఆయన, స్వీయ దర్శకత్వంలో నటిస్తూ చేసిన సినిమా **’రేజర్’**. ముందు నుంచి యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ అంటూ ప్రమోట్ చేసిన ఈ సినిమాను, సాంప్రదాయ ప్రమోషన్లకు దూరంగా కేవలం ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లతోనే ప్రమోట్ చేస్తూ వచ్చారు రవిబాబు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రేజర్ కథ:
రాష్ట్ర సీఎంని చంపిన హోం మంత్రి, అతని కొడుకు.. ఆ తర్వాత హోం మంత్రే సీఎం అవ్వాలని ప్లాన్ చేస్తారు. అయితే, సీఎం ఫామ్ హౌస్‌లో ఆయన్ని చంపుతున్న వీడియో, సీసీ కెమెరా బిజినెస్ చేసే విష్ణు (తనీష్) చేతికి చిక్కిన విషయం హోం మంత్రికి తెలుస్తుంది. దీంతో హోం మంత్రి కొడుకు విష్ణు ఇంటికి వెళ్లి, విష్ణు , అతని భార్య (ఇనయా సుల్తానా)ని అత్యంత దారుణంగా చంపేస్తాడు. అయితే, అదే సమయానికి వారి కుక్కకు గ్రూమింగ్ చేయడానికి వచ్చిన మొబైల్ పెట్ గ్రూమింగ్ సంస్థ యజమాని (రవిబాబు), విష్ణు కుమార్తెను కాపాడుతాడు. ఆ పాపను చంపడానికి హోం మంత్రి, అతని కొడుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ పాపకు హాని తలపెట్టాలని వచ్చిన వారందరినీ అత్యంత పాశవికంగా చంపేస్తాడు రవిబాబు. ఇంతకీ ఆ పాపను రవిబాబు చివరి వరకు కాపాడాడా లేదా? ఒక పెట్ గ్రూమింగ్ సంస్థ నడుపుకునే రవిబాబు వాళ్లందరినీ ఎలా అంతమొందించగలిగాడు? సినిమా టైటిల్ ‘రేజర్’కు జస్టిఫికేషన్ ఏంటి? చివరికి హోం మంత్రి, అతని కొడుకు ఏం చేశారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
‘అల్లరి’, ‘నచ్చావులే’, ‘నువ్విలా’ సహా ‘అనసూయ’, ‘అమరావతి’ లాంటి థ్రిల్లర్ సినిమాలు డైరెక్ట్ చేసిన రవిబాబు నుంచి ఏదైనా ప్రాడక్ట్ వస్తుంది అంటే, ప్రేక్షకులు కచ్చితంగా ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తారు. ఈ సినిమాకి కూడా ఆయన తరహా సినిమాలు నచ్చేవారు అలాగే ఎదురుచూశారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి తనదైన శైలిలో నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర హోం మంత్రి, ఆయన కుమారుడు చంపేయడం.. ఆ తర్వాత హోం మంత్రి సీఎం అవ్వాలని అనుకోవడం.. సీఎంను చంపుతున్న వీడియో వేరే వ్యక్తి చేతికి రావడం.. ఇదంతా ఒక రొటీన్ ఫార్మాట్ లాగానే సాగింది. ఆ తర్వాత కూడా కథ వేగంగా పరుగెడుతుంది అనుకుంటే అదేమీ లేదు. ఎక్కడా కొత్తదనం లేకుండా రొటీన్ గానే అనిపించింది.
అయితే, రవిబాబు ఈ సినిమా వరకు తీసుకున్న జాగ్రత్తలలో ఒకటి, యాక్షన్ ఎపిసోడ్స్ మీద దృష్టి పెట్టడం. వాస్తవానికి ‘కిల్’, ‘మార్కో’ లాంటి సినిమాలు హింస విషయంలో ఇప్పటికే ఒక మార్క్ సెట్ చేసేసాయి. తెలుగు నుంచి అలాంటి సినిమా రాలేదేమో అనుకుంటున్న సమయంలో, నాని ‘హిట్-3’ సినిమాతో అలాంటి మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయగా.. ఇప్పుడు ఆ సినిమా మార్కుని తుడిచిపెట్టేందుకు ఈ ‘రేజర్’ సినిమా చేశారేమో అనిపించింది. అది కూడా కేవలం హింస విషయంలోనే!
సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ, ఈ మధ్యకాలంలో ఈ స్థాయి వైలెన్స్ మాత్రం ఏ సినిమాలోనూ చూసింది లేదు. కళ్ళముందు జరుగుతున్నవన్నీ నిజంగా జరిగితే ఏంట్రా బాబు అని ఒళ్ళు గగుర్పాటు పొడిచేలా యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. కథ మాత్రం పరమ రొటీన్. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈజీగా గుర్తుపట్టేయగలరు. కాకపోతే కాస్త టెక్నాలజీతో కొన్ని ట్విస్టులు లాగా రాసుకున్నారు, అవి కొంతవరకు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నటీనటులు:
ఒక రకంగా హీరో లాంటి పాత్రలో నటించిన రవిబాబు, ఎప్పటిలాగే నటనతో ఆకట్టుకున్నాడు. ఒకపక్క దర్శకుడిగా, మరొక పక్క నటుడిగా రెండు బాధ్యతలు మోసిన ఆయన.. నటుడిగా కూడా తన శైలిలో పూర్తిస్థాయిలో మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. చిన్నారి పాత్రలో నటించిన పాప ఆకట్టుకుంది.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఫైట్ డిజైన్ చేసిన ఫైట్ మాస్టర్ భుజాల మీదనే గట్టి బాధ్యతలు పడినట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గట్టుగా సరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ మీద ఇంకా ఫోకస్ పెట్టి కాస్త ట్రిమ్ చేయొచ్చు. అలానే వైలెన్స్ కూడా ఆ స్థాయిలో అక్కర్లేదేమో అనిపిస్తుంది.
ఫైనల్ గా: ఈ ‘రేజర్’.. హింసను ఇష్టపడే వారికి మాత్రమే!
తాజావార్తలు
-
BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
-
Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ vs కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
-
RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
-
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!