Premistava Movie Review: ప్రేమిస్తావా మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Akash Murali, Adiri Shankar and Others
- DIRECTOR: Vishnu Vardan
- MUSIC:
- PRODUCER: Xavier Britto
ఒకప్పటి తమిళ హీరో మురళి కుమారుడు అధర్వ మురళి ఇప్పటికే తమిళంలో హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఆయన సోదరుడు ఆకాష్ మురళి హీరోగా పరిచయవుతుండగా శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్ గా నెసప్పియా అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే సినిమాని తెలుగులో ప్రేమిస్తావా అనే పేరుతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది. విజయ్ తో మాస్టర్ లాంటి సినిమా నిర్మించిన జేవియర్ బ్రిట్టో తన కుమార్తెతో కలిసి ఈ సినిమాని నిర్మించారు. అజిత్‌తో తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేసి తెలుగులో పవన్ కళ్యాణ్ తో పంజా లాంటి సినిమా చేసిన విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
ప్రేమిస్తావా కథ:
దియా(అదితి శంకర్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు అర్జున్(ఆకాష్ మురళీ). ఆమెకి ప్రపోజ్ చేస్తే మొదట తిరస్కరిస్తుంది. ఆ తర్వాత అర్జున్ ని చూడకుండా దియా ఉండలేని పరిస్థితికి చేరడంతో తన పాస్ట్ బ్రేకప్ గురించి చెప్పి మరీ రిలేషన్ లోకి ఎంటర్ అవుతుంది. చదువు పూర్తయ్యాక లివింగ్ రిలేషన్లో ఉండగా అర్జున్ ప్రేమను దియా తట్టుకోలేక పోతుంది. తనకి స్స్పేస్ కావాలని అడిగడమే కాదు పోర్చుగల్ వెళ్ళడానికి రెడీ అవడంతో గొడవలు అయి బ్రేకప్ చేసుకుంటారు. కాలం గడుస్తుంది. ఒకానొక రోజు పోర్చుగల్ వెళ్లిన దియా ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన వార్త చూసి పోర్చుగల్ వెళ్తాడు అర్జున్. దియాని కలిసే ప్రయత్నం చేస్తాడు. మరి అర్జున్ దియాని ఈ కేసు నుంచి బయటపడేశాడా? మళ్లీ దియాని కలిశాడా? ఆమెని బయటకు తీసుకురావడానికి కల్కి కొచ్లిన్ ఎందుకు ముందుకు వచ్చింది? అసలు దియా హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చింది ఎవర్ని? శరత్ కుమార్, ఖుష్బూలకు ఈ స్టోరీతో ఉన్న సంబంధమేంటి? అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాలి.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమాని తమిళంలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే అక్కడ మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా కంటెంట్ మాత్రం లోకల్ కాదు యూనివర్సల్. ఎందుకంటే ప్రేమ బ్రేకప్ వంటి విషయాలు ఇప్పుడు అనకాపల్లి నుంచి అమెరికా వరకు చాలా కామన్ అయిపోయాయి. ఈరోజుల్లో ఉన్న యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు ఇది. ఎందుకు ప్రేమలో పడుతున్నారో తెలియకుండానే ప్రేమలో పడటం, అంతే ఈజీగా బ్రేకప్ చెప్పుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. సిటీ కల్చర్ లో పెరిగిన ఒక అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఆకర్షితులై ప్రేమలో పడటం, ఆ తరువాత బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం ఈ సినిమా లైన్ గా చూపించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి విదేశాలకు వెళ్లి అక్కడ తన బాస్ కుమారుడితో ప్రేమాయణం నడిపి అతను మరో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అతన్ని చంపేయడంతో జైలు పాలు అవుతుంది. ఇలా ఫస్ట్ హాఫ్ వరకు చూపించి కథలో ఆసక్తి రేకెత్తించాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అరెస్టు అయిన దియాని అర్జున్ విడిపించే ప్రయత్నం చేసే సీన్లు ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంత ఇండియాలో తర్వాత పోర్చుగల్ లో సాగినా సెకండ్ హాఫ్ మొత్తం పోర్చుగల్ లోనే ఉంటుంది. ప్రేమించి వదులుకున్న దియా కోసం అర్జున్ పడే బాధ సగటు ప్రేమికుడు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కొంత యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ కథలో ఉన్నాయి. అయితే ఈ ప్రేమ కథ ఆర్గానిక్ గా లేకుండా కట్టే కొట్టే తెచ్చేలా చూపడంతో ప్రేక్షకులు ఆ ఫీల్ కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. దానికి తోడు సినిమా సాగదీసిన ఫీలింగ్ కలగడం కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక విష్ణువర్ధన్ లాంటి దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ ఆయన మాత్రం రొటీన్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేశాడు. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులతో అలాగే ఎమోషనల్ కనెక్టివిటీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. అది సినిమాకి కాస్త ఊపిరినిచ్చే అంశం.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాతో హీరోగా మారాడు మురళి చిన్న కుమారుడు, అధర్వ మురళి తమ్ముడు అయిన ఆకాశ మురళి. నిజానికి ఇది అతనికి మొదటి సినిమానే అయినా ఎక్కడ నటనలో ఆ ఫీలింగ్ మాత్రం కలగలేదు. బహుశా తండ్రి వారసత్వం ఉండడం వలనో లేక సినిమా కోసం గట్టిగా వర్క్ షాప్స్ చేశారో తెలియదు కానీ ఎక్కడ సహజత్వం కోల్పోకుండా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. క్యూట్ నెస్ తో లవర్ బాయ్ గా అలరిస్తూనే అవసరమైన చోట అభినయంతో ఆకట్టుకున్నాడు. ఇక దియా పాత్రలో నటించిన శంకర్ కుమార్తె అదితి శంకర్ కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఇక కల్కికి చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులు ముందుకు డబ్బింగ్ సినిమాతో అయినా వచ్చింది. తనదైన పాత్రతో ఆకట్టుకుంది. ఇక శరత్ కుమార్, కుష్బూ వంటి వారు తమ అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించారు. ఇక టెక్నీషియన్ల విషయానికి వస్తే ముందుగా దర్శకుడు విష్ణువర్ధన్ గురించి మాట్లాడుకోవాలి. నిజానికి ఆయనకు గ్రాండియర్ సినిమాలు చేస్తారనే పేరు ఉంది. అలాంటి ఆయన మొదటిసారిగా ఇలాంటి లవ్ సబ్జెక్టు చేయడంతో ఎందుకో తడబడిన ఫీలింగ్ కలిగింది. విషయం కరెక్ట్ గా చెప్పాల్సిన చోట లాగ్ చేసి ఎమోషనల్ గా చూపించాల్సిన చోట చుట్టేసిన ఫీలింగ్ కలగడం ప్రేక్షకులకు సినిమా మీద కాస్త ఇబ్బందికర అంశం. ఇక సినిమాలో మరో కీలకమైన విషయం మాత్రం మ్యూజిక్ అనే చెప్పాలి. మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉండడం ఒక అసెట్. ఇక సినిమాటోగ్రఫీ విషయం కూడా సినిమాకి ప్రధానమైన అసెట్ అని చెప్పాలి. ఎక్కడా చిన్న సినిమా అనే ఫీలింగ్ కలగకుండా నిర్మించడం నిర్మాణ సంస్థ నిర్మాణం విలువలకు అద్దం పడుతుంది.
ఇక ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే నేటి యూత్ పరిస్థితులకు అద్దం పట్టే సినిమా ఇది
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!