Diamond Dacoit Review: ‘డైమండ్ డెకాయిట్’ రివ్యూ!
- సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన డైమండ్ డెకాయిట్
- క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో రూపొందిన డైమండ్ డెకాయిట్
- ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Partha Gopal, Meghana Reddy
- DIRECTOR: Surya G Yadav
- MUSIC: Peddapalli Rohith
- PRODUCER: Partha Gopal
సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో పార్ధ గోపాల్, మేఘన జంటగా తెరకెక్కిన సినిమా ‘డైమండ్ డెకాయిట్’. ఈ సినిమాను హీరో పార్థ గోపాల్ నిర్మించారు. క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో రూపొందిన చిత్రం కుటుంబ ప్రేక్షకులే టార్గెట్‌గా తెరకెక్కింది. డైమండ్ డెకాయిట్ సినిమా ఈరోజు (ఏప్రిల్ 10) రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో గోపాల్ కుటుంబం అనుకోని పరిస్థితుల్లో చిన్నాభిన్నం అవుతుంది. మరోవైపు భయంకరమైన డెకాయిట్‌గా ముద్రపడిన మునుస్వామి నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎదుగుతాడు. జైలు నుంచి విడుదలైన గోపాల్.. మునుస్వామి నాయుడు గ్యాంగ్‌లో చేరుతాడు. పైకి మునుస్వామికి నమ్మకస్తుడిగా కనిపిస్తూనే.. లోపల అమాయకులను రక్షించే ‘డబుల్ లైఫ్’ గడుపుతుంటాడు. అసలు గోపాల్ జైలుకు ఎందుకు వెళ్లాడు?, అతను బందిపోటుగా ఎందుకు మారాల్సి వచ్చింది?, వరుస హత్యల వెనుక ఉన్న నిగూఢ సత్యం ఏమిటి? అన్నడి తెరపై చూడాల్సిందే.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
నటీనటుల పనితీరు:
సినిమాకు ఆపర్ధ గోపాల్ వెన్నెముక. అటు నిర్మాతగా నాణ్యతలో రాజీ పడకుండా, ఇటు హీరోగా ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్లలో అద్భుతమైన నటన కనబరిచారు. హీరోయిన్ మేఘన తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా.. కీలక సన్నివేశాల్లో పరిణతి చెందిన నటనతో మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
విశ్లేషణ:
దర్శకుడు సూర్య జి. యాదవ్ కథను మలిచిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను చాలా బలంగా తెరకెక్కించి ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. డైరెక్టర్ కథను ప్రారంభించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా.. ఆ తర్వాత ఆసక్తికరంగా సాగించాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. స్క్రిన్‌ప్లే మరింత బలంగా రాసుకొని ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కుటుంబ అనుబంధాలను, త్యాగాన్ని ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ఇది. యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ కేవలం కథలో భాగంగానే ఉంటాయి తప్ప.. సినిమా అంతర్లీనంగా ఒక హృద్యమైన ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. శివ అచంట విజువల్స్ ఈ సినిమాకు పెద్ద హైలైట్. కడప జిల్లాలోని 60కి పైగా సహజమైన లొకేషన్లను ఎంతో రిచ్‌గా చూపిస్తూ కథలో ఫీల్‌ను పెంచారు. పీఆర్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి ఎమోషనల్ సీన్‌ను ఎలివేట్ చేసింది. తండ్రిపై వచ్చే పాట గుండెను తాకేలా ఉంది.
ఫైనల్లీ: కుటుంబ బంధాలు, త్యాగం ఇష్టపడే ప్రేక్షకులకు ‘డైమండ్ డెకాయిట్’ ఒక మంచి అనుభూతినిస్తుంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!