Oke Oka Jeevitham Review : ఒకే ఒక జీవితం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Sharwanand ,Ritu Varma ,Amala Akkineni, Nassar
- DIRECTOR: Shree Karthick
- MUSIC: Jakes Bejoy
- PRODUCER: S. R. Prakashbabu, S. R. Prabhu
శర్వానంద్ గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. రొటీన్ కు భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని, కమర్షియల్ హిట్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే పంథాలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో అతను చేసిన సినిమానే ‘ఒకే ఒక జీవితం’. ఈ మూవీతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం కాగా, తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. అక్కినేని అమల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు వచ్చింది.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ఆది (శర్వానంద్), శ్రీను (‘వెన్నెల’ కిశోర్), చైతు (ప్రియదర్శి) చిన్ననాటి స్నేహితులు. ఈ ముగ్గురికీ వారి వారి స్థాయిల్లో సమస్యలు ఉంటాయి. సింగర్ కావాలనే కోరిక ఉన్నా, చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్రావర్ట్ గా మారిపోతాడు ఆది. అతన్ని మామూలు మనిషిని చేయడానికి ప్రియురాలు వైష్ణవి (రీతువర్మ) ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి సమయంలో వారికి సైంటిస్ట్ పాల్ (నాజర్) కారణంగా గతంలోకి వెళ్ళే ఛాన్స్ దక్కుతుంది. చిన్నప్పుడు చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవచ్చనే భావనతో ఆది, శ్రీను, చైతు ట్రైమ్ ట్రావెల్ ద్వారా వెనక్కి వెళ్ళడానికి సిద్ధపడతారు. మరి తన తల్లి మరణాన్ని తప్పించాలని చూసిన ఆది కోరిక నెరవేరిందా? గతంలో చేసిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకోవాలని అనుకున్న శ్రీను, చైతు కల నెరవేరిందా? ఏదో చేయాలని గతంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వర్తమానంలోకి రావడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్నదే మిగతా కథ.
టైమ్ ట్రావెల్ మూవీ అనగానే తెలుగువారందరికీ గుర్తొచ్చేది ‘ఆదిత్య 369’. అది మనకో లాండ్ మార్క్ మూవీ. దాన్నంత గొప్పగా ఆ తర్వాత మరే సినిమా రాలేదు. భవిష్యత్తులో వస్తుందో లేదో కూడా తెలియదు. అయితే కళ్ళ ముందు అంత గొప్ప ఉదాహరణ ఉండి కూడా మనవాళ్ళు టైమ్ (ట్రావెల్) మిషన్ నేపథ్యంలో అలాంటి కథను రాసుకోలేకపోతున్నారు. కానీ ఇందులో దర్శకుడు శ్రీకార్తీక్ కొంత వైవిధ్యం కోసం కృషి చేశాడు. తాను గతంలో ఉన్న చోటకు తానే వెళ్ళడమే కాకుండా అక్కడ అప్పటి ఆదిని, ఇప్పటి ఆదిని కూడా కలిపి చూపించడం అనేది ప్రేక్షకులకు కాస్త థ్రిల్ ను కలిగిస్తుంది. ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ గతంలోకి వెళ్ళి తర్వాత పండించిన కామెడీ సినిమాను చూస్తున్న ప్రేక్షకులలో బోలెడంత జోష్ ను నింపింది. తరుణ్ భాస్కర్ రాసిన సహజమైన సంభాషణలు అందుకు బాగా దోహదపడ్డాయి. అలానే శర్వానంద్, అమల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు సైతం ఎమోషనల్ గా ఉండి, ప్రేక్షకుల కళ్ళలో నీళ్ళు చిప్పిల్లేలా చేశాయి. బట్… దర్శకుడు శ్రీకార్తిక్ ఈ సెంటిమెంట్ సీన్స్ కు ఇచ్చిన ప్రాధాన్యం కాస్తంత లాజికల్ గా స్టోరీని రాసుకోవడం మీద పెట్టి ఉండాల్సింది. ఇలాంటి సినిమాలలో మ్యాజిక్ వర్కౌట్ అయితే లాజిక్ గురించి ఎవరూ ఆలోచించరనేది నిజమే. కానీ దానిని టేకిట్ గ్రాంట్ గా తీసుకుంటేనే సమస్య వస్తుంది. ఎవరు ఏ మాత్రం ఈ పాయింట్ తో కనెక్ట్ కాకపోయినా… పెదవి విరిచే ఆస్కారం ఉంటుంది.
నటీనటుల విషయానికి వస్తే… శర్వానంద్ ఈ మూవీ మీద ఎందుకు ఇంతగా హోప్స్ పెట్టుకున్నాడో అతని పాత్రను చూస్తే తెలుస్తోంది. ఆది పాత్రలో శర్వా చక్కగా ఒదిగిపోయాడు. చాలా ఓన్ చేసుకుని ఆ పాత్రను పోషించినట్టు అర్థమౌతోంది. ఆ తర్వాత స్థానం అతని స్నేహితులుగా నటించిన ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శికి దక్కుతుంది. వాళ్ళ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సినిమా స్లోగా నడుస్తోందనే భావన ప్రేక్షకులకు కలిగినప్పుడల్లా వాళ్ళు తమదైన తరహాలో వినోదాన్ని పండించి, మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చారు. అమల కూడా తల్లి పాత్రను చక్కగానే పోషించింది. కానీ ఆమె ఫిజికల్ ఎప్పీయరెన్స్ అంత ఎట్రాక్టివ్ గా లేదు. అలానే వేరెవరితో అయినా డబ్బింగ్ చెప్పించి ఉంటే, ఆ పాత్ర మరింతగా ఎలివేట్ అయి ఉండేది. బట్… తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ సీన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. మరో ప్రధాన పాత్రను నాజర్ పోషించారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం బాగున్నాయి.
సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ విధిని మార్చడమనేది అసాధ్యమని దర్శకుడు శ్రీకార్తీక్ ఈ మూవీ ద్వారా చెప్పాడు. దాన్ని కాస్తంత కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు. భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళితే కొంత నిరాశకు గురి అవుతారు. అలా కాకుండా ఓపెన్ మైండ్ తో వెళ్ళే వారికి; ట్రైమ్ టావెల్, సెంటిమెంట్ మూవీస్ ను ఇష్టపడేవారికి ‘ఒకే ఒక జీవితం’ నచ్చే ఆస్కారం ఉంది.
రేటింగ్: 2.75 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
సెంటిమెంట్ సీన్స్
పండిన వినోదం
మైనెస్ పాయింట్స్
స్లో నెరేషన్
లాజిక్స్ లేకపోవడం
ట్యాగ్ లైన్: ఒకే ఒక్కసారి!
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..