Nani’s Hit 3 Review: హిట్ 3 రివ్యూ.. నాని హిట్ కొట్టాడా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Nani, Srinidhi Shetty, Komalee Prasad, CHaithu Jonnalagadda and others
- DIRECTOR: Dr Sailesh Kolanu
- MUSIC: Mickey J Mayor
- PRODUCER: Prashanthi Tripirneni
నాని హీరోగా నటిస్తున్న హిట్: థర్డ్ కేస్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతకుముందు ఇదే సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో పాటు, నాని జడ్జింగ్ కెపాసిటీపై ప్రేక్షకులలో ఏర్పడిన నమ్మకం కారణంగా ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగా సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి అలాంటి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
హిట్ 3 : థర్డ్ కేస్ కథ:
అర్జున్ సర్కార్ (నాని) హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీంలో ఎస్పీ. కాశ్మీర్‌లో తాను చేపట్టిన ఒక కేసు నుంచి అనుకోకుండా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్ అయి విశాఖపట్నంకు వచ్చిన అర్జున్ సర్కార్ దారుణంగా రెండు హత్యలు చేస్తాడు. అయితే, ఒక పోలీసు అధికారి ఇలా కిరాతకంగా హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అర్జున్ సర్కార్ చేసిన హత్యల వల్ల ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
నిజానికి హిట్ ఫ్రాంచైజ్‌లో వచ్చిన రెండో సినిమా చివరిలో అర్జున్ సర్కార్ ఎంట్రీ ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. ఈ పార్ట్ కూడా దాదాపు అక్కడి నుంచే మొదలవుతుంది. అర్జున్ సర్కార్ జైలుకు వెళ్లడం, అక్కడ ఒక ఖైదీకి తన కథ చెప్పడం మొదలుపెట్టడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి ఎక్కడా గ్యాప్ లేకుండా కథనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. గ్యాప్ లేకుండా చూసుకున్నాడు కానీ, ఎందుకో సినిమా మొదలైనప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ కొంత సాగదీస్తున్న ఫీలింగ్ కలగడం సహజం. మొదలైనప్పటి నుంచి అర్జున్ సర్కార్ విశాఖపట్నం రావడం, రెండు హత్యలు చేయడం, అంతకుముందు కాశ్మీర్‌లో ఇలాంటి ఒక కేసు అతని దృష్టికి రావడం వంటి విషయాలను కనెక్టింగ్‌గా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే, ఎప్పుడైతే కథ అరుణాచల్ ప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుందో, అక్కడి నుంచి కూడా సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక మంచి హైతో క్లోజ్ చేసి, సెకండ్ హాఫ్ కూడా అదే జోష్‌తో మొదలుపెట్టాడు. కానీ, అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లాక కాస్త మరింత మందగించిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకే ప్రదేశంలో కథ సాగుతూ ఉండడం కాస్త ఇబ్బందికర అంశమే. అయినా, క్లైమాక్స్‌లోని 20 నిమిషాలు మాత్రం చాలా గ్రిప్పింగ్‌గా, ప్రేక్షకులను అబ్బురపరిచేలా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులు ఊహించే విధంగానే ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి కాస్త ఆసక్తి రేకెత్తించి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌కు షిఫ్ట్ అయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన స్క్విడ్ గేమ్ తరహా వరల్డ్‌ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఎపిసోడ్ కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగినా, కొన్ని మూమెంట్స్ మాత్రం సినిమాటిక్‌గా అద్భుతంగా ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే:
ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న నాని ఈ సినిమాలో మరింత వైలెంట్‌గా కనిపించాడు. దయ దక్షిణ్యాలు లేని ఒక పోలీస్ అధికారి పాత్రలో జీవించాడు. సినిమాను వన్ మ్యాన్ షోలా నడిపించాడు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి కొద్దిసేపు కనిపించినా ఆకట్టుకుంది. ఆమె చేత కూడా ఫైట్స్ చేయించారు. ఇక కోమలి ప్రసాద్, చైతూ జొన్నలగడ్డ, రావు రమేష్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆసక్తికరంగా నటించారు. చివరిలో ఎంట్రీ ఇచ్చిన అడవి శేషు థియేటర్లలో కేకలు పెట్టించాడు. ఇక కార్తీక్ కూడా తర్వాతి భాగానికి హీరోగా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
టెక్నికల్ విషయానికి వస్తే:
నాని ఈ సినిమా సంగీతం మీద పెట్టుకున్న నమ్మకాలు వమ్మయ్యాయని చెప్పాలి. మెలోడీకి ఫేమస్ అయిన మిక్కీ జే మేయర్ చేత ఇలాంటి థ్రిల్లర్ సినిమాకు సంగీతం చేయించడం సాహసమే. కానీ ఆ సాహసం ఫలించలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. సరికదా, పాటలు స్పీడ్ బ్రేకర్‌లా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా సన్నివేశాల్లో కనిపించింది. రక్తం ఎన్ని ట్యాంకర్లు వాడారో చెప్పలేం.
ఫైనల్‌గా:
హిట్: థర్డ్ కేస్ – నాని మార్క్ బ్లడ్ బాత్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!