Mayookha Movie Review: మయూఖ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: పాయల్ చెంగప్ప, అమన్ మసూద్, మురళీధర్ గౌడ్, జాను వర్మ, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ, బేబి మాన్వీ, మాస్టర్ షణ్ముఖ చరణ్ తదితరులు
- DIRECTOR: శ్రీతేజ్
- MUSIC: శిబి మ్యాథ్యూ అలెక్స్
- PRODUCER: శశిధర్ నల్ల
శ్రీకాంత్ కాడ్రేగుల (శ్రీతేజ్ ఎస్.కె.) దర్శకత్వంలో పాయల్ చెంగప్ప టైటిల్ రోల్లో నటించిన సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ ‘మయూఖ’. శశిధర్ నల్ల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
మయూఖ కథ:
మయూఖ (పాయల్ చెంగప్ప) ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ సింగిల్‌గా ఫ్లాట్‌లో ఉంటుంది. రాత్రిపూట తనతో పాటు ఫ్లాట్‌లో ఎవరో ఉన్నారనే అనుమానం, భయంకరమైన కలలు ఆమెను వేధిస్తుంటాయి. బ్యాంకులో కుమార్ (అమన్ మసూద్) అనే కస్టమర్‌తో గొడవ జరగగా, ఆమెను సహోద్యోగి అభిరామ్ కాపాడుతాడు. ఆ తర్వాత అభిరామ్ హత్యకు గురికావడంతో, ఎస్.ఐ. శ్రీధర్ ఈ కేసును విచారించి మయూఖే అపరాధిగా భావిస్తాడు. అసలు మయూఖకు వచ్చే కలల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కాలిన చర్మం వాసన ఆధారంగా హత్యలు చేసే సైకో ఎవరు? కాలిన మహిళల చర్మంతో పెర్ఫ్యూమ్ తయారు చేసే ఆ కిరాతకుడికి, మయూఖకు ఉన్న సంబంధం ఏంటి? ఈ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? అనేదే ఈ సినిమా అసలు కథ.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
విశ్లేషణ:
హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లను డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిది. దర్శకుడు శ్రీతేజ్ ఎస్.కె. ఒక డిఫరెంట్ పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, దానిని తెరపై ఆవిష్కరించిన తీరులో కొంత రఫ్ నేచర్ కనిపిస్తుంది. నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే హత్యతో సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా, ఫస్టాఫ్‌లో అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడంతో కొంత సాగదీత భా కలుగుతుంది. అయితే, సెకండాఫ్‌లో అసలు కథ ప్రారంభమయ్యాక వచ్చే ట్విస్టులు సినిమాకు వేగాన్నిస్తాయి. మురళీధర్ గౌడ్ పాత్ర ఎంట్రీ తర్వాత కథ పూర్తిగా భావోద్వేగపూరితంగా, షాకింగ్‌గా మారుతుంది. పది, పన్నెండేళ్ల బాలుడు సైకోగా మారడం, కాలిన చర్మం నుంచి పెర్ఫ్యూమ్ తయారు చేయడం వంటి కొన్ని సన్నివేశాలు జుగుప్సను కలిగించేలా ఉన్నప్పటికీ, థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఇవి కిక్ ఇస్తాయి. స్క్రీన్‌ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా మలిచి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పాయల్ చెంగప్ప టైటిల్ రోల్లో సినిమాను తన భుజాలపై మోశారు. భయపడే సన్నివేశాల్లో ఆమె హావభావాలు, కళ్ల ద్వారా చూపించిన ఎక్స్ప్రెషన్స్ సినిమాకు ప్రధాన బలం. బిగ్‌బాస్ ఫేమ్ అమన్ మసూద్ తన విభిన్న నటనతో ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్ పాత్ర సినిమాను కీలకమైన మలుపు తిప్పుతుంది. ఆయన ఎమోషనల్ యాక్టింగ్ హైలైట్‌గా నిలుస్తుంది. దేవ్ శశాంక్, రఘు వాసిరెడ్డి, నానాజీ కర్రి తదితరులు తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే శిబి మ్యాథ్యూ అలెక్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. కేవలం సౌండ్స్‌తోనే థియేటర్లో ఆడియన్స్‌ను భయపెట్టడంలో సంగీత దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. ఫర్హాన్ వడక్కం విజువల్స్, లైటింగ్ మరియు కలర్ గ్రేడింగ్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా అత్యుత్తమంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
ఫైనల్‌గా వణికించే ‘మయూఖ’
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు