మాస్టర్ మహేంద్రన్ హీరో గా, యష్ణ ముత్తులూరి మరియు నేహా పఠాన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం నీలకంఠ. మాధవన్ దర్శకత్వం వహించగా ఒకప్పటి హీరోయిన్ స్నేహా ఉల్లాల్ స్పెషల్ సాంగ్ లో నటించింది. సీనియర్ నటులు రాంకీ,బబ్లూ పృథ్వీ,శుభలేఖ సుధాకర్,చిత్రం శీను,సత్య ప్రకాష్,అకాండ శివ,భరత్ రెడ్డి,తదితరులు నటించారు. అనిల్ ఇనుమడుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా L S ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మర్లపల్లి శ్రీనివాసులు,దివి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఒక రోజు ముందుగా ప్రిమియిర్స్ ప్రదర్శించిన ఈ సినిమా ఎలా ఉందంటే..?
కథ : సరస్వతిపురం అనే ఒక గ్రామం లో కట్టుబాట్లకు చాలా విలువనిస్తారు.ఆ గ్రామంలో తప్పు చేస్తే గ్రామా పెద్ద రాఘవయ్యా( రాంకీ) కఠినమైన శిలుక్ష విధిస్తాడు. అదే ఊరులో టైలర్ వృత్తి చేసుకొనే నాగ భూషణం ( కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ( మాస్టర్ మహేంద్రన్ ) బాగా చదివే వాడు కానీ తాను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక తప్పు చేస్తే 15 సంవత్సరాలు వూరు నుంచి బయటికి పోకుండా ఉండాలని నిర్ణయిస్తారు. దాంతో నీలకంఠ జీవితంలో తానూ ఎంతో ఇష్టపడే ఆ వూరు సర్పంచ్ ( పుధ్వీ) కూతురూ సీత( యష్ణ ముతులూరి) వెళ్ళిపోతుంది. నీలకంఠ తన చిన్న తనంలోనే వాళ్ళ అమ్మాకి మాటిస్తాడు కానీ తన మాట నిలబెట్టుకోలేక పోతున్న అని చాల బాధపడతాడు. అలాగే సరస్వతిపురంలో కబడ్డీ ఆటకి ఒకప్రత్యకమైన స్థానం ఉంది. అసలు నీలకంఠకు ఎందుకు అన్నేళ్లు శిక్ష వేస్తారు, సీత ఎందుకు నీలకంఠకు దూరంగా వెళ్ళింది. చదువుకి దూరం అయినా నీలకంఠ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ని ఎలా నిలబెట్టుకున్నాడు. తన సీతని ఎలా గెలిచాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
విశ్లేషణ : ఈ సినిమాకి కోర్ పాయింట్ చాలా కొత్తగా వుంది. కధ స్టార్ట్ అయినా పది నిమిషంలోనే మనకు ఆది అర్ధమవుతుంది.ఊరులో వుండే జనం ఎంత ప్రేమగా ఉంటారో అంతే కఠినంగా వుంటారు అని బాగా చూపించారు. ఈ కధ నాన్ లినియర్ స్క్రీన్ ప్లే తో మొదలు అవుతుంది. దాని వాళ్ళ నెక్ట్ ఎం జరుగుతుంది అని క్యూరియాసిటీ చూస్తున్నఅంతా సేపు ఆడియన్స్ కలుగుతుంది. ఎమోషనల్ సీన్స్ చాల బాగా చూపించారు . ఫస్ట్ హాఫ్ కొంచమ్ స్లో గా నెమ్మదిగా సాగుతుంది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంటర్వెల్ లో ఒక సస్పెన్సుతో ఎండ్ చేస్తారు.సెకండ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు జాతర ఎపిసోడ్ సినిమాకు మేజర్ ప్లస్. అలాగే చివరి 30 నిముషాలు స్టోరీ యొక్క పే అఫ్ లు చాలా బాగుంది.
నటీనటులు పని తీరు : మాస్టర్ మహేంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. తనదైన సహజ నటనతో చాలా సెటిల్డ్ గా పెర్ఫర్మ్ చేసాడు తన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది తన క్యారెక్టర్ తో ఆడియన్సు కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్ లో తను చాల ఎఫర్ట్ పెట్టాడు.యాక్షన్ ఏపిసోడ్స్ లో ఎక్సపీరియన్స్ నటుడిలాగా పెరఫామెన్స్ చేసాడు. యాశ్న ముత్తులూరి సీత పాత్ర లో మెప్పించింది. రాంకీ గారిని చాల రోజుల తరువాత స్క్రీన్ మీద బాగా చేసారు కానీ డబ్బింగ్ అంతగా సెట్ అవలేదు. యానిమల్ పృద్వి ఎప్పటిలాగే చేశారు.
టెక్నికల్ పనితీరు : ఈ సినిమాని రచించి దర్శకత్వం వహించిన రాకేష్ మాధవన్ తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చెప్పడం లో విజయం సాధించాడు. డైలాగ్స్ లో బలం ఉంది. కానీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాస్త ఆడియెన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుంది. రూరల్ బ్యాక్డ్రాప్ కథలను స్ట్రయిట్ గా చెప్పినపుడు ఆడియన్స్ కు ఎక్కువ రీచ్ ఉంటుంది. శ్రవణ్ జీ కుమార్ సినిమాటోగ్రఫీ ఓకే. కానీ ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయి. మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లి : మెచ్చుకోదగిన ప్రయత్నం..