కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ హీరో. రాజమౌళి పుణ్యమా అని తెలుగులో కూడా మంచి ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య ఆయన చేస్తున్న కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ తర్వాత కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘మ్యాక్స్’ సినిమా కన్నడనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ వారం ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ: ఇది ఓ పోలీస్ స్టోరీ. తెల్లారితే డ్యూటీలో జాయిన్ కావాల్సిన సీఐ మ్యాక్స్ అలియాస్ అర్జున్ మహాక్షయ్ (సుదీప్) అనూహ్యంగా ఓ చోట మహిళను ఏడిపిస్తున్న ఇద్దరినీ అరెస్టు చేస్తాడు. అయితే వాళ్లు ఇద్దరు మంత్రుల కుమారులు అని, గని భాయ్ (సునీల్) ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ సేవించి మత్తులో మునిగి ఇంటికి వెళుతూ సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని తెలుస్తుంది. ఇక మంత్రుల కుమారులను తీసుకు వెళ్ళడం కోసం స్టేషన్ మీదకు మంత్రుల తాలూకా మనుషులు గుంపులు గుంపులుగా వచ్చి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే అలా వచ్చిన వాళ్ళను మ్యాక్స్ అండ్ టీమ్ ఎలా ఎదుర్కొంది? సెల్‌లో వేసిన ఇద్దరికీ ఏమైంది? క్రైమ్ బ్రాంచ్ సీఐ రూప (వరలక్ష్మి శరత్ కుమార్) నుంచి మ్యాక్స్ అండ్ టీమ్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి ? చివరికి గని ఏం చేశాడు? అనేది సినిమా చూసి
విశ్లేషణ
ఈ మధ్యకాలంలో భిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో చాలావరకు సక్సెస్ కూడా అందుకుంటున్నాయి. ముఖ్యంగా గంటల వ్యవధిలో లేదా ఒక రోజు వ్యవధిలో జరిగిన కథను సినిమాగా మాలుస్తున్న తీరు అయితే ఆకట్టుకుంటుంది. అలాంటి నేపథ్యంలో వచ్చిన కార్తీ ఖైదీ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాదాపుగా అలాంటి సిమిలర్ సబ్జెక్టుగానే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఖైదీ సినిమా వచ్చేప్పటికి అలాంటి సబ్జెక్టులతో కూడా హిట్ కొట్టవచ్చు అని ఐడియా లేదు. కానీ ఈ సినిమాతో ఆ విషయం ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఒకరకంగా ఈ మధ్యకాలంలో జైలర్ విక్రమ్ అంటూ హీరోల హీరో ఇజంతో ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు నడిపిస్తున్న తీరును కూడా ఈ సినిమా కోసం అడాప్ట్ చేసుకున్నాడు డైరెక్టర్. ఆ రెండిటిని కలుపుతూ దర్శకుడు విజయ్ కార్తికేయ యాక్షన్ బేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను ప్రేక్షకులకు అందించారు. హీరో సందర్భం లేకుండా పదుల సంఖ్యలో రౌడీలను కుమ్మేస్తుంటే చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ అదే సరైన సెటప్ కుదిరి హీరో ఎలివేషన్లతో పాటు యాక్షన్ సీక్వెన్స్ సెట్ అయితే మాస్ ఆడియన్స్ కచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవుతారు ఆ కనెక్షన్ ఏర్పరిచేందుకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులకు అవసరమైన సెటప్ సరిగ్గా సెట్ అయింది. ఈ సినిమా మొదలైన కొద్దిసేపటికి సినిమాపై ‘ఖైదీ’ ప్రభావం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఈ కథలో యాక్షన్ సీన్స్ వచ్చిన ప్రతిసారీ హై వస్తుంది కానీ కొన్ని సీన్స్ వచ్చినప్పుడు ఇదేంట్రా అనిపిస్తుంది. అయితే ముందుగానే మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయడం, ఆ తర్వాత ముగింపు ఇవ్వడంలో ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించి ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేది. కథ, కథనాల్లో కొత్త దనం ఆశిస్తే ఈ సినిమా నిరాశపరుస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వచ్చేసరికి కిచ్చా సుదీప్ కి ఇది కేక్ వాక్ లాంటి క్యారెక్టర్ ఇది. ఆయన ఈజ్ వల్ల ఈ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన మ్యానరిజం కూడా బాగా ఉపయోగపడింది. సునీల్ ఈమధ్య బాగా చేస్తున్నట్టు మరోసారి ఇక సీరియస్ డాన్ గా ఆకట్టుకున్నాడు. పోలీస్ పాత్రలో వరలక్ష్మి స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నా ఎందుకో ఆమెకు సరిపడా పాత్ర కాదు అనిపించింది. కథలో కీలకమైన క్యారెక్టర్ చేసిన తమిళ నటుడు ఇళవరసు నటన ఆకట్టుకుంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వచ్చేసరికి ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి ప్రధాన మైన అసెట్. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. యాక్షన్ బ్లాక్స్ డిజైన్ బాగుంది. కథ కథనం రొటీన్ అయినా యాక్షన్ బ్లాక్స్ తో పాటు సుదీప్ హీరో ఇజం సినిమాకి ప్రధానమైన ఆసెట్.
ఫైనల్లీ
మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చెసే ‘మ్యాక్స్’. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా అయినా యాక్షన్ లవర్స్ కు ‘మ్యాక్స్’ నచ్చుతుంది.