Jana Nayakudu Review: ‘జననాయకుడు’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Vijay, Pooja Hegde, Mamitha Baiju, Bobby Deol and Others
- DIRECTOR: H Vinoth
- MUSIC: Anirudh
- PRODUCER: KVN
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చిన ‘జననాయగన్’, తెలుగులో ‘జననాయకుడు’ పేరుతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, సెన్సార్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈరోజు అనూహ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారం, విజయ్ చివరి సినిమా అనే ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో అని తెలుగు ప్రేక్షకులలో సైతం ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
జననాయకుడు కథ:
దళపతి వెట్రి కొండన్ (దళపతి విజయ్), తాను ప్రేమగా పెంచుకుంటున్న విజ్జు (మమతా బైజు) ప్రాణంగా బతుకుతూ ఉంటాడు. అయితే ఒకరోజు అనూహ్యంగా విజ్జు రాష్ట్ర సీఎం చేతికి ఒక ఫైల్ ఇచ్చి, హిమ్లర్ (బాబీ డియోల్) గ్యాంగ్ కి టార్గెట్‌గా మారుతుంది. ఆమెను చంపడానికి సైతం ఆ గ్యాంగ్ సిద్ధమైన క్రమంలో, దళపతి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అయితే అసలు ఆ గ్యాంగ్ విజ్జు వెనుక ఎందుకు పడింది? అసలు దళపతి ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? తన సొంత కూతురు కాకపోయినా అంతకు మించిన ప్రేమతో ఎందుకు విజ్జుని పెంచుకుంటూ ఉంటాడు? ఇందులో కయల్ (పూజా హెగ్డే) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ సినిమాకి రీమేక్ అని దాదాపుగా ప్రమోషన్స్‌లో బయటకు వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి రీమేక్ అనేది ఎలా చేశారు, విజయ్‌కి ఈ సినిమా ఎందుకంత నచ్చింది అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకులలో ఏర్పడింది. అయితే సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి నుంచి సినిమా పూర్తిగా ‘భగవంత్ కేసరి’ రీమేకే అనే ఫీలింగ్ వచ్చింది. దాదాపుగా ‘గర్ల్ ఎంపవర్మెంట్’ అనే లైన్ పూర్తిగా అడాప్ట్ చేసుకున్న దర్శకుడు హెచ్. వినోత్, దాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.
అయితే ఎక్కడా ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ఫీలింగ్ తమిళ ఆడియన్స్‌కి కలగకుండా విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, ఒక పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ కూడా రాసుకున్నాడు. అయితే దాన్ని పూర్తిస్థాయిలో తెరమీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం తడబడ్డాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాలో కథ చాలా సింపుల్‌గా, ‘కట్టే కొట్టే తెచ్చే’ అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ దాన్ని పూర్తిస్థాయిలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ రాసుకుని ప్రేక్షకులను ఎంగేజ్ చేద్దామనుకున్నాడు. దానివల్ల సినిమా నిడివి పెరిగిపోవడమే సినిమాకి కాస్త ఇబ్బందికర అంశం.
వాస్తవానికి ‘భగవంత్ కేసరి’ సినిమా చాలా చోట్ల గుర్తొస్తూ ఉంటుంది. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం ఒక ఫుల్ ఫీస్ట్ ఇవ్వడానికి ఈ సినిమా రూపొందించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసమే ఈ సినిమాని ప్లాన్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. రాజకీయ నాయకుల మీద కామెంట్లు, మత రాజకీయాల గురించి ప్రస్తావన… ఇలా విజయ్ పొలిటికల్ క్యాంపైన్ లాగా ఈ సినిమాని రూపొందించారు.
తమిళ ఆడియన్స్‌కి ఇది బానే వర్కౌట్ అవ్వచ్చు. కానీ ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ సినిమాని చూసేసి ఉన్న తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా దాంతో కంపేర్ చేసుకుంటారు కాబట్టి, వాళ్లకి అంతగా కిక్ ఎక్కిన ఫీలింగ్ కలగదు. కానీ విజయ్ ఫ్యాన్స్ అలాగే తమిళనాడు ఆడియన్స్‌కి మాత్రం ఇది ఒక ఫీస్ట్‌లాగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. కథ స్పాన్ ప్రకారం సినిమా కోసం గట్టిగానే పెట్టిన ఖర్చు తెరమీద కనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, దళపతి విజయ్ ఈ సినిమాలో దళపతి పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడు. అతనికి ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు, ఇప్పటికే కొన్ని సినిమాలలో ఇలాంటి తరహా పాత్రలు చేశాడు. ఈ సినిమాలో కూడా తన రోల్‌తో అదరగొట్టాడు. అయితే మమతా బైజు సినిమాకి ప్లస్ అవుతుంది అనుకుంటే, ఎందుకో ఆమె నుంచి ఆశించినంత పెర్ఫార్మెన్స్ అయితే స్క్రీన్ మీద కనిపించని ఫీలింగ్ కలుగుతుంది. పూజా హెగ్డే కూడా కొన్ని సీన్లకే పరిమితమైంది. బాబీ డియోల్ నటన సినిమాకి ప్లస్ పాయింట్, అయితే అతని పాత్రను ఇంకా బలంగా రాసుకొని ఉంటే లేదా ఎడిట్‌లో తీసేసిన సీన్స్ కూడా పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ సినిమాలో మంచి ఎమోషనల్ డెప్త్ చూపించే అవకాశం ఉన్నా, బహుశా నిడివి కారణంగానో మరి ఇంకేమైనా కారణాల కారణంగానో దాన్ని పూర్తిస్థాయిలో తెరమీద ఆవిష్కరించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఆ విషయంలో కూడా సక్సెస్ అయి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమా కథను ‘భగవంత్ కేసరి’ రీమేక్ అని అనకుండా ఇన్స్పిరేషన్ అని ఫీల్ అవ్వడానికి దర్శకుడు వినోత్ పడిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం ఏదో కొత్త కథలాగా డిజైన్ చేసుకున్న తీరు బాగుంది, అయితే దాని ఎగ్జిక్యూషన్ కూడా అలాగే చేసి ఉంటే ఇంకా బాగుండేది. తెలుగు డైలాగ్స్ రాసిన వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గానే స్క్రీన్ మీదకు తమిళ ఫ్లేవర్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇక అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి వెన్నుముక. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమా చూస్తే కచ్చితంగా కిక్ ఇచ్చిన ఫీలింగ్ అయితే రాదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి సినిమా మీద కనిపించింది.
ఓవరాల్‌గా ఈ ‘జననాయకుడు’ .. విజయ్ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ ఫీస్ట్.. భారీ అంచనాలతో వెళ్ళే కామన్ ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవ్వొచ్చు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!