Isakapatnam Web Series Review: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Samuthirakhani, Aishwaryaa rajesh, Sudhakar Komakula, Raja Chembolu, Naresh Agasthya and others
- DIRECTOR: Garry BH
- MUSIC: Pravin Lakkaraju
- PRODUCER: Tamada Media
సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ క్రైమ్ డ్రామా.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ సిరీస్, ఒక పవర్ఫుల్ డాన్ మరియు అతడి కూతురి మధ్య సాగే మైండ్ గేమ్ నేపథ్యంతో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సిరీస్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.
ఇసకపట్నం కథ:
ఈ కథ 1980, 1990ల కాలంలో ‘ఇసకపట్నం’ తీరప్రాంతం, పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. బతుకుదెరువు కోసం భార్యాకూతుళ్లతో కలిసి ఇసకపట్నం పోర్టుకు వస్తాడు నాయుడు (సముద్రఖని). అత్యంత క్రూరమైన మనస్తత్వం ఉన్న నాయుడు.. అక్కడ మత్స్యకారుల పక్షాన నిలిచే లోకల్ లీడర్ చిన్నరావు (రాజీవ్ కనకాల)ను ఊహించని విధంగా హతమారుస్తాడు. ఆ తర్వాత ఒక్కసారిగా పోర్ట్ ఏరియా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని, స్మగ్లింగ్, రౌడీయిజంతో అండర్‌వరల్డ్ డాన్‌గా ఎదుగుతాడు.
Also Read
అయితే, తండ్రి చేసే అక్రమాలు, రౌడీయిజం నాయుడు కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్)కి నచ్చవు. ఆమె ఒక ఎన్జీవో ద్వారా పేదలకు సాయం చేస్తూ తన దారి తాను చూసుకుంటుంది. కాలక్రమేణా వ్యాపార విభేదాల వల్ల నాయుడు అనుచరుడు పోతన, స్థానిక జమీందారు ప్రతాప్ వర్మ (రవి వర్మ)లతో చేతులు కలిపి నాయుడిని దెబ్బకొట్టాలని చూస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల, ఇష్టం లేకపోయినా భారతికి ప్రతాప్ వర్మతో పెళ్లవుతుంది. కానీ, శోభనం రోజే ప్రతాప్ వర్మ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. అసలు అతను ఎలా చనిపోయాడు? నాయుడు అనుచరుడు కోటయ్య (బెనర్జీ) ఎలా చనిపోయాడు? ఈ మొత్తం కథలో పెద్దన్న (నరేష్ అగస్త్య), ఎస్సై(సునీల్) పాత్ర ఏమిటి? అనేదే మిగతా సిరీస్ కథ.
విశ్లేషణ
పోర్ట్ ఏరియా మాఫియా, వలస కూలీలను వాడుకుని స్మగ్లింగ్ చేయించడం వంటి సినిమాలు గతంలో మనం ఎన్నో చూశాం.అయితే వాటికి తండ్రీకూతుళ్ల మధ్య ఉండే వైరాన్ని జోడించి దర్శకుడు ఈ కథను ఆసక్తికరంగానే రాసుకున్నాడు. సిరీస్ ప్రారంభంలో పాత్రల పరిచయాలకి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల మొదటి మూడు ఎపిసోడ్లు కాస్త నెమ్మదిగా సాగుతాయి. అలాగే, ఒక సాధారణ కూలీ అయిన సముద్రఖని అంత పెద్ద డాన్‌గా ఎదిగే ప్రక్రియను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఎందుకో కట్ చేస్తే అన్నట్టుగా మనోడు కూలీ నుంచి డాన్ అయిపోతాడు.
అయితే కథలో కేవలం హీరో ఎవరో చెప్పకుండా హీరోయిన్ పాత్రను రాసుకున్న తీరు బాగుంది. ఇక ఆ పాత్రలే కాకుండా మిగిలిన పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఐశ్వర్య రాజేష్ పాత్రలోని అసలు కోణాన్ని రివీల్ చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. తండ్రిని నేరుగా కాకుండా, మైండ్ గేమ్‌తో దెబ్బకొట్టే సన్నివేశాలు చివరి ఎపిసోడ్స్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే, క్లైమాక్స్ వచ్చే వరకు భారతి క్యారెక్టర్ ను కొంచెం అనుమానాస్పదంగా చూపిస్తూనే ఆమెను ఒక ట్రంప్ కార్డులా వాడుకోవాలని చూసిన తపన వలన ప్రారంభంలో ఆడియన్స్‌కు ఆ ఇంపాక్ట్ కొద్దిగా మిస్ అయినట్లు అనిపిస్తుంది. ముగింపులో వచ్చే ట్విస్ట్‌లు, లేడీ పుష్ప తరహా ఎలివేషన్లు సిరీస్‌కు కొంత వర్కౌట్ అయ్యాయి.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే సముద్రఖని ఎప్పటిలాగే తన మార్క్ నటనతో అదరగొట్టారు. ఒక క్రూరమైన మాఫియా డాన్‌గా, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్లాన్లు వేసే విలన్‌గా ఆయన నటన సిరీస్‌కు పెద్ద అసెట్.
ఐశ్వర్య రాజేష్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో మరోసారి ఒదిగిపోయారు. ప్రారంభంలో సాదాసీదా ఎన్జీవో కార్యకర్తగా కనిపిస్తూనే, కథ మలుపు తిరిగే కొద్దీ తన బాడీ లాంగ్వేజ్‌తో, సైలెంట్ పర్ఫార్మెన్స్తో మైండ్ బ్లాక్ చేశారు. ఆటో డ్రైవర్‌గా నరేష్ అగస్త్య ఎమోషనల్ పాత్రలో మెప్పించగా, భారతి ప్రియుడిగా సుధాకర్ కొమాకుల ఆకట్టుకున్నాడు. పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. రాజీవ్ కనకాల, రవి వర్మ, రాజా చెంబోలు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్, ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా పీరియాడిక్ మాఫియా డ్రామాను బాగానే హ్యాండిల్ చేశారు. అయితే ఎడిటింగ్ విభాగంలో ఆయనే స్వయంగా ఇంకాస్త శ్రద్ధ పెట్టి, మొదటి కొన్ని ఎపిసోడ్లలోని సాగతీతను తగ్గించి ఉంటే కథ మరింత వేగంగా పరిగెత్తేది. నేపథ్య సంగీతం కొన్ని కీలక సీన్లను బాగానే ఎలివేట్ చేసింది. 1980ల కాలం నాటి వైజాగ్/పోర్ట్ వాతావరణాన్ని స్క్రీన్‌పై తీసుకురావడంలో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సిరీస్ స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి. అయితే రొటీన్ కధ అయినా కధనంలో కనుక కొత్తదనంతో రాసుకుని ఉంటే ఈ సిరీస్ ఇంకా బాగా వర్కౌట్ అయి ఉండేది.
ఫైనల్లీ ‘ఇసకపట్నం’ తండ్రీ కూతుళ్ళ క్రైమ్ సాగా
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..