I NoBody Movie Review: ‘ఐ నోబడి’ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు
- DIRECTOR: నిస్సాం బషీర్
- MUSIC: జేక్స్ బిజాయ్
- PRODUCER: ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి
I NoBody Movie Review: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, పార్వతి తిరువోతు హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఐ నోబడి’. సాధారణంగా మలయాళంలో ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి, అదే జానర్లో రూపొందించబడిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో అటు మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఉండడం, అతని మలయాళ సినిమాలకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. స్రవంతి మూవీస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
రాజీవ్ (పృథ్వీరాజ్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఒక పని మీద బ్యాంకుకు వెళ్లిన సమయంలో, ఆ బ్యాంకును దోపిడీ చేసేందుకు వచ్చిన ముగ్గురు దొంగల ముఠా అతనిని బందీగా చేసి తీసుకువెళుతుంది. ఆ తర్వాత అతనిని చంపే క్రమంలో అనుకోకుండా ఆ దొంగలే మరణిస్తారు. ఇక పోలీసులు రాజీవ్‌కి, ఆ ముఠాకి ఏదో సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు మొదలుపెడతారు. ఈ క్రమంలో అతని భార్య (పార్వతి), ఇద్దరు కుమార్తెలు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఆ దొంగిలించిన సొమ్ము రాజీవ్ వద్దే ఉందనే ఉద్దేశంతో అతని బంధువులు, స్నేహితులతో పాటు చుట్టుపక్కల ఉండేవారు సైతం ఆ డబ్బులో తమకు కూడా ఎంతో కొంత ఇవ్వాలని రాజీవ్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే అతని పెద్ద కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. రాజీవ్ పెద్ద కుమార్తెను కిడ్నాప్ చేసింది ఎవరు? రాజీవ్ నిజంగానే దొంగలు దొంగిలించిన సొమ్ము దాచుకున్నాడా? అసలు తనకు బ్యాంక్ అకౌంట్ లేని బ్యాంకుకు రాజీవ్ ఎందుకు వెళ్లాడు? రాష్ట్ర సీఎం ఎంట్రీ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా సినిమాలను ఆదరిస్తారు. ఈ నేపథ్యంలోనే రెండు ప్రతిష్టాత్మక సంస్థలు కలిసి ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చాయి. సినిమా ప్రారంభమే బ్యాంకు దోపిడీ సీన్‌తో ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత రాజీవ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే విషయాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక పెద్ద దోపిడీ సంఘటనలో బాధితుడైన వ్యక్తి బాధితుడు కాకపోవచ్చు అని పోలీసులు భావించడం, పోలీసుల అనుమానాలు మీడియాలో రావడంతో వాటిని బేస్ చేసుకుని ప్రజలు కూడా అతని వద్ద నిజంగానే డబ్బు ఉందని భావించడం, ఆ డబ్బు కోసం అతని వెంట పడడం నేటి సమాజానికి అద్దం పట్టేలా ఉంది. ఈ విషయంలో దర్శకుడిని అభినందించకుండా ఉండలేము. ఇక ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అయితే, ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎందుకో వేగం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అక్కడక్కడే తిరుగుతూ ఉండడం, అసలు చివరికి ఏం జరగబోతోంది, అసలు దేనికోసం ఈ పోరాటం అనే విషయాల మీద స్పష్టమైన క్లారిటీ లేనట్టుగా దర్శకుడి స్క్రీన్ ప్లే సాగుతుంది. కానీ, క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. లైన్ చిన్నదైనా, దానిని అభినందించేలా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ రోజుల్లో ప్రధాన వార్తగా ఉన్న విషయం రేపటికి ఉంటుందో ఉండదో తెలియదు, అదే విషయాన్ని చాలా సెటైరికల్‌గా దర్శకుడు ఒక సినిమా రూపంలో రాసుకొచ్చాడు. అలాగే సోషల్ మీడియా ప్రభావం, అసలు ఏమీ తెలియని వాళ్లు కూడా ఏదో పక్కనే ఉండి చూసినట్టుగా వీడియోల ముందు కూర్చుని కథలు అల్లుతున్న విధానాన్ని సెటైరికల్‌గా చూపించిన విధానం బాగుంది. అయితే, ఒక భాషలోని సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు, కనీసం ఆ టైటిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యే అంశం. గూగుల్ ట్రాన్స్లేషన్తో పెట్టిన కొన్ని టైటిల్స్‌తో పాటు ‘ఐ నోబడి’ (I, Nobody) అనేదాన్ని ‘ఐ ఎవరూ కాదు’ అంటూ తర్జుమా చేసిన విధానం తెలుగు భాషాభిమానులను బాధపెడుతుంది.
నటీనటుల నటన & సాంకేతిక వర్గం:
ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పృథ్వీరాజ్ నటన చాలా బాగుంది. భార్యతో సఖ్యత లేకుండా, సమాజం నుంచి వచ్చే తూట్లాంటి చూపులను భరించే ఒక వ్యక్తిగా అతని నటన కచ్చితంగా అభినందనీయం. ఇక భార్య పాత్రలో నటించిన పార్వతి ఆ పాత్రలో జీవించేసింది. ‘అనస్’ అనే పాత్రలో నటించిన కానిస్టేబుల్‌తో పాటు పృథ్వీ, పార్వతి దంపతుల కుమార్తెలుగా నటించిన ఇద్దరు అమ్మాయిలు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్న కుమార్తె నటన తెలుగు ప్రేక్షకులకు నవ్వు తెప్పించడమే కాకుండా, ఆమెను చూసినప్పుడల్లా ఒక మంచి ఫీలింగ్ కలిగేలా చేసింది.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. కథగా చెప్పుకుంటే ఇది చాలా సింపుల్ లైన్, కానీ దాన్ని తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు చాలా కష్టపడ్డాడు. కథనం (స్క్రీన్ ప్లే) విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను జేక్స్ బిజాయ్ ఒక రేంజ్లో ఎలివేట్ చేశారు. ఆయన తప్ప ఇంకా ఎవరున్నా ఈ సినిమాకి అంతలా ఫీల్ వచ్చేది కాదేమో. సినిమాలో పాటలు పెద్దగా లేవు, కానీ యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయాయి; ముఖ్యంగా లిఫ్ట్ సీన్ అయితే టాప్ లెవెల్. నిడివిని ఇంకాస్త తగ్గించే అవకాశం ఉంది, ఆ విషయం మీద ఎడిటర్ ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది.
ముగింపు:
ఓవరాల్‌గా, ‘ఐ నోబడి’ ఒక డీసెంట్ హీస్ట్ థ్రిల్లర్ మూవీ.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!