Husharu Pittalu Review: హుషార్ పిట్టలు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Ansh, Vasai Ganeshan, Prani Reddy, Govardhan and others
- DIRECTOR: Bhikshu
- MUSIC: charan arjun
- PRODUCER: Venkat Yadav
స్టార్ క్యాస్ట్ లేదు స్టార్ డైరెక్టర్ కాదు అయినా కంటెంట్ తో కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాలలో హుషారు పిట్టలు కూడా ఒకటి. పెద్దగా తెలిసిన ముఖాలు లేకుండానే ఈ సినిమా రూపొందించారు మేకర్స్. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో సినిమాకి కొంత ఫోకస్ దొరికింది. అన్ష్, వాసవి గణేషన్ జంటగా పరిచయమవుతూ దర్శకుడు బిక్షు తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ నిర్మించగా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉన్నా, మీడియా కోసం కొంత ముందుగానే ప్రీమియర్స్ తో సినిమాని ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
హుషార్ పిట్టలు కథ :
Also Read
మాసినపాలెం రవి (అన్ష్) గ్రామంలో టెన్త్ క్లాస్ పూర్తి చేసి స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఒక ఇంటెలిజెంట్ అండ్ ఇనోసెంట్ కుర్రాడు. అదే ఊరికి చెందిన చిట్టి (వాసవి గణేషన్) అప్పుడే టీనేజ్ లోకి అడుగుపెడుతుంది. రవిపై అమితమైన ఇష్టాన్ని పెంచుకుంటుంది. అంతవరకు చదువే లోకంగా బ్రతికిన రవిని… బాలన్నతో పాటు కొందరు స్థానిక కుర్రాళ్ళు అడల్ట్ వీడియోలు చూపించి, అమ్మాయిలతో ప్రేమాయణం నడపాలని బ్రెయిన్ వాష్ చేస్తారు. దాంతో రవి కూడా చిట్టి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో తెలిసీ తెలియని వయసు, శారీరక ఆకర్షణతో ఇద్దరూ ఇంట్లో వాళ్లకు తెలియకుండా హద్దులు దాటి శృంగారంలో మునిగిపోతారు. ఈ విషయం చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి) కనిపెట్టి హెచ్చరించినా వారు పట్టించుకోరు. చిట్టిని ప్రాణంగా చూసుకునే ఆమె తండ్రి (గోవర్ధన్) మరియు రవి తల్లిదండ్రులకు ఈ నిజం తెలిసినప్పుడు వారి పరిస్థితి ఏమైంది? ఈ చిన్న వయసు తప్పుల వల్ల ఆ ఇద్దరు టీనేజర్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? చివరికి వీరి కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ
గతంలో వచ్చిన ‘టెన్త్ క్లాస్’, ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ తరహాలోనే—మొదట బోల్డ్ ఎంటర్టైన్మెంట్ నడిపి, చివర్లో కళ్ళు తెరిపించే సందేశాన్ని ఇచ్చే ఫార్మాట్‌ను దర్శకుడు బిక్షు ఎంచుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా దాదాపుగా రవి, చిట్టి పాత్రల పరిచయం, టీనేజ్ రొమాన్స్, ఫోన్లలో ముచ్చట్లు, బోల్డ్ సన్నివేశాలతో పూర్తిగా అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో నవ్వులు పూయిస్తూ సాగిపోతుంది. ఇంటర్వెల్ సమయానికి కాస్త ఉత్కంఠ రేకెత్తించి సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతారు. అయితే అసలు కథంతా సెకండాఫ్‌లోనే నడుస్తుంది. తప్పులు బయటపడటం, కుటుంబాల్లో మొదలయ్యే సంఘర్షణ, భావోద్వేగ సన్నివేశాలు సినిమాను బలంగా నిలబెట్టాయి. ప్రీ-క్లైమాక్స్ చాలా కొత్తగా రాసుకోగా, క్లైమాక్స్ మాత్రం కొంత రొటీన్‌గా ముగుస్తుంది. ముఖ్యంగా పిల్లల పక్కన పెద్దలు ప్రవర్తించే విధానం, మొబైల్ ఫోన్లు-చెడు సావాసాల దుష్ప్రభావం, హార్మోన్ల మార్పుల వల్ల యుక్తవయసులో జరిగే పొరపాట్లు ఎంతటి పరిణామాలకు దారితీస్తాయనే విషయాన్ని చాలా ప్రాక్టికల్ గా, కన్విన్సింగ్ గా చూపించారు. అయితే ఇలాంటి తరహ సినిమాలు ఈమధ్యలో రాలేదు కానీ ఒకప్పుడు ఇలాంటి సినిమాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కానీ ఈమధ్యలో కన్విన్సింగ్ గా ఇలాంటి కంటెంట్ తో మాత్రం రాలేదు. ఒకరకంగా ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం కొన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టుకుని సెకండ్ హాఫ్ పేరెంట్స్ కి మెసేజ్ అంటూ బ్లెండ్ చేసిన విధానం బాగుంది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే అన్ష్ & వాసవి గణేషన్: డెబ్యూ యాక్టర్స్ అయినప్పటికీ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. టీనేజ్ అమాయకత్వాన్ని, రొమాంటిక్ సన్నివేశాలను పండించడమే కాకుండా, ఎమోషనల్ సీన్లలోనూ మెచ్యూర్డ్ నటనతో మెప్పించారు. గోవర్ధన్ కూతురిని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో అత్యంత భావోద్వేగభరితమైన నటన కనబరిచి కంటతడి పెట్టించారు. ప్రణీ రెడ్డి, సునీత మనోహర్, రమేష్, అంజి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు సహజంగా నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఈ చిత్రానికి పాటలు ప్రాణంగా నిలిచాయి. సందర్భానుసారంగా వచ్చిన లిరిక్స్, బాణీలు రిపీట్ మోడ్‌లో వినేలా ఉండటంతో పాటు కథను ముందుకు నడిపించాయి. నేపథ్య సంగీతం (BGM) కూడా ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. పల్లెటూరి వాతావరణాన్ని, సహజమైన లొకేషన్లను కలర్ఫుల్గా, రిచ్‌గా తెరపై ఆవిష్కరించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు పాత పాయింట్‌నే నేటి తరానికి సరిపోయేలా కొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాడు. అయితే ఎడిటింగ్ విభాగం కాస్త శ్రద్ధ వహించి కొన్ని మితిమీరిన అడల్ట్ సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే మరింత క్లీన్ ఎక్స్పీరియన్స్ దక్కేది.
ఫైనల్‌గా డబుల్ మీనింగ్ కామెడీని తట్టుకోగలిగితే నేటి తరం యువతతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన మూవీ ‘హుషార్ పిట్టలు’.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!