He-Man and the Masters of the Universe Review : హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Nicholas Galitzine, Camila Mendes, Jared Leto, Alison Brie, James Purefoy, Jóhannes Haukur Jóhannesson, Charlotte Riley, Kristen Wiig, Morena Baccarin, and Idris Elba
- DIRECTOR: Travis Knight
- MUSIC: Daniel Pemberton
- PRODUCER: Todd Black, Jason Blumenthal, Robbie Brenner, DeVon Franklin
80స్, 90స్ కిడ్స్‌కు అమితంగా నచ్చిన క్లాసిక్ కార్టూన్ క్యారెక్టర్ ‘హీ-మ్యాన్’ (He-Man). ‘ఐ హావ్ ది పవర్’ అంటూ చేతిలో కత్తి పట్టుకుని అతను చేసే సాహసాలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. ఇప్పుడు అదే అడ్వెంచరస్ మ్యాజిక్‌ను వెండితెరపైకి తీసుకొస్తూ హాలీవుడ్లో తెరకెక్కిన సరికొత్త లైవ్ యాక్షన్ ఫాంటసీ చిత్రమే ఈ ‘ హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో నికోలస్ గాలిట్జైన్, జారెడ్ లెటో, ఇద్రిస్ ఎల్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా మరింత చేరువయ్యేలా… దీని డబ్బింగ్ వెర్షన్ కోసం టాలీవుడ్ యాక్టర్స్ నిఖిల్ సిద్ధార్థ్, రావు రమేష్, ఆదిత్య మీనన్‌లు డబ్బింగ్ చెప్పడం విశేషం. మరి ఈ సినిమా ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.
మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ కథ:
ఎటర్నియా గ్రహానికి చెందిన యువరాజు ప్రిన్స్ ఆడమ్ (నికోలస్ గాలిట్జైన్). కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు పదేళ్ల పాటు భూమిపై అనామకుడిగా గడపాల్సి వస్తుంది. భూమిపై ఉన్నప్పుడు తన సొంత గ్రహం, అక్కడ ఉండే మాట్లాడే పులులు, ఎగిరే నౌకల గురించి అందరికీ చెబుతుంటాడు, కానీ ఎవరూ నమ్మరు. పదేళ్ల తర్వాత ఆడమ్ అనూహ్యంగా తిరిగి తన సొంత రాజ్యమైన ఎటర్నియాకు చేరుకుంటాడు. అయితే అప్పటికే ఆ సామ్రాజ్యం క్రూరడైన విలన్ స్కెలిటార్ (జారెడ్ లెటో) చేతుల్లో చిక్కి వినాశనానికి గురై ఉంటుంది. తన చిన్ననాటి స్నేహితురాలు తీలా (కామిలా మెండిస్), డంకన్ (ఇద్రిస్ ఎల్బా)ల సహాయంతో ఆడమ్ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? తనలో దాగున్న అసలైన శక్తులను తెలుసుకుని ‘హీ-మ్యాన్’గా ఎలా రూపాంతరం చెందాడు? చివరకు స్కెలిటార్ను ఎలా అంతమొందించాడు? అనేదే ఈ సినిమా కథ.
Also Read
విశ్లేషణ:
ఇటీవలి కాలంలో వచ్చే చాలా ఫాంటసీ లేదా సూపర్ హీరో సినిమాలు ‘మార్వెల్’ స్టైల్ ఐరానిక్ కామెడీ, సెల్ఫ్-రెఫరెన్షియల్ జోకులతో నిండిపోతున్నాయి. “మనం చేసేది చాలా విడ్డూరంగా ఉంది కదూ” అంటూ పాత్రలే స్వయంగా కథను వెక్కిరించుకునే ట్రెండ్ నడుస్తోంది. కానీ ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఆ ఫార్ములాకు భిన్నంగా వెళ్ళింది. ఈ సినిమాలోని అతిపెద్ద ప్లస్ పాయింట్… దీని ‘సిన్సియారిటీ’. కథలోని ఫాంటసీని, ఆ లోకంలోని వింతలను దర్శకుడు ఎక్కడా కించపరచకుండా, చాలా నిజాయితీగా చూపించారు.
సినిమాలో కాస్త అమాయకత్వం, చైల్డ్లైష్ వండర్లు కనిపిస్తాయి. సినిమా టోన్‌కు ఒక ఉదాహరణ చెప్పాలంటే… పాడుబడిన రాజ్యాన్ని చూసి ఆడమ్ “స్కెలిటార్ ఎందుకు ఇలా చేశాడు?” అని అడిగితే, తీలా “మొహం మీదే అస్థిపంజరం ఉన్నవాడి నుండి ఇంకేం ఆశిస్తావు?” అంటుంది. సినిమా అంతా ఇలానే సాగుతుంది. నేటి తరం సినిమాలు ఎక్కువగా ‘గ్రిమ్ డార్క్’నేపథ్యాల్లో సాగుతుంటే, ఈ సినిమా బ్రైట్ కలర్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌తో కళ్లకు విందులా అనిపిస్తుంది.
అయితే, కథలో కాస్త లోతు లోపించింది. ఆడమ్ భూమిపై ఎలా పెరిగాడు అనే అంశాన్ని, అలాగే ఎటర్నియా పురాణాలు, గ్రేస్కల్ శక్తుల మూలాలను ఇంకాస్త వివరంగా చూపించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ, ఒక కమర్షియల్ ఫాంటసీ ఎంటర్టైనర్గా తెలుగు ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
నటీనటుల పనితీరు:
ప్రిన్స్ ఆడమ్‌గా అమాయకత్వాన్ని, హీ-మ్యాన్‌గా మారినప్పుడు పవర్ఫుల్ ఎనర్జీని నికోలస్ గాలిట్జైన్ బాగా పండించాడు. అతని నటనలోని సిన్సియారిటీ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు అసలైన హైలైట్ జారెడ్ లెటోనే. ఆయన కేవలం ఒక విలన్ లాగా కాకుండా, పాతకాలపు ‘రౌడీ’ తరహాలో నవ్విస్తూనే భయపెట్టే పాత్రలో జీవించేశారు. మొహంపై స్కెలిటన్ మాస్క్ ఉన్నప్పటికీ, తన బాడీ లాంగ్వేజ్‌తో అద్భుతమైన హావభావాలు పలికించారు. తీలా పాత్రలో కామిలా మెండిస్ యాక్షన్ సీన్స్‌లోనూ, ఆడమ్‌కు సపోర్ట్‌గా నిలిచే సీన్స్‌లోనూ మెప్పించింది. ఇద్రిస్ ఎల్బా తన పరిధి మేర చక్కగా నటించారు.
ఇక ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్. హీరో నికోలస్ గాలిట్జైన్ పాత్రకు మన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన వాయిస్ అందించారు. ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాల్లో నిఖిల్ బేస్ వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ కూడా హీ-మ్యాన్ ఎలివేషన్ సీన్స్‌లో నిఖిల్ వాయిస్ బేస్ సినిమా రేంజ్‌ను పెంచింది. విలన్ స్కెలిటార్ పాత్రకు ఆదిత్య మీనన్ డబ్బింగ్ చెప్పారు. ఆ పాత్రలోని విలనిజం, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఆయన తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి, భయపెడతాయి. అలాగే హీరో మెంటార్, ఆర్మ్స్ మాస్టర్ డంకన్ పాత్రకు వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. ఆయన వాయిస్ ఆ పాత్రకు నిండుదనాన్ని ఇచ్చింది. ఈ టాలీవుడ్ స్టార్స్ వాయిస్ వల్ల ఇదొక హాలీవుడ్ సినిమా అనే ఫీలింగ్ పోయి, మనకు బాగా కనెక్ట్ అవుతుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయంకి వస్తే ట్రావిస్ నైట్ మేకింగ్ స్టైల్ అభినందనీయం. 80ల నాటి నాస్టాల్జియాను చెడగొట్టకుండా, ఆధునిక గ్రాఫిక్స్ జోడించి తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ మరియు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎటర్నియా గ్రహాన్ని చూపించిన రంగుల ప్రపంచం, క్యారెక్టర్ డిజైన్స్ ఫాంటసీ లవర్స్‌ను కట్టిపడేస్తాయి. హీ-మ్యాన్ అలానే స్కెలిటార్ మధ్య వచ్చే స్లో-మోషన్ ఫైట్ సీన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్‌ను బాగా ఎలివేట్ చేసింది.
ఫైనల్లీ: ఈ ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ కేవలం పిల్లల కోసం మాత్రమే!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!