Kotha Malupu Movie Review: ‘కొత్త మలుపు’ మూవీ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: ఆకాష్, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, మహేందర్, ఐశ్వర్య తదితరులు
- DIRECTOR: శివ కేసనకుర్తి
- MUSIC: యశ్వంత్ నాగ్
- PRODUCER: తాటి బాలకృష్ణ
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన రెండో సినిమా ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, కోనసీమ అందాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో, చిత్ర యూనిట్ చెప్పినట్టుగానే మనసులను తాకేలా ఉందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కొత్త మలుపు కథ
హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసే జాలీ టైప్ కుర్రాడు కమల్ (ఆకాష్). ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ కోసం తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే పల్లెటూరి అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అయితే, ఒక రాత్రి కమల్ అనుకోకుండా ఒక పెద్ద అవమానకరమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. ఆ సమయంలో ముఖం తెలియని ఒక యువతి అతడిని కాపాడి సురక్షితంగా బయటపడేస్తుంది. తనను ఆ కష్టం నుంచి గట్టెక్కించిన ఆ అమ్మాయి ఎవరనే అన్వేషణ మొదలుపెడతాడు కమల్. ఈ ప్రయాణంలో వరలక్ష్మి అతడికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రాసెస్ లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. తీరా తనను కాపాడిన అమ్మాయి మరెవరో కాదు, వరలక్ష్మినే అని కమల్‌కు తెలిసే సమయానికి.. ఆమె వేరే ఒక యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటో కమల్ కంట పడుతుంది. దీంతో వారి ప్రేమలో అనుమానాలు, అపార్థాలు మొదలవుతాయి. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న యువకుడు ఎవరు? వరలక్ష్మి గతం ఏంటి? ఈ అపార్థాలను దాటుకుని కమల్-వరలక్ష్మిల ప్రేమ ఎలా గెలిచింది? అనేదే మిగతా కథ.
Also Read
మూవీ విశ్లేషణ
ప్రేమలో నమ్మకం ఎంత ముఖ్యం, అనుమానం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే పాయింట్‌ను దర్శకుడు శివ కేసనకుర్తి చాలా ఆసక్తికరంగా ఆవిష్కరించారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం సినిమాకు చాలా ప్లస్ అనే చెప్పాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరి వాతావరణం, పెళ్లి సందడి, గోదావరి మార్క్ మార్కు కామెడీతో చాలా ఫ్రెష్‌గా, సరదాగా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికీ ఒక పాస్ట్ ఉంటుందని, కేవలం పాస్ట్ మాత్రమే చూసి ఒక వ్యక్తి ప్రజెంట్ జడ్జ్ చేయకూడదనే సందేశాన్ని క్లైమాక్స్‌లో చాలా బలంగా చెప్పారు. నేటి తరం యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ పాయింట్‌ను డైరెక్టర్ డీల్ చేసిన విధానం బాగుంది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే కమల్ పాత్రలో ఆకాష్ చాలా ఈజ్‌తో నటించాడు. మొదటి భాగంలో అల్లరి కుర్రాడిగా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆకాష్, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లో మంచి పరిణతి కనబరిచాడు. లుక్స్ పరంగా, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. వరలక్ష్మి పాత్రలో భైరవి నటన సినిమాకు మెయిన్ పిల్లర్. పల్లెటూరి అమ్మాయికి ఉండే అమాయకత్వాన్ని, ప్రేమలోని పెయిన్‌ను చాలా సహజంగా పండించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్లో ఆమె యాక్టింగ్ హైలైట్‌గా నిలుస్తుంది. గోదావరి యాసలో సాగే ఈ ఇద్దరి సీనియర్ నటుల కామెడీ ట్రాక్ థియేటర్లలో మంచి నవ్వులు పూయిస్తుంది. సినిమాకు వినోదాన్ని పంచడంలో వీరిద్దరూ సక్సెస్ అయ్యారు. ఇక గోపి పాత్రలో సిద్ధు కీలకమైన నటనను కనబరిచాడు. కథను మలుపు తిప్పే ఈ క్యారెక్టర్‌కు తను పూర్తి న్యాయం చేశాడు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే సుమంత్ కచర్ల, జవహర్ రెడ్డిల కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. కోనసీమ పచ్చదనాన్ని, పల్లెటూరి అందాలను విజువల్‌గా చాలా రిచ్‌గా, కంటికి ఆహ్లాదకరంగా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. యశ్వంత్ నాగ్ అందించిన పాటలు సిట్యుయేషనల్‌గా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో మరింత ఎలివేట్ చేశారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.
ఫైనల్లీ: ‘కొత్త మలుపు’ యూత్ ను ఆకట్టుకుంటుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..