Don’t Trouble The Trouble Movie Review: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Fahadh Faasil, Ssara Palekar, Mahesh Manjrekar, Saurabh Sachdeva
- DIRECTOR: Sashank Yeleti
- MUSIC: Kala Bhairava
- PRODUCER: SS Karthikeya
ఫహద్ ఫాజిల్ హీరోగా, రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాణంలో శశాంక్ ఏలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన మూవీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఆసక్తికరమైన కథాంశం అంటూ రాజమౌళి, ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సినిమాని ప్రమోట్ చేయడంతో, సినిమా మీద ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఫహద్ ఫాజిల్ లాంటి నటుడు ఎంచుకునే సబ్జెక్ట్స్ ఆసక్తికరంగా ఉంటాయన్న నమ్మకంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమాని ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ తో రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కథ:
సూరి (ఫహద్ ఫాజిల్) ఓ అనాథ. మెజీషియన్ అయిన స్నేహితుడు వెంకటేష్ కాకుమానుతో కలిసి ఉండే సూరి, ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతోనే బతుకుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా పాతబస్తీలో ఓ గ్యాంగ్ స్టర్ అస్లాం (మహేష్ మంజ్రేకర్)తో ఒక చిన్న గొడవ అవుతుంది. రెండు రోజుల్లో పాతిక లక్షలు కడితేనే బతుకుతావని, లేదంటే చంపేస్తానని అస్లాం వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఎవరినైనా కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో దివ్య (సారా పాలేకర్)ను అనూహ్యంగా కిడ్నాప్ చేస్తాడు సూరి. అయితే దివ్యను కిడ్నాప్ చేశాక అతని జీవితం తలకిందులు అవుతుంది. అసలు దివ్యనే ఎందుకు సూరి కిడ్నాప్ చేశాడు? దివ్యని కిడ్నాప్ చేసిన తర్వాత సూరి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? చివరికి ఏం జరిగింది? దివ్యకు ఉన్న స్పెషల్ మ్యాజికల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అతను ఎలాంటివాడు, డబ్బు కోసం ఎందుకు ఎంతకైనా దిగజారుతాడు అంటూ అతని క్యారెక్టర్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తరువాత ఒక చిన్నారి పాప, ఆ పాప తన తల్లిదండ్రులను మాయం చేశానని భావిస్తూ వారిని వెతికి తీసుకురమ్మని ఫహద్ వెంట పడుతూ ఉన్న విధానం ఆకట్టుకునేలా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ మొదలుపెట్టాక కాన్ఫ్లిక్ట్ పాయింట్ టచ్ చేయడానికి చాలా సమయం పట్టింది. ఇంటర్వెల్ వరకు ఆ విషయాన్ని నానుస్తూ నానుస్తూ తీసుకువెళ్లాడు. అంతసేపు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ తీసుకురాకుండా కథ నడిపించడానికి ఎంచుకున్న కొన్ని ప్లాట్స్ పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇక అసలు విషయం రివీల్ అయ్యాక అయినా కథను పరుగులు పెట్టించాడా అంటే అదీ లేదు. మళ్లీ అక్కడక్కడే కొన్ని సబ్ ప్లాట్స్ రాసుకుని ప్రేక్షకులకు నవ్వు తెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఎప్పుడైతే కథ ప్రీ క్లైమాక్స్ కి ఎంటర్ అవుతుందో, అప్పటినుంచి కాస్త ఎమోషనల్ గా రాసుకున్నాడు. అయితే ఆ ఎమోషన్స్ ని తెరమీదకు తీసుకువచ్చే విషయంలో పూర్తిస్థాయిలో దర్శకుడు తడబడ్డాడని చెప్పాలి. ఈ సినిమా విషయంలో ఎన్నో లాజిక్ లెస్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఎమోషన్ పూర్తిస్థాయిలో వర్కౌట్ అయి ఉంటే ఆ లాజిక్ లెస్ మూమెంట్స్ ని ప్రేక్షకులు పట్టించుకునే స్కోప్ ఉండదు. కానీ ఆ ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడంతో, ఇదేంటి రాజమౌళి సమర్పణలో రాజమౌళి కొడుకు నిర్మించే సినిమాని ఇంత లాజిక్ లెస్ గా వదిలేస్తారా అనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల పనితీరు:
ఇక నటీనటుల విషయానికి వస్తే, ఫహద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది! సూరి పాత్రలో అతను ఇరగదీశాడు. ఇక చిన్నారి దివ్య పాత్రలో నటించిన సారా పాలేకర్ కూడా అత్యద్భుతంగా నటించింది. వెంకటేష్ కాకుమాను, సౌరభ్ సచ్ దేవా, సుబ్బరాజు, మహేష్ మంజ్రేకర్ వంటి వాళ్లు కూడా తమ అనుభవంతో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాకి చాలా వరకు ప్రాణం పోసింది కాలభైరవ మ్యూజిక్. పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాలోని కొన్ని డైలాగ్స్ అయితే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకా స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే, కత్తెరకు పని చెప్పి ఉంటే ఆ రిజల్ట్ వేరేలా ఉండి ఉండవచ్చు.
ఇక ఫైనల్ గా, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’… ట్రబుల్ చేయదు కానీ…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?