Dhandha Review: ధంధా రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Dora Sai Teja, Akshara Nalla, Nithin Prasanna, Kiran Kumar Kamtam, Suri K Chaplin, Vikram Devaki
- DIRECTOR: Aditya Devulapally
- MUSIC: Rishi M
- PRODUCER: Chai Shots
వర్టికల్ (ఫోన్) సీరియస్లను చాలామంది ఇప్పటివరకు టైమ్ పాస్ వీడియోలు లేదా రీల్స్ లాగే చూశారు. కానీ, ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తూ వచ్చిన సిరీసే ‘ధంధా’. కేవలం 64 నిమిషాల వ్యవధిలో, 26 చిన్న చిన్న ఎపిసోడ్లుగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో యూట్యూబ్ స్టార్ దొర సాయి తేజ కీలకపాత్రలో నటించగా మలయాళం నటుడు నితిన్ ప్రసన్న మరో కీలకపాత్రలో నటించారు. ముందు నుంచి గట్టిగా ప్రమోషన్స్ చేస్తూ రావడంతో సిరీస్ మీద ఆసక్తి ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది..సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం
ధంధా కథ ఏంటంటే?
అరవింద్ (డోరా సాయి తేజ) ఒక 22 ఏళ్ల బీటెక్ స్టూడెంట్. చాలా తెలివైనోడు, కానీ డబ్బు, పవర్ అంటే విపరీతమైన మోజు. క్లాస్రూమ్ కన్నా హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ ప్రపంచంలో తన తెలివితేటలకు ఎక్కువ విలువ ఉందని గుర్తిస్తాడు. చిన్న స్టాక్ మార్కెట్ స్కామ్‌తో మొదలైన అరవింద్ ప్రయాణం… ఫిషింగ్ స్మామ్‌లు, కాల్ సెంటర్లు, వసూళ్లు, చివరికి గ్యాంగ్‌స్టర్ రాజకీయాల వరకు ఎలా వెళ్ళింది? తన తెలివితేటలతో సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఎలా శాసించాడు? అనేదే ఈ సిరీస్ కథ.
Also Read
సిరీస్ విశ్లేషణ
నిజానికి ఒకప్పుడు పెద్దపెద్ద సినిమాలను ఎంత నిడివి ఉన్నా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. చెప్పాలనుకున్న కంటెంట్ ని రీల్ ఫార్మాట్లో వీలైనంత తక్కువ సమయంలో చెప్పిన వాళ్ళ కంటెంట్ మాత్రమే ఇప్పుడు నడుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపుగా చాలా వర్టికల్ ఫార్మాట్ యాప్స్ వచ్చాయి. తెలుగులో అయితే పూర్తిస్థాయిలో అలాంటి ఒక ఫార్మాట్ ని తీసుకొచ్చింది చాయ్ షాట్స్ యాప్. ఈ యాప్ లోనే ఏకంగా 50 లక్షలు బడ్జెట్ తో ఈ సిరీస్ రూపొందించారు అని తెలిసినప్పటి నుంచి అసలు ఎలా ఉంటుందో అని ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. అయితే సిరీస్ చూసిన తర్వాత ఏదో సిల్లీగా సింపుల్ గా తీసేయకుండా మంచి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి సిరీస్ రూపొందించిన ఫీలింగ్ కలిగింది. చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఈ సిరీస్ కి కలిసి వచ్చే అంశం. ఈ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ పేసింగ్. ఎక్కడా కథను లాగకుండా, ప్రతి ఎపిసోడ్ ముగింపులో ఒక మంచి ట్విస్ట్ లేదా క్లిఫ్హాంగర్ పెట్టి తర్వాత ఎపిసోడ్ చూసేలా చేశారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అనేదాన్ని ఏదో సినిమాటిక్ షార్ట్‌కట్ లాగా కాకుండా, చాలా రీసెర్చ్ చేసి, నిజంగా ఎలా జరుగుతాయో అంతే క్లారిటీగా చూపించారు. డైరెక్టర్ కథ చెప్పే తీరు, ఫోర్త్ వాల్ వాడిన విధానం, సైకలాజికల్ గేమ్‌లు సిరీస్‌ను చాలా ఇంట్రెస్టింగ్గా మార్చాయి. వర్టికల్ ఫార్మాట్ అయినప్పటికీ, ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఒక సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సాయి తేజ, ఈ సిరీస్‌తో తనలో ఎంత మంచి నటుడు ఉన్నాడో నిరూపించుకున్నాడు. అరవింద్ పాత్రలో సాయి తేజ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ప్రశాంతంగా ఉంటూనే మైండ్ గేమ్‌లు ఆడటం, ఒక డార్క్, కాన్ఫిడెంట్ యాంటీ-హీరో పాత్రను చాలా సహజంగా చేసి మెప్పించాడు. ఇక మలయాళ నటుడు నితిన్ ప్రసన్న ఆదిత్య సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా చేశారు. అరవింద్‌కి సరైన ప్రత్యర్థిగా నిలుస్తూ, రాబోయే సీజన్‌పై ఆసక్తిని పెంచారు. ఇక ప్రకాష్ ఠాకూర్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో తన నటనతో మంచి ఇంపాక్ట్ చూపించారు. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా చేశారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే సినీ జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆదిత్య డెబ్యూ డైరెక్టర్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా వ్యవహరించారు. ఫార్మాట్‌ను ఒక పరిమితిగా తీసుకోకుండా, కథను ఎక్కడా ఆపకుండా వేగంగా నడిపారు. డైలాగ్‌లు చాలా షార్ప్‌గా, క్యాచీగా ఉన్నాయి. క్యారెక్టర్ల రాసుకొచ్చిన తీరు సిరీస్‌కు పెద్ద అసెట్. హైదరాబాద్ క్రైమ్ నెట్‌వర్క్‌ను, మూడ్‌ను విజ్యువల్గా చాలా రిచ్‌గా, సినిమాటిక్ స్టైల్లో చూపించారు. సీన్లలోని టెన్షన్‌ను, యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేయడంలో రీ-రికార్డింగ్ ప్రధాన పాత్ర పోషించింది. మ్యూజిక్ ఈ సిరీస్‌కు పెద్ద బలం.
ఫైనల్లీ
ధంధా’ వర్టికల్ ఫార్మాట్లో వచ్చిన ఒక గ్రిప్పింగ్, స్టైలిష్ అండ్ ఎంటర్టైనింగ్ క్రైమ్ డ్రామా.
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!