Brahmanda Review: ప్రివ్యూ చూస్తూ దర్శకుడి మృతి.. బ్రహ్మాండ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: ఆమని, బన్నీ రాజు, జయరామ్, కొమరక్క తదితరులు
- DIRECTOR: రాంబాబు
- MUSIC:
- PRODUCER: సురేష్
ఆమని, కొమరక్క కీలక పాత్రలతో రూపుదిద్దుకున్న చిత్రం “బ్రహ్మాండ”. దాసరి సునీత సమర్పణలో దర్శకుడు రాంబాబు దాసరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల కాకముందే దర్శకుడు రాంబాబు కన్నుమూయడం చిత్ర బృందంతో పాటు అందరినీ కలచివేసింది. వారి కష్టానికి ప్రతిరూపంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దాసరి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి సంగీతం అందించగా, రమేష్ రాయ్, జి.ఎస్. నారాయణలు సంభాషణలు సమకూర్చారు. తాజాగా విడుదలైన ఈ “బ్రహ్మాండ” చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
“ఇచ్చోళ” అనే గ్రామంలో ప్రతి అర్ధరాత్రి 12 గంటలకు హత్యలు జరుగుతూ ఉంటాయి. గత ఆరు నెలలుగా వరుసగా జరుగుతున్న ఈ హత్యలతో గ్రామస్తులు భయంతో వణికిపోతారు. ఈ మిస్టరీ హత్యలు పోలీసులకు పెద్ద సవాలుగా మారతాయి. ఫలితంగా, సాయంత్రం ఆరు దాటితే ఎవ్వరూ గ్రామ వీధుల్లో తిరగకూడదని పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేస్తారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో, గ్రామంలో జరిగే మల్లన్న జాతరను కూడా రద్దు చేయాలని ఆలోచిస్తారు. అసలు ఈ హత్యలకు కారణం ఎవరు? వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించారా? తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.
Also Read
విశ్లేషణ:
గ్రామీణ నేపథ్య కథలు, అక్కడి సంస్కృతి, కళలు ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాయి. వాటికి కాస్త ఆధ్యాత్మిక స్పర్శ తోడైతే మరింతగా ఆదరిస్తారు. అలాంటి ఓ గ్రామీణ కళా నేపథ్యాన్ని, ఒగ్గు కళాకారుల జీవితాన్ని, ఒక మర్డర్ మిస్టరీతో కలిపి “బ్రహ్మాండ” చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ఆరంభం నుంచీ చివరి వరకూ హత్యల భయంతో అట్టుడికిపోయిన గ్రామంలో చివరకు ఏం జరిగిందన్న ఉత్కంఠను క్లైమాక్స్‌లో కన్విన్సింగ్ గా చూపించారు.
నటీనటుల విషయానికొస్తే, ఆమని ఈ మధ్య కాలంలో చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. బలగం జయరాం తన పాత్ర పరిధిలో చక్కగా నటించారు. కొమరక్క పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆమె నటన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. బన్నీ రాజు, కనీకా వాధ్వల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఛత్రపతి శేఖర్ తనదైన సహజ నటనతో ఎప్పటిలాగే మెప్పించారు. నటుడు అమిత్ ప్రదర్శన కూడా ప్రశంసనీయం. దిల్ రమేష్, ప్రసన్నకుమార్, దేవిశ్రీ కర్తానందం వంటి మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దివంగత దర్శకుడు రాంబాబు… గ్రామీణ కళకు ఆధ్యాత్మికతను జోడించి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. ఇది ప్రేక్షకులను కథలో లీనం చేస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త మెరుగుదల అవసరం అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఉన్నాయి. నిర్మాత దాసరి సురేష్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. థియేటర్‌లో చూసి ఆస్వాదించదగిన చిత్రం ఇది.
ఫైనల్లీ తెలంగాణ గ్రామీణ కథలను, మిస్టరీ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు “బ్రహ్మాండ” నచ్చొచ్చు.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!