Bommala Koluvu Movie Review: బొమ్మల కొలువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2 / 5
- MAIN CAST: Hrishikesh, Priyanka Sharma, Malavika Satheesan, Shivam Malhottra,
- DIRECTOR: Subbu Vedula
- MUSIC: Praveen Lakkaraju
- PRODUCER: AVR Swamy
గతంలో ‘రాహు’ చిత్రాన్ని రూపొందించిన సుబ్బు వేదుల దర్శకత్వం వహించిన సెకండ్ మూవీ ‘బొమ్మల కొలువు’. ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ మూవీలో అతని తమ్ముడిగా చేసిన రిషికేశ్ ఇందులో హీరోగా నటించాడు. ఏవీఆర్ స్వామి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.
కరోనా ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. అయిన వారు చనిపోతే… కనీసం చివరి చూపుకు కూడా నోచుకోని పరిస్థితి. కొన్ని సందర్భాలలో అయితే అలా చనిపోయిన వాళ్ళ బాడీని కూడా బంధువులకు ఇవ్వకుండా అధికారులే అంతిమ సంస్కారాలు చేశారు. కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా కరోనా కష్టకాలంలో జరిగిన కొన్ని అసాంఘిక కార్యకలాపాలను బేస్ చేసుకుని సుబ్బు వేదుల ‘బొమ్మల కొలువు’ మూవీని తెరకెక్కించాడు.
Also Read
ఓ ఛానెల్ లో క్రైమ్ రిపోర్ట్ గా పనిచేసే రాగ (మాళవికా సతీశన్)కు రోడ్ మీద వెళుతున్న వెహికిల్ లోని మూటలో ఎవరో వ్యక్తిని బంధించారనే సందేహం కలుగుతుంది. పోలీసులకు ఆ విషయం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. దాంతో ఆ వాహనాన్ని ఫాలో అయ్యి ఇంటిని ట్రేస్ చేస్తుంది. తన ప్రియుడు రుద్ర (రిషికేశ్) సాయంతో ఈ మిస్టరీని ఛేదించాలని అనుకుంటుంది. అయితే ఆమె తన మీద కంటే ఈ కేసు మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడాన్ని రుద్ర తట్టుకోలేకపోతాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు కనిపించకుండా పోయిన రాగ, కరోనా కారణంగా మరణించినట్టు వైద్యులు రుద్రకు ఫోన్ చేసి చెబుతారు. ఆమె మృతదేహాన్ని సైతం రుద్రకు ఇవ్వకుండా వాళ్లే ఊరి చివర పడేస్తారు. నిజంగానే రాగ కరోనాతో మరణించిందా? రాగ ఛేదించాలనుకున్న మిస్టరీని ఆమె మరణానంతరం రుద్ర సాల్వ్ చేశాడా? ఇర్ఫాన్ (సుబ్బు వేదుల), గుణ (శివమ్) పోలీసులు అని తెలిసి కూడా రాగా వారిని ఎందుకు నమ్మలేకపోయింది? రాగకు సహాయం చేసే నెపంతో మిధిలా (ప్రియాంక శర్మ) ఎలాంటి దారుణానికి ఒడిగట్టింది? అనేదే ఈ సినిమా కథ.
ఇలాంటి క్రైమ్ థిల్లర్స్ తెలుగులో చాలానే వచ్చాయి. అయితే కరోనాను బేస్ చేసుకుని కథను అల్లడం ఇందులోని కొత్తదనం. అలానే క్లాత్ షోరూమ్స్ లో ఉండే బొమ్మలు (మానికిన్స్)గా మనుషులను మార్చడం, వారిని పరాయిదేశాల వారికి వేలం ద్వారా అమ్మేయడం కొంత భిన్నంగా ఉంది. కానీ ఇవేవీ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసే అంశాలు కావు. అసలు సినిమా ప్రారంభం నుండే నత్త నడకలా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య అనుబంధాన్ని ఎక్కడా బలంగా చూపలేదు. నటీనటుల నటన కూడా యావరేజ్ గా ఉంది. ఏ సన్నివేశంలోనూ వారు హండ్రెడ్ పర్సంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. శివమ్ ఇంటిలో జరిగే దారుణాలు వాటిని పోలీసులు పట్టించుకోకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. అలానే రాగ ఓ క్రైమ్ రిపోర్టన్ ను మించి ఏదో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మాదిరి ఆ ఇంటికి వెళ్ళడం చిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత రుద్ర చర్యలూ అలానే ఉంటాయి. అయితే చివరకు శివమ్, మిధిలాకు కథను లింక్ చేయడం కొంతలో కొంత ఆసక్తికరంగా ఉంది. సినిమా మొత్తం మీద చెప్పుకోవాల్సింది ప్రవీణ్ లక్కరాజు సంగీతం గురించే. అతను స్వరపరిచిన రెండు పాటలతో పాటు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పేలవంగా ఉన్నాయి. నిర్మాణ విలువలూ ఏమంత గొప్పగా లేవు. ‘బొమ్మల కొలువు’ అనే పేరును జస్టిఫై చేస్తూ కొన్ని సంభాషణలు, సన్నివేశాలు పెట్టారు. సంతోషం!
ప్లస్ పాయింట్స్:
కరోనా నేపథ్య చిత్రం కావడం
ప్రవీణ్ లక్కరాజు సంగీతం
మైనస్ పాయింట్స్:
బోర్ కొట్టించే కథనం
నిర్మాణ విలువలు లేకపోవడం
రేటింగ్: 2 / 5
ట్యాగ్ లైన్: ఆకట్టుకోని బొమ్మలు
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!