NTV Telugu Site icon

Appudo Ippudo Eppudo Review: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ

Appudo Ippudo Eppudo Review

Appudo Ippudo Eppudo Review

నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా సినిమాతో పాటు కేశవ సినిమాకి అప్పట్లో మంచి టాక్ వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలకు ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది అంటే అందులో సందేహం లేదు. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన మూడవ సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ సినిమా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేసింది. వాస్తవానికి హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా అంటే హైప్ ఉండాలి కానీ ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. యూనిట్ కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు, కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ మాత్రం చేసి రిలీజ్ చేశారు. ఇక సైలెంట్ గా ఈ సినిమా నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం.

కథ :
రిషి(నిఖిల్ సిద్దార్థ్) సరదాసరదాగా గడిపేసి ఒక కుర్రాడు. హైదరాబాద్ లో ఉండే రిషి తన అపార్ట్మెంట్స్ లో కొత్తగా దిగిన తార(రుక్మిణి వసంత్)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే తన స్నేహితుడు యాజి(వైవాహర్ష) చేసిన ఒక చిన్న తప్పిదం కారణంగా ఆమెకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ విఫలమైన నేపథ్యంలో ఆమెను చూస్తూ ఇక్కడే ఉండలేనని భావించి లండన్ షిఫ్ట్ అవుతాడు. అక్కడ తులసితో పరిచయం ఏర్పడి అది ప్రేమ అవుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని రెడీ అవుతున్న సమయంలో తులసి హ్యాండ్ ఇస్తుంది. అయితే అసలు తులసి ఎవరు? పెళ్లి చేసుకోవడానికి ముందు ఎందుకు రిషిని వదిలేసి వెళ్ళిపోయింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లండన్ లో సెటిల్ అయినా డాన్ బద్రి(జాన్ విజయ్) రిషిని ఎందుకు ఫాలో అవుతున్నాడు. బద్రి రైట్ హ్యాండ్ మున్నాకి, తులసికి ఉన్న రిలేషన్ ఏంటి? తారతో రిషి ప్రేమ ఎంతవరకు వెళ్ళింది? రిషి తులసిని పెళ్లి చేసుకున్నాడా? తారలను పెళ్లి చేసుకున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ: నిఖిల్ ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరో. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలను ప్యాన్ ఇండియా లెవెల్ లోనే చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన హీరోగా ఒక సినిమా వస్తుందంటే, ప్రేక్షకులలో అంచనాలు ఉంటాయి. అయితే ఈ సినిమా విషయంలో అసలు ముందు నుంచి ఎలాంటి బజ్ లేదు. అప్పుడు ఇప్పుడు అనే ఒక సినిమా వస్తుందనే విషయం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే వరకు తెలియదు. ఈ సినిమాని లైట్ తీసుకున్నారో లేక వర్కౌట్ కాదని, ముందే అర్థమైందో తెలియదు. కానీ సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక సినిమా విషయానికొస్తే గతంలో మనం చూసిన ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. ఆసక్తికర అంశాలు కానీ ఇదిరా ట్విస్ట్ అనుకునే కీలకమైన ట్విస్టులు కానీ తర్వాత ఏం జరగబోతోంది అని యాంగ్జైటీగాని ఏమాత్రం లేకుండా సినిమా మొత్తం సాగుతూ ఉంటుంది. ఒక రొటీన్ లవ్ స్టోరీకి క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి, ఒక థ్రిల్లర్ కథ చెప్పాలనుకున్న ప్రయత్నం సరే కానీ అది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలాంటి ఆసక్తి కలిగించలేదు. నిఖిల్ సినిమా అంటే కొంత వరకు అయినా ఆసక్తికర అంశాలు ఉంటాయని ఎదురు చూసే ప్రేక్షకులకు సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు నిరాశయే మిగులుగుతుంది. అక్కడక్కడ వచ్చే ట్విస్లను కూడా సగటు ప్రేక్షకుడి ఈజీగా అర్థం చేసుకోగలరు. అయితే స్క్రీన్ ప్లే తో కొంత మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు కానీ ప్రేక్షకుల సహనానికి అది పరీక్ష అయింది. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో ఇద్దరు హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ గురించి చెబుతూ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి రొటీన్ ఫార్ములాతోనే ముగింపు ఉండడం గమనార్హం.

నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో కార్తీక్ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. సుధీర్ వర్మ మీద నమ్మకంతో ఆయన చెప్పింది చేసినట్టే కనిపిస్తోంది. తార అనే పాత్రలో రుక్మిణి కూడా ఒదిగిపోయింది. దివ్యాంశకి కూడా ఒక మంచి పాత్ర లభించింది. నెగిటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో ఆమె ఆకట్టుకుంది. హర్ష అంటే సత్య, సుదర్శన్ లాంటి వాళ్లు సినిమాలో ఉన్నారు. కానీ వారి స్థాయిలో కామెడీ లేదు కాబట్టి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. జాన్ విజయ్, అజయ్ వంటి వారు పర్వాలేదనిపించారు. సాంకేతికంగా పర్వాలేదు అనిపించినా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టుకోవడం కష్టమే.

ఫైనల్లీ ఎప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎందుకో?

Show comments