Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Allu Arjuns Pushpa The Rule Reloaded Version Review

Pushpa 2 Reloaded Review: పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రివ్యూ!

Published Date :January 17, 2025 , 1:39 pm
By Bhargav Chaganti
  • డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు పుష్ప 2
  • రికార్డు కలెక్షన్స్ సాధించిన పుష్ప 2
  • తాజాగా మరో 20 నిమిషాల నిడివి ఆడెడ్
Pushpa 2 Reloaded Review: పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రివ్యూ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 3.25 / 5

  • MAIN CAST: Allu Arjun, Rashmika Mandanna
  • DIRECTOR: Sukumar
  • MUSIC: Devi Sri Prasad
  • PRODUCER: Naveen Yerneni, Y Ravi Shankar

అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో రూపొందించిన పుష్ప సెకండ్ పార్ట్ సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పుష్ప ది రైజ్ రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటించిన దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో తెచ్చుకుంది. అయితే సినిమా రిలీజ్ అయిన నెల తరువాత మరో 20 నిమిషాల నిడివి పెంచుతూ సినిమా యూనిట్ మరొక వర్షన్ రీలోడేడ్ అంటూ రిలీజ్ చేసింది. మరి ఈ రీలోడెడ్ వర్షన్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
పుష్ప పెళ్లి జరగడంతో పుష్ప ది రైజ్ పూర్తికాగా ఆ తర్వాత పరిస్థితులను ఆధారంగా చేసుకుని రెండవ సినిమాని తెరకెక్కించారు. శ్రీవల్లి(రష్మిక)తో ఒక అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు సిండికేట్ ప్రెసిడెంట్ అయిన పుష్ప రాజ్(అల్లు అర్జున్). ఒకరోజు ఊరికి సీఎం వచ్చాడని కలవడానికి వెళుతున్న సమయంలో శ్రీవల్లి సీఎంతో ఫోటో దిగి తీసుకు రమ్మంటుంది. అయితే పుష్పరాజు లాంటి స్మగ్లర్ తో ఫోటో దిగడం కరెక్ట్ కాదని, భార్య మాట విని ఏది పడితే అది చేయకూడదని శ్రీవల్లిని తక్కువ చేసి మాట్లాడతాడు. దీంతో తన భార్యను అవమానించడంతో హర్ట్ అయిన పుష్పరాజు, ఆమె అడిగింది నిజం చేయాలనే ఉద్దేశంతో ఏకంగా సీఎంను మార్చేందుకు ప్రయత్నిస్తాడు. సీఎంను మార్చడం అంటే మాటలా? అందుకోసం 2 వేల టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాన్ని ప్రతీక జ్వాలలతో రగిలిపోతున్న షకావత్( ఫహాద్ ఫాజిల్) అడ్డుకున్నాడా? అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఆ ప్రయత్నాలను పుష్ప చేదించగలిగాడా? సీఎంను మార్చగలిగాడా? ఎలా అయినా తనకు ఇంటిపేరు కోసం పోరాడుతున్న పుష్ప ఆ ఇంటి పేరుని దక్కించుకోగలిగాడా లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద మరో సారి చూడాల్సిందే.

Also Read

  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
  • Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
  • Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

విశ్లేషణ:
పుష్ప మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దానికి కొనసాగింపుగా తెరకెక్కించిన ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సినిమా యూనిట్ కూడా ముందు నుంచి జాతర సీక్వెన్స్ అదిరిపోతుందంటూ ఒక రేంజ్ లో హైపిస్తూ వచ్చింది. సినిమా ప్రారంభంలోనే ఒక రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలుపెట్టిన పుష్పరాజ్ జాతర సినిమా క్లైమాక్స్ వరకు కొనసాగింది. నిజానికి ఈ సెకండ్ పార్ట్ లో కథ పెద్దగా లేదు కానీ ఓపెనింగ్ కార్డ్ నుంచి ఎండు టైటిల్స్ వరకు కాసేపటికి ఒక హై మూమెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్. ఇంటి పేరు కోసం సెకండ్ పార్ట్ లో కూడా పోరాటం కొనసాగుతుంది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి పుష్పరాజ్ ఎదిగే తీరు చూపించిన విధానం ప్రతి ఒక్క కామన్ ఆడియన్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమాలో ముఖ్యంగా జాతర సీక్వెన్స్ తో పాటు దాదాపుగా అన్ని యాక్షన్ సీక్వెన్స్ లు బాగా వర్కౌట్ అయ్యాయి. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో స్క్రీన్ మీద చూడడానికి కూడా అంతే బాగున్నాయి. అయితే రష్మిక క్యారెక్టర్జేషన్ విషయంలో కొంత మందికి కంప్లైంట్స్ కనిపించవచ్చు. కానీ ఆమె క్యారెక్టర్ తో కూడా ఒక రేంజ్ లో ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఒక కూలీ స్థాయి నుంచి సిండికేట్ హెడ్ స్థాయికి ఎదిగిన పుష్పరాజ్ ఆ తర్వాత ఏకంగా ఒక సీఎంను మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడితే దానికోసం ఎంతకు తెగించాడు? లాంటి సన్నివేశాలు భలే ఎంగేజింగ్ గా అనిపించాయి. సినిమాలో డైలాగ్ పోర్షన్ ప్రేక్షకులను అలరించేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా లేడీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి రాసుకున్న కొన్ని డైలాగ్స్ ఐతే కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరిగాయి. జపాన్ సీక్వెన్స్ ఇరికించినట్లు ఉందని లేదు చిరంజీవి మీద కావాలనే డైలాగ్స్ వేయించడానికి ప్లాన్ చేశారని ఇలా రకరకాల కామెంట్లు వచ్చాయి. కాగా తాజాగా యాడ్ చేసిన 20 నిమిషాలలో ఆ జపాన్ సీక్వెన్స్ కి ఇచ్చిన కనెక్షన్ అదిరిపోతుంది. అలాగే ప్రేక్షకులు ఏవైతే మిస్సయ్యామని భావించారో అలాంటి ఎలిమెంట్స్ సెకండ్ రీలోడెడ్ వర్షన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించారు సుకుమార్ అండ్ టీం. పుష్ప రీలోడెడ్ వెర్షన్ చూసిన తర్వాత అంతకు ముందు చూసిన ప్రేక్షకులకు ఒకటే అనిపిస్తుంది. ఇంత మంచి సీన్స్ ని ఎందుకు కట్ చేశారు అని. అయితేనేం ?ఇప్పుడు యాడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడంలో సుకుమార్ మాస్టర్ మైండ్ మరోసారి కనిపించింది. ఇక స్మగ్లింగ్ సీక్వెన్స్ లతో పాటు ఊహించని కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజానికి ఇలాంటి కమర్షియల్ సినిమాలో లాజిక్స్ వెతకకూడదు కాబట్టి సరిపోయింది లేదంటే కొన్ని లాజిక్స్ కి అందని విషయాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకులు పెట్టిన డబ్బుకు ఆశించే హై మూమెంట్స్ కి సినిమాలో ఏమాత్రం కొదవలేదు.

నటీనటుల విషయానికి వస్తే:
ముందుగా అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయినా మొదటి పార్ట్ తో నేషనల్ అవార్డు అందుకున్న హీరో గురించి ఏం చెప్పగలం? అయితే డాన్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలలో ఒకరకంగా వన్ మాన్ షో నడిపించాడు అల్లు అర్జున్. ఇక శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది ఆమె క్యారెక్టర్ ను ఎలా రాసుకున్నారో అలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. ఇక వీరి తర్వాత నటించే స్కోప్ దక్కిన పాత్ర షేకావత్ అదేనండీ మన ఫహద్ ఫాజిల్ ది. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఇక మిగతాపాతాలలో నటించిన అజయ్, తారక్ పొన్నప్ప, జగపతిబాబు, రావు రమేష్, సునీల్, అనసూయ ఇలా ఎవరికి వారే ప్రత్యేకంగా తమ పాత్రలతో ప్రేక్షకులను ఎంగేజ్ చేశారు.

టెక్నికల్ టీంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. పాటలు ఎంత బాగా అందించాడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చేసిన వర్క్ అంతా స్క్రీన్ మీద కనిపించింది. ఇక సినిమా మొత్తాన్ని చాలా రిచ్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు చేజింగ్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను మైమరిపించేలా తెరమోదికి తీసుకొచ్చాడు. అదే సమయంలో మౌనిక దంపతులు చేసిన ఆర్ట్ వర్క్ కూడా సినిమాకి అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. అలాగే స్టంట్ మాస్టర్స్ కష్టం ప్రతి ఫైట్ సీక్వెన్స్ లో కనిపించింది. డాన్స్ కొరియోగ్రఫీ కూడా టాప్ నాచ్.

ఫైనల్లీ:
పుష్ప 2 రీలోడెడ్ పుష్ప 2 చూసిన ప్రతి ఒక్కరూ చూడాలి.. ఎందుకంటే కంటెంట్ అలాంటిది మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • pushpa 2
  • Pushpa 2 Reloaded
  • Rashmika Mandanna
  • sukumar

తాజావార్తలు

  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..

  • Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?

  • Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..

  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..

  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions