NTV Telugu Site icon

ALa Ila Ela Review: అలా ఇలా ఎలా రివ్యూ

Ala Ila Ela Review

Ala Ila Ela Review

ALa Ila Ela Movie Review: తెలుగు సినిమాలు అనే కాదు దాదాపుగా అన్ని భాషల సినిమాల్లో లవ్ స్టోరీస్ అనేవి నెవర్ ఎండింగ్ కాన్సెప్టులు. ఈ మధ్య లవ్ కంటే బ్రేకప్ సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. అలాగే ప్రియురాలు చేతిలో ప్రియుడు మోస పోయిన సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ప్రేమ, మోసం అనే నేపథ్యాన్ని ఎంచుకుని అలా ఇలా ఎలా అనే సినిమా తెరకెక్కించారు. టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ మెయిన్ లీడ్‌గా, శక్తి వాసుదేవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం నాడు థియేటర్లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ
అను (పూర్ణ) చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయి. ఆమెకి అబద్ధం అన్నా అబద్దం ఆడే వారన్నా అసహ్యం. అలాంటి అను సూర్య (శక్తి వాసుదేవన్ )తో ప్రేమలో పడుతుంది. వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో కార్తీక్ (రాజా చెంబోలు) జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. అలా వచ్చిన కార్తీక్ మిత్రని చంపాలని ప్లాన్ చేస్తాడు? అసలు కార్తీక్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఎలా తప్పించుకున్నాడు? అతను చంపాలి అనుకున్న మిత్ర ఎవరు? ఇక అను లవ్ చేసిన సూర్య ఎవరు? అనుకి, కార్తీక్‌కి ఉన్న లింక్ ఏంటి? అబద్ధం అంటేనే ఆమడ దూరంలో ఉండే అనుని మోసం చేసింది ఎవరు? చివరకు అను ఏం చేసింది? లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
సినీ పరిశ్రమలో లవ్ స్టోరీస్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇక మీద కూడా వస్తాయి. అయితే ఇలాంటి లవ్ స్టోరీలతో ఎన్ని సినిమాలు చేసినా కొత్త పాయింట్ తో ప్రేక్షకులను మెప్పించగలిగితే కచ్చితంగా అవి సూపర్ హిట్ అవుతాయి. బహుశా దాన్నే నమ్ముకుని ఈ సినిమా తెరకెక్కించినట్లు అనిపించింది. ప్రేమ, మోసం అనే కాన్సెప్టుతో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాలో మాత్రం లవ్, మోసం అనేవి కాస్త కొత్తగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా నవ్వించే ప్రయత్నం చేశారు. బ్రహ్మానందం, ఆలీ మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండాఫ్ కథను సీరియస్ మోడ్‌లోకి తీసుకు వెళ్లడంతో అసలు నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తి కలిగించేలా తెరకెకెక్కించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఊహకు అందకుండా ఒక పూర్తి స్థాయి ఎమోషనల్ క్లైమాక్స్‌ను రాసుకున్నాడు. రొటీన్ కథ కావడంతో సినిమా అంతా ఎక్కడా కొత్తదనం కనిపించదు. దాదాపుగా సినిమా మొత్తానికి అదే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.

నటీనటులు
అను పాత్రలో హీరోయిన్ పూర్ణ ఎప్పటిలాగే తనదైన అనుభవంతో నటించింది. శక్తి వాసుదేవన్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా నటించి మెప్పించాడు. కార్తీక్ కారెక్టర్లో రాజా చెంబోలు ఆకట్టుకున్నాడు. నాగబాబు, సితార, సీత, షాయాజీ షిండే, రేఖ, బ్రహ్మానందం, అలీ ఇలా అందరూ పాత్రలు పరిధి మేర నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే మణిశర్మ పాటలు, సంగీతం సినిమాకి ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది కానీ ఎడిటింగ్ విషయంలో అయితే ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిగ్గా నప్పాయి.

బాటమ్ లైన్
ప్రేమ కథలో కొత్త ప్రయత్నం ఈ అలా ఇలా ఎలా..

Show comments