Aakali Rajyam 2026 Review: ఆకలి రాజ్యం 2026 రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: వికాస్ వశిష్ఠ, రాజేష్ ఖన్నా, గీత్ సైని తదితరులు
- DIRECTOR: నీలగిరి మామిళ్ళ
- MUSIC: వంశీకాంత్ రేఖనా
- PRODUCER: పద్మినీ రాజా వేలు, రాజా వేలు
1980ల్లో నిరుద్యోగ యువత ఆక్రందనలను వెండితెరపై ఆవిష్కరించి క్లాసిక్ గా నిలిచిన కమల్ హాసన్ ‘ఆకలి రాజ్యం’ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత, నేటి ఐటీ విప్లవంలోనూ మారని సగటు ఇంజనీరింగ్ యువత కష్టాలను ‘ఆకలి రాజ్యం 2026’ పేరుతో వెబ్ సిరీస్ గా తీసుకొచ్చారు. టెలి ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజవేలు, పద్మిని నిర్మాణంలో దర్శకుడు నీలగిరి మామిళ్ళ తెరకెక్కించిన ఈ సోషల్ సెటైరికల్ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
ఆకలి రాజ్యం 2026 కథ
రమేష్ (వికాస్ వశిష్ఠ), అక్షయ్ (రాజేష్ ఖన్నా), అరుణ (గీత్ సైని) ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ అద్దె గదిలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. అక్షయ్ కి చిన్న ఉద్యోగం ఉన్నా, సరైన జీతం రాక, చేసే పని నచ్చక అవస్థలు పడుతుంటాడు. రమేష్ కు సొంతంగా వ్యాపారం చేయాలనే తపన ఉన్నా ఇంట్లో సపోర్ట్ ఉండదు. అరుణ తన కుటుంబానికి అండగా నిలవాలనుకున్నా అనూహ్యంగా ఉద్యోగం కోల్పోతుంది. దీనికి తోడు రూమ్ ఓనర్ బిట్టు భాయ్ రెంట్ కోసం పెట్టే టార్చర్ మరోవైపు. ఒకరోజు అరుణ వాళ్ళ నాన్న అకస్మాత్తుగా రూమ్ కి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. ఈ గడ్డు పరిస్థితులను ఈ ముగ్గురు స్నేహితులు ఎలా ఎదుర్కొన్నారు? జీవితంలో ఎలా స్థిరపడ్డారు? అనేదే కథ.
Also Read
విశ్లేషణ
నేటి సమాజంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం హైదరాబాద్ లాంటి నగరాల్లో యువత పడుతున్న పాట్లను ఈ సిరీస్ వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేసింది. తొలి రెండు ఎపిసోడ్లు నిరుద్యోగ కష్టాల చుట్టూ అల్లుకున్న వినోదంతో సరదాగా సాగితే, మూడో ఎపిసోడ్ మాత్రం పూర్తిగా ఎమోషనల్ గా ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. కథను హైదరాబాద్ లోని రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం వల్ల సగటు యువత జీవితాలకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. అయితే, ఈ తరహా నిరుద్యోగ కాన్సెప్టులు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో ఇప్పటికే చాలాసార్లు చూసేయడం వల్ల కథనంలో కొత్తదనం లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు దర్శకుడికి బిటెక్ చదువుపై ఉన్న కోపాన్ని డైలాగ్స్ రూపంలో కాస్త అతిగా చూపించినట్లు అనిపిస్తుంది. అక్షయ్ సంపాదిస్తుంటే, ఏ పనీ చేయని రమేష్ రూమ్ రెంట్ కట్టడం, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించడం లాంటి లాజిక్ లేని అంశాలు సిరీస్ ఫ్లోను కాస్త దెబ్బతీస్తాయి. అక్కడక్కడా వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టినా, ముగ్గురి మధ్య ఉన్న స్నేహం, క్లైమాక్స్ లో పండే ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యాయి. తదుపరి సీజన్ కు స్మార్ట్ ఫార్మింగ్ లీడ్ ఇవ్వడం బాగుంది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ప్రధాన పాత్రల్లో నటించిన వికాస్ వశిష్ఠ, గీత్ సైని, రాజేష్ ఖన్నా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నిరుద్యోగులుగా వాళ్ల జీవితాల్లోని సంఘర్షణను, ఎమోషన్స్ ను చాలా సహజంగా పండించారు. యూత్ వాళ్ళ క్యారెక్టర్స్ కు సులభంగా కనెక్ట్ అవుతారు. ఇక రూమ్ ఓనర్ బిట్టు భాయ్ గా రమేష్ ఈరావేన తన కామెడీ టైమింగ్ తో బాగా మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే తక్కువ బడ్జెట్ లో తెరకెక్కినప్పటికీ నిర్మాణ విలువలు నీట్ గా ఉన్నాయి. రియల్ లొకేషన్స్ లో తీసిన ఈ సిరీస్ కు సినిమాటోగ్రఫీ, విజువల్స్ పెద్ద ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల మూడ్ కి తగ్గట్లుగా పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ బాగున్నా, మొదటి రెండు ఎపిసోడ్స్ లోని కొన్ని ల్యాగ్ సీన్స్ ను ట్రిమ్ చేయాల్సింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దానికి ఎమోషన్స్ జోడించి ముగింపు ఇచ్చిన తీరు బాగుంది.
చివరిగా లాజిక్స్ వెతక్కుండా చూస్తే.. ‘ఆకలి రాజ్యం 2026’ నిరుద్యోగ కష్టాలకు యూత్ ఫుల్ వెర్షన్
తాజావార్తలు
-
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
-
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
-
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!