Rainbow Hospital CSR Activity: ప్రభుత్వాసుపత్రులకు రెయిన్ బో చేయూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్‌లను శుభ్రంగా మరియు స్టెరిలైజ్ గా ఉంచడానికి అవసరమైన పరికరాలను విరాళంగా ఇచ్చింది రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్. రెయిన్‌బో తన CSR ప్రణాళికల్లో భాగంగా తెలంగాణల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 1.2 కోట్ల విలువైన 100 ఎయిర్ పెట్రీ శాంపిలింగ్ సిస్టం LA637 లను అందించడం జరిగింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తన CSR యాక్టివిటీ కింద తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 1.2 కోట్ల విలువగల 100 ఎయిర్ పెట్రీ శాంప్లింగ్ సిస్టమ్‌లను అందించింది. ఈ ఆటోమేటిక్ మరియు అధునాతన పరికరాలు, గాలిలోని బ్యాక్టీరియా మరియు ఫంగస్ ని కనిపెట్టడానికి సహాయపడతాయి.ఎయిర్ పెట్రీ శాంప్లింగ్ సిస్టమ్ LA637 అనేది పూర్తిగా ఆటోమేటిక్ & యూజర్ ఫ్రెండ్లీ పరికరం అవ్వడం చెప్పుకోదగ్గ విషయం.
దీని గురించి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మరియు ఆర్థిక శాఖల గౌరవనీయ మంత్రి టి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందన్నారు. హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ పెట్రి శాంప్లింగ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు సహకారం అందిస్తున్నందుకు, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు ధన్యవాదాలు తెలిపారు. సర్జికల్ మరియు పోస్ట్-ఆపరేటివ్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది చాలా సహాయపడుతుందని మెచ్చుకున్నారు.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి

మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. కె రమేష్ రెడ్డి రెయిన్‌బో యొక్క CSR కార్యాచరణ గురించి మాట్లాడుతూ, “పోస్ట్-ఆపరేటివ్ ఇన్‌ఫెక్షన్, మొత్తం ఇన్‌ఫెక్షన్లలో మూడవ వంతు ఉందని అధ్యయనాలు రుజువు చేశాయి. అయితే వీటిని నివారించడానికి, ఈ ఎయిర్ పెట్రీ శాంప్లర్‌ల ద్వారా గాలిలో బ్యాక్టీరియా మరియు ఫంగస్ 13 రెట్లు తగ్గించడం సాధ్యపడుతుంది.” డా రమేష్ కంచర్ల గారి నుండి ఎయిర్ పెట్రి శాంప్లింగ్స్ అందుకుంటూ, హోం శాఖా మంత్రి శ్రీ మహ్మూద్ ఆలి మాట్లాడుతూ,”ఈ ఎయిర్ పెట్రి శాంప్లర్స్ ఆపరేషన్ థియేటర్లలో సర్జరీ కి ముందే బాక్టీరియా మరియు ఫంగస్ యొక్క ఉనికిని కనుగొనడంలో చాలా సందర్భాలలో ప్రాణంతకమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది” అని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలోని ఓటీలలో గాలిని మైక్రోబయోలాజికల్ మానిటరింగ్ చెయ్యడం అనేది, అంటువ్యాధుల నివారణలో ఒక చురుకైన విధానం. అంతే కాకుండా ఇది రోగి ని ఎన్నో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది.” అని తెలిపారు.
ఆరోగ్య మరియు ఆర్థిక శఖా మంత్రి శ్రీ టి హరీష్ రావు తరఫున తెలంగాణా రాష్ట్ర హోం శఖా మంత్రి శ్రీ మహ్మూద్ ఆలీ డా రమేష్ కంచర్ల వద్ద నుంది ఎయిర్ పెట్రీ శాంప్లింగ్స్ ను అందుకున్నారు. కమిషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, శ్రీమతి శ్వేత మొహంతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం డాక్టర్ ప్రశాంత్, గ్రూప్ క్లినికల్ డైరెక్టర్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్: 99591-15050కి కాల్ చేయండి.
Read Also: Supreme Court Relief For Jagan Govt LIVE: రాజధాని కేసులో జగన్ సర్కార్ కి సుప్రీం ఊరట
తాజావార్తలు
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!