మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధిని సంక్షిప్తంగా ‘ఎంఎస్’ అని అంటారు. అనేక రకాల బ్యాక్టీరియా వైరస్ లు, తదితర వ్యాధికారక సూక్ష్మజీవుల కారణంగా మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడిందుకు మన శరీరంలోనే ఒక అంతర్గత వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థను ఆంగ్లంలో ‘ఇమ్యూన్ సిస్టమ్’ అంటారు. అయితే, కొన్ని సందర్భాలలో – ఈ ”ఇమ్యూన్ వ్యవస్థ’- మన శరీరం పైకి దాడి చేస్తున్న వ్యాధికారకాల్ని కాకుండా, దురదృష్టవశాత్తు, మన శరీరంలోని ఉండి మెదడు, కంటినరాలు, వెన్ను పూస వంటి సంక్లిష్టమైన, సున్నితమైన భాగాలపైన దాడి చేస్తుంది. దీని వలన ఆయా శరీర భాగాలు, అవయవాలు దెబ్బ తిని మనల్ని వ్యాదిగ్రస్థుల్ని చేస్తాయి. దీనినే ఆటో ఇమ్మ్యూనిటీ అంటాం. అలా వచ్చేదే ‘మల్టిపుల్ స్కిరోసిస్’ లేదా ‘ఎంఎస్’.
ఈ ‘ఎంఎస్’ అనే సమస్య ఎలా మొదలవుతుందో, ఎలా మనుషులకు వస్తోందో నేటికీ అంతుచిక్కడం లేదు. కానీ, ఒక వ్యక్తికి- వారి కుటుంబపరమైన వారసత్వ లక్షణాలు, అంటే జన్యువులు లేదా ‘జీన్స్’: ఆ వ్యక్తి ఉండే పరిసరాలు, వాతావరణం: చిన్న వయసులో వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆ వ్యాధికి ట్రిగ్గర్స్ కావచ్చు. స్వతహాగా జన్యుపరంగా ఈ వ్యాధి రాగల అవకాశం ఉన్నవారికి ఏదో ఒక వాతావరణ సంబంధిత కారణం, ఈ వ్యాధి అరంటానికి కారణం కావచ్చు. ఈబీవి, మీజిల్స్, హెర్పిస్, ఫ్లూ వంటివి పైన పేర్కొనబడిన ఇన్ఫెక్షన్స్ లో కొన్ని.
‘ఎంఎస్’ వ్యాధి మెదడులో, వెన్నుపూసలో, ఆప్టిక్ నాడి చుట్టూ ఉన్న మైలిన్ పోర కరిగిపోవడం వలన వస్తుంది. దీనినే డీమైలినేషన్ అంటాము.
‘ఎంఎస్’ కి సంబందించిన తొలి సూచనలు చాలా నాటకీయంగా బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ సూచనలను ఆ వ్యక్తి అసలు గమనించలేక పోవచ్చు కూడా! సాధారణంగా ఇలాంటి హెచ్చరిక సూచనలను ఇలా పేర్కొనవచ్చు:
* చేతులు, కాళ్ళు, ముఖం పైన తిమ్మిర్లు, మొద్దుబారిపోవడం, లేదా మంటలు రావడం
* శరీర భాగాల్లో సమతుల్యం లేకపోవడం లేదా తగ్గిపోవడం ఒకటి లేదా అంతకుమించిన శరీర అవయవాలలో బలహీనత ఏర్పడడం
* కంటిచూపు తగ్గటం, మందగించడం, కనుపాపల కదలికతో నొప్పి కలగటం
* వ్యాధి ముదిరిన కొద్దీ వేడిని భరించలేకపోవడం, అలసట, ఆలోచనలలో మార్పులు కనిపించటం వంటి మరిన్ని లక్షణాలు ఉండవచ్చు
ఎంఎస్ ను గుర్తించటం, వ్యాధి నిర్ధారణ చేయటం సవాలుతో కూడుకున్న పని. ఎంఎస్ వ్యాధి తోలి దశలో ఏ స్పష్టమైన లక్షణమూ ఉండక, నరాలకు సంబందించిన అనేక సమస్యలుగా కానరావచ్చు తొలి దశ లక్షణాలు- వస్తూ పోతూ, మనం గమనించలేని విదంగా ఉంటాయి. ఈ రోగ నిర్ధారణలో చాలా వరకు ఎంఆర్ ఐ (మాగ్నిటిక్ రెసోసిన్స్ ఇమేజింగ్). మెదడు, వెన్నెముక, ఆప్టిక్ నాడి కి చేస్తే చాలా వరకు సహాయకారిగా ఉంటోంది. దీనికి అదనంగా, స్పైనల్ ఫ్లూయిడ్ అనాలసిస్ తో పాటు (వెన్నుపూస చుట్టూ ఉన్న ద్రవాల విశ్లేషణ) ఆలిగోక్లోనల్ బ్యాండ్ ఎస్టిమిషన్ కూడా రోగనిర్ధారణకు తోడ్పడుతుంది.
ఎంఎస్ వ్యాధి తీవ్రతరం కాకుండా కాపాడిందుకు చాలా మందులు లభ్యమవుతున్నాయి. దీర్ఘకాలిక నష్టం జరగకుండా కాపాడుకోవాలంటే శరీరంలో తొలి దశ లక్షణాలు కనిపిస్తున్న ప్పుడి చికిత్స అవసరమని గుర్తించాలి. ఇప్పుడు లభిస్తున్న మందులన్నీ కొత్త డిమైలిసిటింగ్ ప్లాక్స్ రాకుండా కృషి చేస్తాయి. క్రమం తప్పని వైద్య సలహాలు, చికిత్సలతో పాటు స్పీడ్ థెరపీ, రిహాబిలిటేషన్ వంటివి ఈ రోగ లక్షణాలను అదుపులో ఉంచటమే కాకుండా, సాధారణ జీవితాన్ని గడపగల అవకాశమూ అందిస్తాయి.
ఎంఎస్ ఉన్న చాలా మంది రోగులు తీవ్రమైన వైకల్యానికి గురి అవుతారని భావించక్కర్లేదు. ఎంఎస్ వ్యాధి బారిన వారిలో మూడింట రెండవ వంతు మంది చికిత్సతో బాగా కోల్కొనడమే గాక తమ పని తాము సునాయాసంగా చేసుకోగలుగుతారు. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. దీనికి-చికిత్స విధానాలలో గణనీయమైన మార్పులు రావటం, విస్తరించిన హెల్త్ కేర్ అవకాశాలు, జీవనశైలిలో మార్పులు వంటివన్నీ కారణమని వైద్యులు భావిస్తున్నారు. వ్యాధివల్ల వచ్చే సంక్లిష్ట స్థితులు కూడా తగిన చికిత్సతో తగ్గించుకో గల వీలుందని గుర్తించాలి.
వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్సను అందించడం అనేది వ్యాధిగ్రస్తులు ఎటువంటి వైకల్యం లేకుండా, తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేలా చేయడంలో కీలకమైనది.
Dr Neeharika L Mathukumalli
Sr. Consultant – Neurology
Star Hospitals,
Banjara Hills, Hyderabad.
Contact : 07969 250 191