Mahatma Gandhi Cancer Hospital: క్యాన్సర్ చికిత్సలో 20 సంవత్సరాల విశిష్ట సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా, విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (MGCHRI) మరో కీలక మైలురాయిని సాదించింది. అత్యాధునిక టోమోథెరపీ®️ రాడిక్పార్ట్ X9 నూతన తరం ఖచ్చిత రేడియేషన్ సాంకేతికతను ప్రారంభించడంతో, ఈ సంస్థ ఆంధ్రప్రదేశలో తొలి మరియు ఏకైక ఏపిక్స్ స్థాయి క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇది అధునాతన, నైతికి మరియు రోగ కేంద్రత క్యాన్సర్ చికిత్సకు సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రారంభ కార్యక్రమం డిసెంబర్ 30న మధ్యాహ్నం 12:30 గంటలకు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణం, MVP కాలనీ, విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ వైద్యులు, ఆరోగ్య నిపుణులు మరియు ప్రముఖులు హాజరయ్యారు.
అత్యాధునిక టోమోథెరపీని రాడిక్సార్ట్ X9 ఖచ్చిత రేడియేషన్ చికిత్స వ్యవస్థను గౌరవనీయులు శ్రీ మతుకుమిల్లి శ్రీ భరత్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ మురళీకృష్ణ వూన్న, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, టోమోథెరపీతి రాణికాృద్ది XY ద్వారా Advanced Precision Adaptive Radiatherapy అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా క్యాన్సర్ గడ్డను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని, చుట్టూ ఉన్న ఆరోగ్యకర ఆవయవాలకు తక్కువ నష్టం కలిగే విధంగా రేడియేషన్ చికిత్స అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.

టోమోథెరపీఠ రాడిక్సాక్ట్ X9 వ్యవస్థ అధిక ఖచ్చితత్వంతో రేడియేషన్ను అందించడంతో పాటు ప్రతిరోజు ఇమేజ్ గైడెన్స్ ను సమన్వయం చేసి, అడ్వాన్స్డ్ ప్రెసిషన్ ఆడాప్టివ్ రేడియోథెరపీ ద్వారా ట్యూమర్ను అత్యంత నిశితంగా లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయడానికి సహకరిస్తుంది, దీని వల్ల చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకర కణజాలంపై రేడియేషన్ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ఈ ఆర్యాధునిక సాంకేతికత క్లిష్టమైన క్యాన్సర్లు, పిల్లల క్యాన్సర్లు, తల-మెడ క్యాన్సర్లు, ప్రోస్టేట్ క్యాన్సర్, స్టైన్ ట్యూమర్లు వంటి చికిత్సలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు, రక్త క్యాన్సర్లడు అవసరమైన టోటల్ బాడీ ఇరేడియేషన్ (TBI), టోటల్ మారో ఇరేడియేషన్ (TMUTMLI), క్లానియోస్పైనల్ ఇరేడియేషన్ (CSI) వంటి ప్రత్యేక చికిత్సల్లో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.
PAN–Aadhaar Linking Deadline: పాన్ – ఆధార్ లింక్ గడువును మరోసారి పొడిగిస్తారా..?
ఈ వ్యవస్థ ద్వారా అధిక ఖచ్చితత్వం, మరింత సురక్షితమైన రేడియేషన్ చికిత్స, తక్కువ దుష్ప్రభావాలు మరియు మెరుగైన రోగి సౌకర్యం లభిస్తాయని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా క్యాన్సర్ చికిత్సలో విశిష్ట సేవలు అందిస్తూ, ఇప్పటివరకు 2 లక్షలకుపైగా రోగులకు సేవలందించిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సమగ్ర క్యాన్సర్ చికిత్సను అందిస్తోంది.