నాదొక అద్భుతమైన ప్రయాణం- సవాళ్లు, పట్టుదల, చివరికి విజయాలతో కూడిన మహాద్భుతం. నాకు 27 ఏళ్ల వయసు, హైదరాబాద్లో నివాసం. చెప్పలేనంత ఊబకాయంతో నిరంతరయుద్ధం. ఈ యుద్ధంవల్ల – ఒకప్పుడు జీవితంలో నిండిన ఆనందం అంతా కోల్పోతున్న భావన. నా శారీరకమైన బరువు ఎంత పెరిగిందీ అంటే – నా నిత్యజీవనం నాకే దుర్భరమయిందనిపించేంత! కానీ, ఒక్కరోజు – ‘ఇంక చాలు, ఏదైనా చేసితీరాలి’ అని నిర్ణయించుకున్నాను. నా శరీరంమీద నియంత్రణను మళ్లీ తెచ్చుకుతీరాలి, జీవితంపట్ల నాకున్న కలలను నిజం చేసుకుని తీరాలి.. అని నాకు నేను స్పష్టం చేసుకున్నాను.
ఈ కొత్త నిర్ణయంతో నేను, డా. రామిరెడ్డిగారి సలహాను కోరాను. అధునాతన వైద్యవిధానాలలో దిట్ట అని పేరున్న ఆ డాక్టర్ గారు నా జీవితం మార్చేయగల ‘ఇంట్రా గ్యాస్టిక్ బెలూన్ ప్రొసీజర్’ను నాకు సూచించారు. ఒక గాలితీసేసిన బెలూన్ను కాప్స్యూల్రూపంలో నా కడుపులోకి పంపి, అక్కడ ఆ బెలూన్లో గాలిని నింపుతారు. ఈ ప్రొసీజర్కు – ఎండోస్కోపీ చేయటం కానీ, మత్తును కలిగించే ఎనస్థీషియా ఇవ్వటం కానీ ఉండదు. ఒక అవుట్ పేషెంట్గానే, కొన్ని నిమిషాలలోనే ఈ ప్రొసీజర్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ వల్ల – నాకు దాదాపు నిత్యమూ కదుపునిండిన భావన ఏర్పడి ఉంటుంది. ఈ ప్రొసీజర్ను చేసినట్లయితే, నాకు నా ఆహారపుటలవాట్లమీద మళ్లీ పూర్తి నియంత్రణ కలిగి, బరువుతగ్గాలనే నా కోరికకు ప్రతిక్షణమూ నేను దగ్గర అవుతుంటానని నాకు ఆ డాక్టర్గారు హామీని ఇచ్చారు.
ఊబకాయాన్ని తగ్గించుకుని సాధారణస్థితిలో ఉండటానికి ఈ ఇంట్రాగ్యాస్టిక్ బెలూన్ అనేది ఒక నాన్-సర్జికల్ ప్రొసీజర్, తమ శారీరకబరువు తగ్గించుకోవాలన్న కోరికతో, జీవనశైలి విధానాలను పలురకాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇదొక దివ్యమైన మార్గం. కొద్దిపాటి జీవనశైలిమార్పులతో, ఈ ప్రొసీజర్ వల్ల- గణనీయమైన రీతిలో శారీరక బరువును, అంటే, దాదాపు 15 నుంచి 20 శాతం వరకూ తగ్గించుకునే వీలుంటుందని డాక్టర్ రామిరెడ్డిగారు నాకు వివరించారు.
ప్రొసీజర్ రోజున నేను చాలా ఆందోళనతో ఉన్నమాట నిజం. కానీ, డాక్టర్గారు, వారి బృందమూ – మళ్లీ నాకు ప్రొసీజర్ వివరాలను, దానివల్ల కలిగే లాభాలను సవివరంగా చెప్పి, నా భయాలను పోగొట్టి, నాలో ఛైర్యాన్ని నింపి, ఆశల్ని చిగురింపచేశారు. కేవలం కొన్ని గంటల సమయం పట్టే ఈ ప్రొసీజర్ బహుత్వరితంగా పూర్తయి, నేను నా కొత్తజీవితమార్గ స్థాహా పోడవ కొద్దిగా మార్చుకుని, జీవనశైలిలో కొంత కొత్తదనాన్ని నింపుకుని, తగిన వ్యాయామంతో, దృఢనిశ్చయంతో నేను ముందడుగు వేశాను. కదుపులో
ఉన్న ఇంట్రాగ్యాస్టిక్ బెలూన్ ఫలితంగా, నాకు త్వరితంగానే కదుపునిండిన భావన కలిగేది. దానితో శారీరక బరువు క్రమంగా తగ్గటం కనిపించసాగింది. క్రమబద్ధమైన సూచనలతో, సలహాలతో, డాక్టర్గారు, వారి బృందమూ, నా ప్రతి ముందడుగులోనూ నావెంటనే ఉండి, నన్ను ఆ సక్రమమార్గంలో నడిపించారు. కొన్ని నెలలు గడిచాయి. నాలో కనిపిస్తున్న మార్పు నాకే అర్థమవుతూ వచ్చింది. అద్దంలో చూసుకుంటున్నప్పుడు, ఆ మార్పు మరింత స్పష్టంగా కనిపించేది, దానితో నా ఆత్మవిశ్వాసమూ పెరగటం నాకే తెలుస్తూవచ్చింది. జీవితం నాకొక అనూహ్యమైన బహుమతి ఇస్తోందని నేను అస్సలు ఊహించని ఆ సమయంలో – పెళ్లయి అప్పటికి అయిదేళ్లయిన తర్వాతకు నేను గర్భిణిని అన్న విషయం తెలిసింది. అంటే, ఈ ఇంట్రాగ్యాస్టిక్ ప్రాజీజర్ వల్ల నా పునరుత్పత్తి సామర్థ్యం కూడా దారిలో పడిందన్నమాట! అనూహ్యమైన ఈ పరిణామం, నాలో మరింత ఆనందాన్ని నింపింది. ఊబకాయం తగ్గించుకోవాలనే నా మంచి నిర్ణయం- నన్ను నా ఆత్మానందానికీ, స్వప్నసాకారానికీ చేరువ చేయటం సంబరాన్ని కలిగించింది. ఇప్పుడు నా ఒడిలో – ఓ అందాల పాపాయికూడా ఉంది. ఈ పాపాయితో… నేను నా స్వప్నాలన్నింటినీ సాకారం చేసుకున్నట్లే అయింది. మాతృత్వానికి మించిన ఆనందం ఏ మహిళకైనా ఏముంటుంది!!
ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతో, చాక్టర్ల నిరంతర పర్యవేక్షణతో నా గర్భధారణ జీవితం సాఫీగా, ఆనందంగా, అద్భుతంగా, పండంటి ఫలితంతో కొనసాగింది. నా దృఢనిర్ణయం, పట్టుదల నాకు ఎలాంటి సత్ఫలితాన్ని ఇచ్చిందో చూసిన ఎందరిలోనో ఇది స్ఫూర్తిని నింపింది. తమ విప్లవాత్మమైన వైద్యవిధానంతో డాక్టర్ రామిరెడ్డిగారు. నా ఒక్క జీవితాన్నే కాదు, విశ్వవ్యాప్తంగా అనేకులలో విశ్వాసం నింపుతూ, అద్భుత మార్పులకు కారకులవుతున్నారు. వారికి ఎన్ని ధన్యవాదాలు తెలిపినా, అది తక్కువేనని నాకు తెలుసు! ఇప్పుడు – నా ఒడిలో ఓ అందాల పాపాయి… ఈ చిన్నిపాపాయితోనే కదా నా జన్మ ధన్యమయినట్లు.. నా మాతృత్వపు కల పండినట్లు! అయినా, ఓ మహిళకు మాతృత్వంకన్నా మించిన వరం ఏముంటుంది చెప్పండి!!
నిరాశనుంచి ఆశలోకి, ఊబకాయంనుంచి ఆరోగ్యజీవనంలోకి, బిడ్డల్లేని స్థితినుంచి మాతృత్వంలోకి నా ప్రయాణం కలల్ని నిజాలు చేసుకోవాలనే దీక్ష ఉంటే అది సాధ్యమేనని స్పష్టం చేసే నిదర్శనంగా నిలుస్తోంది. నా అద్భుతప్రయాణం వేలాదిమందికి స్ఫూర్తిని కలిగిస్తూ, జీవితంలో అతిగొప్ప ద్వితీయ అవకాశం పొందటానికి మార్గంగా నిలుస్తుందని నేను మనసారా ఆశిస్తున్నాను.
Dr. Rami Reddy Y
Senior Consultant – Interventional & Therapeutic Gastroenterology
Star Hospitals, Financial District, Hyderabad.
Contact: 07969250191